ఈ విశ్వం ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: నిహారిక పోస్ట్ వైరల్ | Niharika Konidela Instagram Post On Mothers Day Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Niharika Konidela: ఈ విశ్వం ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: నిహారిక పోస్ట్ వైరల్

Published Sun, May 14 2023 3:43 PM | Last Updated on Sun, May 14 2023 7:22 PM

Niharika Konidela Instagram Post On Mothers Day Goes Viral On Social Media - Sakshi

మెగా డాటర్ నిహారిక కొణిదెల టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై యాంకర్‌గా మెప్పించిన నిహారిక.. ఆ తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం డెడ్‌ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఓ వీడియోను షేర్ చేశారు. అమ్మకు మేకప్ వేస్తూ ఆమె గొప్పదనం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

(ఇది చదవండి: అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక)

నిహారిక తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'అమ్మ నా చిన్నప్పుడు నన్ను చాలా బాగా అలంకరించేది. ఇన్‌ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా. అమ్మ నన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. ఈ ప్రత్యేకమైన రోజు అమ్మ బయటికి వెళ్లేందుకు అమ్మను రెడీ చేస్తున్నా. ఇలా చేయడం నాకు ఎంతో ఇష్టం. ఈ ప్రపంచం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అమ్మ.' అంటూ వీడియోను పోస్ట్ చేసింది.  కాగా.. నిహారిక నటించిన వెబ్ సిరీస్ ఈనెల 19 నుంచి హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

(ఇది చదవండి: బెడ్‌పై ఒకరు, మైండ్‌లో మరొకరు.. నిహారిక డైలాగ్‌పై ట్రోలింగ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement