ప్రియాంక పోయె ఐష్‌ వచ్చె! | Aishwarya Rai Bachchan To Star In Shahnaz Hussain’s Biopic Next movie | Sakshi
Sakshi News home page

ప్రియాంక పోయె ఐష్‌ వచ్చె!

Published Fri, Oct 27 2017 12:41 AM | Last Updated on Fri, Oct 27 2017 12:41 AM

Aishwarya Rai Bachchan To Star In Shahnaz Hussain’s Biopic Next movie

యస్‌... ఫేమస్‌ బ్యూటిషియన్‌ షానాజ్‌ హుసేన్‌ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో ఐశ్వర్యా రాయ్‌ నటించనున్నారట. కథానాయికగా పలు హిందీ చిత్రాల్లో నటించి, ఆరేళ్ల క్రితం చిన్న ఎన్టీఆర్‌ ‘శక్తి’లో క్యారెక్టర్‌ నటిగా కనిపించిన పూజా బేడీ ఈ చిత్రానికి దర్శకురాలు. ముందు ఈ సినిమాలో ప్రియాంకా చోప్రాని కథానాయికగా అనుకున్నారట.

అయితే, ప్రియాంక హాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ బయోపిక్‌ విషయమై క్లారిటీ ఇవ్వడంలేదట. దాంతో పూజా బేడీ మనసులోకి ఐశ్వర్యా రాయ్‌ వచ్చారు. ఈ చిత్రానికి కమలేశ్‌ పాండే కథ అందిస్తున్నారు. ఆయన కూడా షానాజ్‌ హుసేన్‌ పాత్రకు ఐశ్వర్యా రాయ్‌ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారు. చేస్తే ఐశ్వర్యే చేయాలన్నంతగా పూజా బేడీ ఫిక్స్‌ అయ్యారట. ఆమె అలా ఫిక్స్‌ కావడానికి కారణం ‘సరబ్‌జిత్‌’ సినిమా.

పంజాబ్‌కి చెందిన సరబ్‌జిత్‌ పొరపాటున పాక్‌ సరిహద్దుల్లోకి వెళ్లడం, అక్కడి ప్రభుత్వం అరెస్ట్‌ చేసి, జైల్లో పెట్టడం, తమ్ముణ్ణి విడిపించడానికి అక్క దల్బీర్‌ కౌర్‌ పడిన ఆరాటం, చివరికి సరబ్‌జిత్‌ పాక్‌ జైల్లోనే కన్ను మూయడం తెలిసిందే. ‘సరబ్‌జిత్‌’ సినిమాలో దల్బీర్‌ కౌర్‌ పాత్రను ఐష్‌ అద్భుతంగా చేయడంతో, ‘షానాజ్‌’ బయోపిక్‌కు ఐష్‌ న్యాయం చేస్తారని పూజా బేడి భావిస్తున్నారట. ఈ కథను ఐష్‌కి చెప్పారట కూడా. ఈ అందాల సుందరి ఇంప్రెస్‌ అయ్యారని టాక్‌. ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం ఐశ్వర్యా రాయ్‌ ‘ఫాన్నీ ఖాన్‌’లో నటిస్తున్నారు.

ఆ సినిమా డేట్స్‌ చూసుకుని, పూజా బేడీకి డేట్స్‌ ఇవ్వాలనుకుంటున్నారట. ఇంతకీ షానాజ్‌ హుసేన్‌ ఎవరంటే...సాందర్య సాధనాల వ్యాపారవేత్త. రసాయనాలు లేకుండా మూలికలతో తయారు చేసిన ఉత్పత్తులు షానాజ్‌ స్పెషాల్టీ. చిన్నగా మొదలై, పెద్ద స్థాయికి ఎదిగారామె. ‘పద్మశ్రీ’ అవార్డుగ్రహీత కూడా. ఉత్తమ మహిళా వ్యాపారవేత్తగా పేరుంది. టోటల్‌గా షానాజ్‌ది సక్సెస్‌ఫుల్‌ స్టోరీ. ఆమె జీవితం చాలామందికి ఆదర్శంగా ఉంటుందనే పూజా బేడీ ఈ బయోపిక్‌ తీయాలనుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement