
మాతృదేవోభవ..!
‘అమ్మ అందించిన సహకారంతోనే నేను ఐపీఎస్ చదవి.. ఇంతటి స్థాయిలో ఉన్నా. అమ్మరుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.. చిన్నప్పటినుంచే ఎంతో క్రమశిక్షణ నేర్పించారు..’అని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాదర్శి డాక్టర్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు.
అమ్మ..రెండక్షరాలు. అనురాగ చిహ్నాలు. ఆత్మీయతకు సంకేతాలు. సృష్టిలోని జీవరాశులన్నింటికీ మూల కారకాలు. ఆప్యాయత ఆమె సొంతం. సహనానికి మరో రూపం. అందుకే తల్లిది అద్వితీయ స్థానం. జీవితంలో ఆమెకు నిత్యస్మరణీయ ప్రాధాన్యం. తొలిగురువు. ఎదిగే..ప్రతీ అడుగులో నడిపించే మార్గదర్శి. ‘గీతా’కారుడు కృష్ణుడైనా, శాంతి దూత క్రీస్తయినా అమ్మ ఆలన,పాలనలోనే అంతటి వారయ్యారు. ఇక..మహ్మద్ ప్రవక్తయితే స్వర్గం ఎక్కడుంటుందీ అంటే తల్లి పాదాల చెంతనే అని సందేశమిచ్చాడు. అలాంటి మాతృమూర్తి...మనిషి జీవితంలో అమృతమూర్తి. ప్రేరణ నిచ్చే చైతన్యశీలి. నిత్యమై..సత్యమై వందనాలందుకునే త్యాగశీలి. ఆమెకు ‘మాతృ దినోత్సవ వేళ’ పాదాభివందనం..
అలంపూర్, న్యూస్‌లైన్: ‘అమ్మ అందించిన సహకారంతోనే నేను ఐపీఎస్ చదవి.. ఇంతటి స్థాయిలో ఉన్నా. అమ్మరుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.. చిన్నప్పటినుంచే ఎంతో క్రమశిక్షణ నేర్పించారు..’అని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాదర్శి డాక్టర్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం అలంపూర్‌కు వచ్చిన ఆయన తన ఇంటికి వెళ్లి తల్లి ప్రేమమ్మను పలకరించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విజ్ఞానకేంద్రాన్ని సందర్శించారు. అక్కడే విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. రాష్ట్రంలో ఉన్న 384 గురుకుల పాఠశాలల్లో రెండులక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. జిల్లాలో 45 విజ్ఞానకేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు 24వేల సీట్లు ఉండగా, 70వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. క్రమశిక్షణతో మేలి గితే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం ఉంటుందన్నారు.
అమ్మ చూపించే ప్రేమానురాగాల ముందు చంద్రుడి చల్లదనం చిన్నబోతుంది. అమ్మచేతి కమ్మని వంటకం అమృతాన్నీ అధిగమిస్తుంది. సృష్టినే సృష్టించిన బ్రహ్మ అరుునా అ మ్మ కాన్నా చిన్న. తన ప్రాణ ం ఫణంగా పెట్టి బిడ్డకు జీవం పోసే అమ్మ ముందు దే వదేవతలూ దిగదుడుపే. తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీర్చే తల్లి రుణం ఎన్నటికీ తీర్చలేం. అందుకే సదా కన్న తల్లి దేవత. ఈ జీవితానికి ఆమె విధాత.
- న్యూస్‌లైన్, జడ్చర్లటౌన్