Actress Sridevi 60th Birthday Special Google Doodle Pic Viral - Sakshi
Sakshi News home page

Actress Sridevi: గూగుల్ డూడుల్‌లో శ్రీదేవి.. నెవ్వర్ బిఫోర్!

Published Sun, Aug 13 2023 10:22 AM | Last Updated on Sun, Aug 13 2023 10:36 AM

Actress Sridevi 60th Birthday Google Doodle Pic - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి.. సినీ ప్రేక్షకుల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి. ఇంత స్పెషల్ ఎందుకంటే ఈమె చరిష్మా అలాంటిది. హీరోయి‌న్‌గా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయడం సంగతి అటుంచితే.. ఆడియెన్స్ గుండెల్లో చెరిగిపోని చోటు సంపాదించింది. 2018లో ప్రమాదవశాత్తు ఈమె మరణించినప్పటికీ సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆమెని గుర్తుచేసుకుంటున్నారు. అలా శ్రీదేవి 60 బర్త్ డే (జయంతి) సందర్భంగా ఇప్పుడు ఆమెకు గూగుల్ అరుదైన రీతిలో గౌరవించింది. 

(ఇదీ చదవండి: 'జైలర్'కి మరో హీరో అనిరుధ్‌.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!)

తమిళనాడులో పుట్టిన శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరు మార్చుకుని శ్రీదేవి అయ్యింది. టీనేజ్‌లోనే హీరోయిన్ అయిపోయి.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఈమెకు మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి.. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఈమె కుమార్తెలు. 

ఇకపోతే తన నటనతో సినీ ప్రేక్షకుల్ని అలరించిన శ్రీదేవికి ఇప్పుడు అరుదైన గౌరవం లభించింది. ఈ బ్యూటీ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం, గూగుల్ తన డూడుల్‌గా శ్రీదేవి ఫొటోని డిస్‌ప్లే చేసింది. మంచి కలర్‌ఫుల్ లుక్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న శ్రీదేవిని చూస్తే.. 'దేవత' సినిమాలోని 'ఎల్లువచ్చే గోదారమ్మ' పాటనే గుర్తొస్తోంది. ఇలా గూగుల్ శ్రీదేవిని గౌరవించడం ఆమె ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఇప్పుడీ విషయం వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement