
మాతృ దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటి సమంత తన తల్లి నినెట్టే ప్రభుకి శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి ప్రార్థన చేస్తున్న ఒక ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ మా అమ్మ ప్రార్థనలో మ్యాజిక్ ఉంటుందని నేను ఎప్పుడు నమ్ముతాను. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఎలాగైతే అమ్మ దగ్గరికి వెళ్లి.. అమ్మ నా కోసం ప్రార్థించవా అని అడిగేదానినో ఇప్పటికి కూడా అలాగే అడుగుతున్నాను. అమ్మ ప్రార్థనలు ఫలిస్తాయని నా నమ్మకం. అమ్మ ప్రార్థనల్లో ప్రత్యేకత ఏమిటంటే.. ఆమె ఎప్పుడూ కూడా తన కోసం ప్రార్థన చెయ్యరు. దేవునికి రెండో రూపమే అమ్మ. లవ్ వ్యూ మా’ అని అని సామ్ తన సందేశాన్ని ఉంచారు. సినీ తారలే కాకుండా.. పలువురు ప్రముఖులు కూడా మాతృమూర్తులపై వారికి గల ప్రేమను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే.