ఫోర్బ్స్‌ జాబితాలో ప్రియాంక | priyanka Chopra eighth on Forbes highest paid TV actress list | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్‌ జాబితాలో ప్రియాంక

Published Thu, Sep 28 2017 3:12 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

priyanka Chopra eighth on Forbes highest paid TV actress list - Sakshi

లాస్‌ ఏంజెలిస్‌: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టీవీ తారల్లో బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా స్థానం దక్కించుకున్నారు. రూ.65.52కోట్ల పారితోషికం తీసుకుంటూ ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేసిన టాప్‌–10 జాబితాలో ప్రియాంకా ఎనిమిదో స్థానం కైవసం చేసుకున్నారు.

‘క్వాంటికో’ టీవీ షోతో పశ్చిమదేశాల్లో వినోద రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంకా.. ‘బేవాచ్‌’ సినిమాతో హాలీవుడ్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఇక, రూ.271.85కోట్ల ఆర్జనతో కొలంబియా నటి సోఫియా వెర్గారా వరసగా ఆరో ఏడాదీ టాప్‌–10లో నంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ‘ది బిగ్‌ బ్యాంగ్‌ థియరీ’ నటి కేలీ కుకో రూ.170.39 కోట్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచారు. గ్రేస్‌ అనాటమీ నటీమణి ఎలెన్‌ పోంపియో రూ.85 కోట్ల సంపాదనతో మూడో స్థానం దక్కించుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement