
నా జీవితం అమ్మకే అంకితం
అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’... అమ్మ రుణం జన్మజన్మలకూ తీర్చుకోలేనిది. అమ్మపాలనలోనే మనం నిజమైన మనుషులుగా సమాజంలో సుస్థిర స్థానం సంపాదించుకోగలుగుతాం. ఈ ఆధునిక యుగంలో చాలామంది... అమ్మకు దూరంగా బతుకుతున్నారు. అది ఒక రకంగా శాపమనే చెప్పాలి. మా అమ్మ నాకు నేర్పించిన ఎన్నో మంచి విషయాలు కొండంత అండగా నిలిచాయి.
అందుకే నేను షూటింగ్ లొకేషన్స్‌లో కానీ మరే ఇతర ప్రాంతాలకు వెళ్లినా... అక్కడికి వచ్చిన అందరినీ నా వాళ్లుగా, నా పిల్లలుగా భావిస్తాను. అలాంటి క్షణాలన్నీ నాకు మా అమ్మను గుర్తు చేస్తాయి. జీ తెలుగులో మే 22వ తేదీ మధ్యాహ్నం ప్రసారం కాబోతున్న మెగా సీరియల్ ‘గృహ ప్రవేశం’లో కూడా పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి కటువుగా ఉండే అమ్మగా కనిపించబోతున్నాను. ఆద్యంతం మానవ సంబంధాలను అందంగా ఆవిష్కరించే ‘గృహ ప్రవేశం’ మెగా సీరియల్‌ను చూసి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.