Samantha And Prabhas Special Birthday Wishes To Deepika Padukone - Sakshi
Sakshi News home page

Deepika Padukone Birthday: దీపికా బర్త్‌డే.. ప్రభాస్‌, సమంతల స్వీటెస్ట్‌ విషెస్‌

Published Wed, Jan 5 2022 6:53 PM | Last Updated on Wed, Jan 5 2022 8:21 PM

Deepika Padukone Birthday Prabhas And Samantha Wishes - Sakshi

Deepika Padukone Birthday Prabhas And Samantha Wishes: దీపికా పదుకొణె పేరుకే బాలీవుడ్ హీరోయన్‌ అయనా తెలుగు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్‌ ఉన్న హీరోయిన్. 2006లో ఐశ్వర్య అనే కన్నడ చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించింది ఈ అమ్మడు. తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ సరసన 'ఓం శాంతి ఓం' సినిమాతో బీటౌన్‌లో అడుగుపెట్టి 'బెస్ట్ ఫీమేల్‌ డెబ్యూ' అవార్డు అందుకుంది. తండ్రి ప్రకాశ్‌ పదుకొణె మాజీ బ్యాడ‍్మింటన్‌ కాగా తన నటనతో అనేక అభిమానులను సొంతం చేసుకుంది స్మైల్‌ బ్యూటీ. కళ్లతోనే హావాభావాలు పలికించడం దీపికాకు ఉన్న ప్రధాన ఆకర్షణ. 2017లో 'ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్ ఆఫ్‌ గ్జాండర్‌ కేజ్‌' సినిమాతో హాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి వావ్‌ అనిపించింది. 1986 జనవరి 5న డెన్మార్క్‌లో జన్మించిన దీపికా 36వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు తారలు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. 

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. దీపికాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'ప్రకాశవంతమైన నవ్వుతో ఉండే అమ్మాయి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎనర్జీ, టాలెంట్‌తో 'ప్రాజెక్ట్‌ కే' సెట్‌లో వెలుగులు నింపే నీకు ఎప్పుడూ ఆల్ ది బెస్ట్‌' అంటూ ఇన్‌ స్టా స్టోరీ షేర్‌ చేశాడు మిస్టర్ పర్‌ఫెక్ట్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్‌ కే' సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరిపై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఇందులో ప్రభాస్‌.. దీపికాకు చెయ్యి అందిస్తున్న సీన్‌ను చూడవచ్చు. 


 

ప్రభాస్‌తోపాటు స్టార్ హీరోయిన్‌ సమంత కూడా దీపికాకు విష్‌ చేసింది. తన ఇన్‌ స్టా స్టోరీలో 'మీకు ఇది చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు కావాలని, ప్రతీరోజు ప్రేమతో ప్రారంభమై ప్రశాంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నా. లోపల బయట అత్యంత అందంగా ప్రకాశించే దీపికా పదుకొణెకు హ్యాపీ బర్త్‌డే' అని రాసుకొచ్చింది. వీరితోపాటు అనుష్క శర్మ, సారా అలీ ఖాన్‌, అనన్య పాండే, జాన్వీ కపూర్‌లు కూడా దీపికాకు సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌ డే  విష్‌ చేశారు. 



ఇదీ చదవండి: ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా.. పాపులర్‌ నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement