
నెహ్రూనగర్ (గుంటూరు): గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రపంచ మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లెర్ప్ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2018 మంది మాతృమూర్తులతో.. 2018 కిలోల కేక్‌ను కట్ చేశారు. దీనికి సంబం ధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటుకు ప్రతిపాదనలు పంపించారు. అనంతరం ఏపీ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజ కుమారి, మంత్రి నక్కా ఆనందబాబు, లెర్ప్ అధ్య క్షుడు టీజేజీ శ్రీనివాస్ మాట్లాడారు.