స్మార్ట్‌ కిడ్‌.. తల్లికే షాకిచ్చాడు..! | 9 Years Old Smashes Piggy Bank And Gives A Surprise Gift To His Mother | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ కిడ్‌.. తల్లికే షాకిచ్చాడు..!

Published Thu, May 16 2019 8:01 PM | Last Updated on Thu, May 16 2019 9:11 PM

9 Years Old Smashes Piggy Bank And Gives A Surprise Gift To His Mother - Sakshi

బీజింగ్‌ : ఈ తరం పిల్లలకు పెద్దలంటే బొత్తిగా గౌరవం లేదు. తల్లిదండ్రుల్ని కూడా లెక్క చేయరు. అనే మాటలు వింటూనే ఉంటాం..! అడిగింది కొనివ్వలేదని గొడవలకు దిగే పిల్లల్ని కూడా చూస్తుంటాం..! కానీ చైనాలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు మాత్రం వీటన్నికీ భిన్నంగా ఆలోచించాడు. అమ్మకు జీవిత కాలం గుర్తుండిపోయే బహుమతినిచ్చాడు. మదర్స్‌ డే రోజు (మే 12)న తన తల్లిని గ్వో ఇఫాన్‌ జ్యుయెలరీ షాప్‌నకు తీసుకెళ్లాడు. ‘నీ చేతికి ఏ ఉంగరం బాగుంటుందమ్మా’ అని అడిగాడు. విషయమేంటో ఆమెకు అర్థం కాలేదు. కుమారుడు అడుగుతున్నాడు కదా అని ఆమె తనకు నచ్చిన ఓ ఉంగరాన్ని చూపించారు. దాని ధరెంతో తెలుసుకున్న ఇఫాన్‌ నేరుగా బిల్‌ కౌంటర్‌ దగ్గరకెళ్లి జేబులో నుంచి రెండు పిగ్గీ బ్యాంక్‌లను తీశాడు.
(చదవండి : బర్త్‌డేకు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులపై..)

వాటిని పగులగొట్టి.. ఆ మొత్తం లెక్కిస్తే.. అవి రూ.15 వేలు (1500 యువాన్‌లు)గా ఉన్నాయని తేలింది. వాటితో ఆ గోల్డ్‌ రింగ్‌ని ఖరీదు చేసి.. అమ్మకు అందించాడు. ఇక కుమారుడు చేసిన పనికి ఆ తల్లి ఆనందంతో పొంగిపోయారు. ‘అమ్మ మాకోసం చాలా కష్టపడుతుంది. ఆమె చేతులకు బంగారు ఆభరణాలు లేవు. ఆమెకు ఏదైనా మంచి బహుమతి ఇద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. అమ్మ, అమ్మమ్మ ఇచ్చిన పాకెట్‌మనీని రెండేళ్లుగా పొదుపు చేసి ఈ గిఫ్టులు కొన్నాను’  అని చెప్పుకొచ్చాడు ఇఫాన్‌. ఈ ముచ్చటైన సంఘటన లింక్వాన్‌ పట్టణంలో మే 12న జరిగింది. తన తల్లితో పాటు ఆమె తల్లికి కూడా ఇఫాన్‌ నెక్లెస్‌ కానుకగా ఇవ్వడం మరో విశేషం.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
తల్లీని సర్ప్రైజ్ చేసిన తొమ్మిదేళ్ల బాలుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement