
స్టార్లకే... స్టార్!
ప్రపంచంలో కనిపించేదంతా నమ్మకం మాత్రమే. అమ్మ ఒక్కటే నిజం. అందుకే... ఈ జగత్తులో అమ్మని మించిన సెలబ్రిటీ వేరొకరు లేరు. ఆఖరుకు... దేవుడైనా అమ్మ తర్వాతే. ‘అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే’ అని సినారె ఊరకే అన్నారా! ఈ రోజు మాతృ దినోత్సవం. నిజానికి అమ్మ రోజు కానిది ఏది? ఏడాదిలోని అన్ని రోజులూ అమ్మవే. కానీ... ప్రత్యేకించి ఒక రోజుని అమ్మకు ఎందుకు కేటాయించారు? దానికి సమాధానం ఒక్కటే.. ఆమెను స్మరించుకోవడానికీ, పూజించుకోడానికి. అలా చూస్తే... కేలండర్లోని పండగలన్నింటిలో అతి పెద్ద పండుగ ఇదే. ఇక్కడున్న స్టిల్స్ చూడండి... సినీ ప్రముఖులందరూ తమ అమ్మలతో ఎంత ముచ్చటగా పోజులిచ్చారో. వీళ్లందరూ కేవలం స్టార్లు. కానీ అమ్మ... ‘సూపర్ స్టార్‌లకే సూపర్‌స్టార్’.. ఏమంటారు?