
సాక్షి,న్యూఢిల్లీ: గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళ-2017 జాబితాలో ప్రియాంకకు చోటుదక్కింది. అమెరికన్ టీవీ సీరియల్ క్వాంటికో సీజన్ 3లో నటించిన ప్రియాంక హాలీవుడ్‌నూ మెప్పించారు. ఇక ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల టాప్ 100 జాబితాలో ప్రియాంక చోప్రాకు 97వ స్ధానం దక్కింది. హాలీవుడ్‌లో ఆమె చేపట్టిన ప్రాజెక్టులు, ఛారిటీ పనులతో ప్రియాంకకు ప్రజాదరణ మరింత పెరిగింది.
ఫోర్బ్స్ జాబితాలో తొలిస్ధానం జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ దక్కించుకోగా, బ్రిటన్ ప్రధాని థెరెసా మే, పారిశ్రామికవేత్త మెలిందా గేట్స్ తర్వాతి స్ధానాల్లో నిలిచారు.భారత్ నుంచి ఈ జాబితాలో చోటు సాధించిన శక్తివంతమైన మహిళల్లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఎండీ చందా కొచ్చర్‌తో పాటు కిరణ్ మజుందర్ షా, రోష్ని నాడార్ మల్హోత్ర, శోభనా భార్తియాలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment