ముంబయి: అమ్మంటే తీపి.. అమ్మంటే పాయసం.. అమ్మంటే అమృతం ఇలా చెప్పుకుంటూ పోతే రాతకే కాదు.. వినేందుకు కూడా ఎప్పటికీ అంతనంత ఎత్తులో గొప్పగానే ఉంటుంది అమ్మ గురించి చెబుతుంటే. కానీ, అమ్మ ఒడి ఊయల, అమ్మ ఊసులు ఇలా అనుకుంటే అలా చటుక్కున వాలిపోతాయి. అందుకే అమ్మంటే ఎప్పటికీ మనలో.. మనతో ఉండే మనకే తెలియని, గుర్తించలేని గొప్ప ప్రాణం. అందుకే.. ఏం జరిగినా అమ్మా అని అనకుండా ఉండలేమేమో..
మాతృమూర్తి దినోత్సవం సందర్భంగా ఎందరో అమ్మలకు కృతజ్ఞత చెప్పుకునే సందర్భం రానే వచ్చింది. ఆదివారం దేశ వ్యాప్తంగా మదర్స్ డే సందడి మొదలైంది. అందులో భాగంగా బాలీవుడ్ దిగ్గజాలంతా కూడా అమ్మకు కృతజ్ఞతలు చెప్పడంతోపాటు అమ్మంటే వారికి ఎంత ప్రేమ ఉందో ట్విట్టర్ల ద్వారా చెప్పారు. వారిలో ముందుగా బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి లేకుంటే తాను ఈ రోజు అసలు బాలీవుడ్లోనే లేనంటూ స్పందించారు. అమ్మ ప్రేమముందు ఇంకేమాట్లాడటానికి పదాలే లేవని చెప్పారు. అలాగే, ప్రీతీజింటా, అలియా భట్ హ్యాపీ మదర్స్ డే అంటూ ట్వీట్ చేశారు.
|
అలియా తల్లి సోని రజ్దాన్ కూడా మదర్స్ డే విషెస్ చెబుతూ తన తల్లి ట్విట్టర్ చదవదు కాబట్టి తానే వెళ్లి అమ్మకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటానని అన్నారు. నటి జెనీలియా కూడా విషెస్ చెబుతూ గొప్ప తల్లివని చెప్పుకునేందుకు ఉదాహరణగా నిలిచిన నీకు నా కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. అలాగే, ఇంకెంతోమంది బాలీవుడ్ నటులు.. తమను, కొట్టి తిట్టయినా వెలుగుబాటలు చూపించిన నీకు మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. ఒక మహిళగా రాణించడం గొప్ప విషయం అంటే.. తల్లిగా మారడం అనేది ఇంక అత్యంత గొప్ప విషయం అంటూ మళయాల నటుడు మోహన్ లాల్ స్పందించారు.
'తను లేకుంటే నేను ఇక్కడ లేను'
Published Sun, May 8 2016 11:29 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement