చైనాలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు మాత్రం వీటన్నికీ భిన్నంగా ఆలోచించాడు. అమ్మకు జీవిత కాలం గుర్తుండిపోయే బహుమతినిచ్చాడు. మదర్స్ డే రోజు (మే 12)న తన తల్లిని గ్వో ఇఫాన్ జ్యుయెలరీ షాప్‌నకు తీసుకెళ్లాడు. ‘నీ చేతికి ఏ ఉంగరం బాగుంటుందమ్మా’ అని అడిగాడు. విషయమేంటో ఆమెకు అర్థం కాలేదు. కుమారుడు అడుగుతున్నాడు కదా అని ఆమె తనకు నచ్చిన ఓ ఉంగరాన్ని చూపించారు. దాని ధరెంతో తెలుసుకున్న ఇఫాన్ నేరుగా బిల్ కౌంటర్ దగ్గరకెళ్లి జేబులో నుంచి రెండు పిగ్గీ బ్యాంక్‌లను తీశాడు.