Mother's Day 2023: Virat Kohli, Sachin Tendulkar Adorable Post Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Mothers Day 2023: అమ్మ.. అత్తమ్మ ఫొటోలతో కోహ్లి! అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్న సచిన్‌!

Published Sun, May 14 2023 12:50 PM | Last Updated on Sun, May 14 2023 1:14 PM

Mothers Day 2023: Virat Kohli Sachin Tendulkar Adorable Post Pics Goes Viral - Sakshi

మదర్స్‌ డే విషెస్‌ చెప్పిన విరాట్‌ కోహ్లి- సచిన్‌ టెండుల్కర్‌

Mothers Day 2023- Virat Kohli- Sachin Tendulkar: స్వచ్ఛమైన ప్రేమ, ఆత్మీయతకు ప్రతిరూపం అమ్మ. అమ్మంటే అంతులేని అనురాగం. కడుపులో నవమాసాలు మోసి.. కని పెంచిన బిడ్డను కంటికి రెప్పలా కాచే దైవం. కడుపున పుట్టిన బిడ్డల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా భర్తతో కలిసి అనేకానేక త్యాగాలు చేసి వారు కోరుకున్న జీవితాన్ని ఇచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసే సహనశీలి. 

అలాంటి మాతృమూర్తి గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. ముఖ్యంగా అబ్బాయిలు చాలా మంది అమ్మకూచిగానే ఉంటారు. మన టీమిండియా స్టార్లు సచిన్‌ టెండుల్కర్‌, విరాట్‌ కోహ్లి కూడా ఆ కోవకు చెందినవారే!

అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు
మాతృ దినోత్సవం సందర్భంగా అందమైన ఫొటోలను పంచుకున్నారు ఈ సెంచరీల వీరులు. క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండుల్కర్‌.. ‘‘కృత్రిమ మేధ(AI)తో అద్భుతాలు చేస్తున్న ఈ నవయుగంలో.. ఒక్క అమ్మ(AAI- ఆయి) స్థానాన్ని మాత్రం దేనితో భర్తీ చేయలేం’’ అంటూ తల్లి తనను దీవిస్తున్న ఫొటోను పంచుకున్నాడు. అద్భుతమైన క్యాప్షన్‌తో అమ్మపై ఉన్న అనంతమైన ప్రేమను చాటుకున్నాడు.

అమ్మ.. అత్తమ్మ.. వామిక తల్లి!
ఇక విరాట్‌ కోహ్లి సైతం  మదర్స్‌ డేను పురస్కరించుకుని తన తల్లి సరోజ్‌ కోహ్లి, అత్తగారు ఆషిమా శర్మల ఫొటోలను పంచుకున్నాడు. వారిద్దరితో పాటు తన సతీమణి అనుష్క శర్మ తమ గారాల పట్టి వామికను ఎత్తుకుని ఉన్న చిత్రాన్ని షేర్‌ చేస్తూ ఆమెకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. కోహ్లి ఈ మేరకు చేసిన ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఐపీఎల్‌-2023లో
కాగా వంద శతకాల వీరుడు సచిన్‌ టెండుల్కర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌ మెంటార్‌గా ఉన్న సచిన్‌.. అదే జట్టు తరఫున తన కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ ఈ ఏడాది అరంగేట్రం చేయడంతో ఫుల్‌ ఖుషీగా ఉన్నాడు.

ఇక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ విరాట్‌ కోహ్లి నేడు (మే 14) రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగనున్న మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ సీజన్‌లో కోహ్లి ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్‌ ఆడి 420 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82*. 

చదవండి: అంపైర్‌తో వాగ్వాదం.. హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్‌ షాక్‌! భారీ జరిమానా
'ఇంటర్మీడియట్‌' పాసైన టీమిండియా స్టార్‌ ఓపెనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement