నేడు మాతృ దినోత్సవం | today Mother's Day in 2014 | Sakshi
Sakshi News home page

నేడు మాతృ దినోత్సవం

Published Sun, May 11 2014 1:44 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

నేడు మాతృ దినోత్సవం - Sakshi

నేడు మాతృ దినోత్సవం

సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాలన్నా, వివిధ రంగాల్లో రాణించాలన్నా, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నా దాని వెనుక తల్లి పాత్ర ఉంటుంది.

శ్రీకాకుళం కల్చరల్/పాలకొండరూరల్, న్యూస్‌లైన్: సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాలన్నా, వివిధ రంగాల్లో రాణించాలన్నా, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నా దాని వెనుక తల్లి పాత్ర ఉంటుంది. పిల్లల భవిష్యత్ కోసం నిత్యం ఆరాటపడేది తల్లి మాత్రమే. తను రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడినా, తన బిడ్డ సుఖంగా జీవించాలని కోరుకునేది తల్లే. మాతృమూర్తి త్యాగం వెలకట్టలేనిది.
 
 మదర్స్ డే ఏర్పడిందిలా...
 మదర్ ఆఫ్ ద గాడ్స్ రియాకు నివాళులర్పించే కార్యక్రమానికి మొదటిసారిగా గ్రీసు దేశస్తులు శ్రీకారం చుట్టారు. ఇంగ్లాండులో తల్లుల గౌరవార్థం ‘మదరింగ్ సండే’ నిర్వహించే వారు. 1910లో జర్విస్ జ్ఞాపకార్థం యూఎన్‌ఏలోని వర్జీనియా రాష్ట్రం ‘మదర్స్‌డే’ను గుర్తించింది. జర్విన్ కుమార్తె దీనికోసం బాగా ప్రచారం చేశారు. 1914లో అమెరికా మదర్స్‌డేను అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మదర్స్‌డేను మే రెండో ఆదివారం జరుపుకొంటున్నారు.
 
  రెక్కల కష్టంతో ఐదుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశా...
 మాది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. ఐదుగురు కుమార్తెలు. పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడే భర్తకు ఆస్మా వచ్చింది. ఓ వైపు మందుల కొనుగోలుకు, మరోవైపు పిల్లల పోషణకు చాలా శ్రమించాల్సి వచ్చేది. పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడే  భర్త మరణించారు. పిల్లల పోషణ భారం నాపై పడింది. వారిని పెద్దవారిని చేసేందుకు రెక్కలుముక్కలు చేసుకుని కష్టపడ్డాను. ఫాజుల్‌బేగ్ పేటలో చిన్న టీకొట్టు పెట్టాను. ఇంట్లో అప్పడాలు, వడియాలు తయూరు చేస్తే... వాటిని కుమార్తెలు పట్టణంలో విక్రరుుంచేవారు. కుమార్తెలు లక్ష్మి(ఒప్పంగి), విజయలక్ష్మి(సత్యవరం), రమాదేవి(సంతకవిటి), పుణ్యవతి(కృష్ణాపార్కు), చంద్రకళ (కళ్లేపల్లి)లను పెద్దగా చదివించలేకపోయూను. వారు వయసులోకి వచ్చాక రెండేళ్లకు ఒకరికి చొప్పున అందరికీ వివాహాలు మాత్రం చేయగలిగాను. నా భాద్యతలు తీరిపోయాయి. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. పండగలకు మా కూతుళ్లు, అల్లుళ్లు వస్తుంటారు. చాలా ఆనందంగా ఉంటుంది.  ఇప్పుడు నా కాళ్లు పనిచేయడం లేదు. ఇంటి వద్దనే వడియాలు, అప్పడాలు ఆర్డర్‌పై తయారు చేసి అమ్ముతుంటాను. కష్టంవస్తే కుమార్తెలే కొడుకుల్లా ఆదుకుంటున్నారు. ప్రభుత్వం రూ.200 పింఛన్ ఇస్తోంది. వీటితో నెలనెలా మందులు కొనుగోలు చేస్తున్నాను. అరుుతే, తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ రోజు ఉందని ఇప్పుడే తెలిసింది. దీనికోసం వివరిస్తే చాలా సంతోషం కలిగింది.
 -శిల్లా అనసూయమ్మ,
 ఫాజుల్‌బాగ్‌పేట, శ్రీకాకుళం
 
 అమ్మే సర్వస్వం
 శ్రీకాకుళం పట్టణంలోని సానావీధికి చెందిన త్రినాథ్‌కు తల్లి అప్పలనర్సమ్మ అంటే ప్రాణం. రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నా ప్రతి రోజు ఆమె బాగోగులు చూసుకుంటాడు. తనకంటూ ఇల్లు లేకపోవడంతో అరసవల్లి కల్యాణ మండపంలో ఉంచు తూ సేవలందిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే తల్లిని రిక్షాలో తీసుకొచ్చి న్యుకాలనీ లోని సత్యసాయి మంది రం సమీపంలోని డైమండ్ పార్కు వద్ద విడిచిపెడతాడు. అక్కడ న్యూ కాలనీ సత్యసారుు సేవా సమితి వారు సరఫరా చేసే భోజనాన్ని అందజేస్తాడు. సాయంత్రం టీ ఇస్తాడు. చీకటి పడే సమయూనికి సురక్షితంగా పడుకునేందుకు వీలుగా కల్యాణ మండపానికి రిక్షాపై తీసుకెళ్తాడు. దీనిని ప్రతి రోజు దినచర్యగా మార్చుకుని తల్లిబాగోగులు చూసుకుంటున్నాడు.
 - న్యూస్‌లైన్, శ్రీకాకుళం కల్చరల్
 
 అవిటి బాలుని సేవలో...
 సరుబుజ్జిలి మం డలం పురుషోత్తపురం పంచాయ తీ పరిధి ఫకీర్‌సాహెబ్‌పేటకు చెందిన బత్తల ఆదినారాయణ, దేవమణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు ప్రవీ ణ్‌కుమార్‌ను పుట్టుకతోనే పోలియో మహమ్మారి ఆవరించింది. కాళ్లు, చేతులు, నోరు, మెదడు చచ్చుపడి మంచానికే పరిమితయ్యాడు. ప్రాణం ఉన్న బొమ్మతో సమానంగా మారాడు. 12 ఏళ్లుగా తల్లే బాలునికి సర్వస్వంగా మారింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయేవరకు అన్ని అవసరాలను తల్లే తీరుస్తోంది.
 - సరుబుజ్జిలి, న్యూస్‌లైన్
 
 
 అమ్మ తాపత్రయం మరువలేనిది
 పిల్లలను చదివించి, ప్రేమగా లాలించి ఉన్నత స్థితికి చేరుకోవాలన్న మా అమ్మ రత్నాబాయి తాపత్రయం మరువలేనిది. మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది ఆమె. నాతో పాటు ఒక చెల్లెలు, ఒక అన్నయ్య, తమ్ముడు కూడా ఉన్నత స్థితిలో ఉండేందుకు చిన్ననాటి నుంచి అమ్మ చొరవ అంతా ఇంతా కాదు. సమాజంలో మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని బోధించిన తొలి గురువు అమ్మ. ఈ రోజున పది మందిలో గౌరవంగా బతుకుతున్నానంటే ఆమె చలవే. అమ్మకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఏ కష్టం లేకుండా చూసుకుంటాను.
 - ఎన్.తేజ్‌భరత్, ఆర్డీవో, పాలకొండ
 
 
 అమ్మే తోడు, నీడ
 నా విజయూనికి తల్లి కనకరత్నమే కారణం. ఉన్నత స్థారుులో ఉండాలని వెన్ను తట్టారు. అండగా నిలిచారు. వృత్తిరీత్యా నాన్న కాలంతో పరుగులు పెడుతుంటే అమ్మ దగ్గరుండి వెన్నంటి ప్రోత్సహించారు. నాతో పాటు అన్నయ్య, అక్క, చెల్లెలను కూడా చదువులో ముందుంచేందుకు అమ్మ కష్టం మరువలేనిది. కష్టం, సుఖం, ఉద్యోగపరమైన సమస్యలు ఏమైనా అమ్మతోనే చర్చిస్తా. ఆమె సలహాను గౌరవిస్తా.
 - ఎల్.చంద్రశేఖర్, సబ్‌ఇన్‌స్పెక్టర్, పాలకొండ
 
 
 ఉత్తమంగా తీర్చిదిద్దారు
 నలుగురికి ఉపయోగపడేలా సమాజంలో మెలగాలని ప్రతినిత్యం వెన్నుతడతారు. పవిత్రమైన వైద్యవృత్తిలో నమ్మి వ చ్చిన ఎందరికో ప్రాణాలు నిలపాలన్న మా అమ్మ శోభావతి కోరిక, సంకల్పం నెరవేర్చేందుకు కృషి చేస్తూనే ఉంటా. ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నత స్థితిలోఉద్యోగాలు నిర్వహించడానికి అమ్మే స్ఫూర్తి.
 - డాక్టర్ జె.రవీంద్రకుమార్, రెసిడెంట్ మెడికల్ అధికారి.
 ప్రాంతీయ ఆసుపత్రి, పాలకొండ
 
 
 ఇదంతా అమ్మ ఘనతే...
 నా వరకు అమ్మ వెంకటలక్ష్మే సర్వస్వం. జన్మనిచ్చి చదివించి, ప్రయోజకుడిని చేసి సమాజంలో నలుగురి వద్ద గౌరవం పొందుతున్నామంటే అది అమ్మ ఘనతే. నాతో పాటు అక్క కూడా సమాజంలో గౌరవమైన ఉద్యోగాన్ని చేయగలడానికి అమ్మ తోడ్పాటు ఎంతో ఉంది. అమ్మని తలుచుకోకపోతే ఆ రోజంతా ఏదో లోటుగా ఉంటుంది. ఏ పనిని అయినా ఆమెను సంప్రదించి చేపడితే ఫలప్రదమవుతుంది.                     - ఎం.సతీష్‌కుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement