Bonny Kapoor
-
అక్క జాన్వీనే ఫాలో అవుతున్న ఖుషీ.. త్వరలోనే..
సినిమా ఇండస్ట్రీలో వారసులను పరిచయం చేసేందుకు దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. బాలీవుడ్లో అయితే వారసులను పరిచయం చేయడానికి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మంది వారసులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఆయన తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి–నిర్మాత బోనీ కపూర్ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ను హీరోయిన్ గా హిందీ చిత్రసీమకు పరిచయం చేయనున్నారని టాక్. శ్రీదేవి–బోనీ కపూర్ల పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ను తమ ధర్మా ప్రొడక్షన్స్‌పై ‘ధడక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేశారు కరణ్ జోహార్. త్వరలో కథానాయికగా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు ఖుషీ. ఇప్పుడు ఖుషీని పరిచయం చేసే బాధ్యతను కూడా కరణే తీసుకున్నారట. ధర్మా –కార్నర్‌స్టోన్ ఏజెన్సీ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్న ఆయన ఈ బ్యానర్లో ఖుషీ కపూర్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. -
ఎవరికీ తెలియని విషయాలతో...
శ్రీదేవి నాలుగేళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చింది. 13 ఏళ్ల వయసులో హీరోయిన్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్ టు హీరోయిన్.. ఆమె కెరీర్ 50 ఏళ్లు. ‘ఆల్ ఇండియా సూపర్ స్టార్’. హిందీ నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి విషయాలన్నీ అందరికీ తెలిసినవే. ఎవరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి అరుదైన విషయాలతో బోనీ కపూర్ ఓ డాక్యుమెంటరీ తీయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. భార్య హఠాన్మరణాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని, ఆమె మరణం గురించి పలువురు పలు రకాలుగా మాట్లాడుకోవడం ఆయన్ను మరింత బాధపెడుతోందని సన్నిహితులు అంటున్నారు. భార్య గురించి ఎవరికీ తెలియని విశేషాలతో ఆయన తీయనున్న డాక్యుమెంటరీలో శ్రీదేవి జీవితంలోని కీలక వ్యక్తులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని సమాచారమ్. జగదేక సుందరి కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటైన ‘మిస్టర్ ఇండియా’ దర్శకుడు శేఖర్ కపూర్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించనున్నారట. కచ్చితంగా ఈ చిత్రం కోసం శ్రీదేవి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. బోనీ నుంచి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి. -
శ్రీదేవి బయోపిక్ తీయనున్న బోనీ !
సాక్షి, ముంబై: ప్రముఖ నటి శ్రీదేవి గత నెల 24న దుబాయ్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే తెరుకుంటున్నారు. ప్రస్తుతం దివంగత నటి శ్రీదేవి జీవితం ఆధారంగా భర్త బోనీ కపూర్ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇటీవల బోనీకపూర్.. డైరెక్టర్ శేఖర్ కపూర్‌ను సంప్రదించారట. శ్రీదేవి నటించిన ‘మిస్టర్ ఇండియా’కు శేఖర్ కపూర్ డైరెక్టర్‌గా చేశారు. ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయనే బయోపిక్ తీయడానికి కరెక్ట్ అని బోనీ కపూర్ భావించారని తెలుస్తోంది. బోనీ కపూర్ నుంచి చిత్రంపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కొద్దిరోజుల క్రితం వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ శ్రీదేవి బయోపిక్ తీస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే దీనిపై ఆయన స్పందించి.. నేను ఆమె జీవితంపై డాక్యుమెంటరీ తీయటం లేదని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
వెక్కివెక్కి ఏడ్చిన బోనీ కపూర్
దుబాయ్ : అతిలోక సుందరి, అందాల తార శ్రీదేవీ మృతిపై యావత్తు ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. సినీలోకం శోకసంద్రంలో నిండిపోయింది. దుబాయ్ లో బోనీ కపూర్ మేనల్లుడు వివాహ వేడుకకు హాజరైన శ్రీదేవీ, అక్కడే మృతి చెందినట్టు తెలిసింది. అయితే మొదట ఆమె గుండెపోటుతో చనిపోయినట్టు ప్రకటించినా... ఫోరెన్సిక్ రిపోర్టు అనంతరం ఆమె మరణానికి గల కారణాలను వెల్లడించింది. ఆమె గుండెపోటుతో కాదని, ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడిపోవడం వల్ల చనిపోయినట్టు పేర్కొంది. అయితే అపస్మారక స్థితిలో బాత్‌టబ్‌లో పడిపోయి ఉన్న శ్రీదేవీని, భర్త బోనీ కపూర్‌తో పాటు, మరో ముగ్గురు సన్నిహితులు దగ్గరిలోని రషీద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే శ్రీదేవీ చనిపోయినట్టు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని వారికి చెప్పారు. శ్రీదేవీ మరణ వార్తని బోనీ కపూర్ అసలు తట్టుకోలేక పోయారని పాకిస్తాన్ నటుడు అద్నాన్ సిద్దికి తెలిపారు. ఆ వార్త తెలియగానే ఒక్కసారిగా షాక్‌కి గురైన బోనీ కపూర్, వెక్కి వెక్చి ఏడ్చారని పేర్కొన్నారు. అప్పటికే దుబాయ్‌లో ఉన్న తాను బోనీ సాబ్‌ను కలిసినట్టు అద్నాన్ తెలిపారు. అద్నాన్ శ్రీదేవీ నటించిన 'మామ్' సినిమాలో ఆమెకు కో-స్టార్‌గా చేశారు. పాకిస్తాన్, అమెరికా, యూకే వంటి ప్రాంతాల్లో ఉన్న శ్రీదేవీ అభిమానులంతా ఆమె లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. తనకు సంతాప సందేశాలు పంపుతున్నారన్నారు. చివరి సారిగా శ్రీదేవీతో ఆ వివాహ వేడుకల్లోనే మాట్లాడినట్టు అద్నాన్ చెప్పారు. ''వివాహ వేడుక రోజు, రాత్రి 12 గంటలకు నా విమానం అక్కడికి చేరుకుంది. అప్పటికే చాలా ఆలస్యమైందని అనుకున్నా. బోనీ సాబ్‌కి కాల్ చేశా. పెళ్లికి రావాలని ఆయన పట్టుబట్టారు. మామ్ సినిమా తర్వాత నేను శ్రీదేవీని మళ్లీ కలువలేదు. నాకోసం వేచిచూస్తున్నారు. చాలా ఆప్యాయంగా నన్ను పలకరించారు. అనంతరం నన్ను ఆమె కుటుంబసభ్యులకు పరిచయం చేశారు. మీరు చాలా ఆలస్యం అని నవ్వుతూ అన్నారు. ఆ మాటలు ఇంకా నా చెవిలో మారుమోగుతున్నాయి. అవే ఆమె చివరగా నాకు చెప్పిన గుడ్‌బై ఏమో'' అని ఆవేదన వ్యక్తంచేశారు. -
ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్ వారసురాలు!
స్టార్కిడ్ జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి బాటలోనే సినీ రంగంవైపు అడుగులు వేస్తున్నది. బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ బ్లాక్‌బస్టర్ సైరత్ హిందీ రీమేక్‌తో జాన్వీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నదని కథనాలు వచ్చాయి. కాదుకాదు కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ లో నటించే అవకాశముందని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో బోనీ కపూర్ ‘డీఎన్ఏ’ దినపత్రికతో మాట్లాడుతూ కూతురు జాన్వీ బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. కరణ్ జోహార్ తెరకెక్కించే ప్రాజెక్టుతో ఆమె బాలీవుడ్‌కు పరిచయం కానుందని వెల్లడించారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదట. ‘ అవును, జాన్వీ ఎంట్రీ సినిమా గురించి కరణ్ మాతో మాట్లాడారు. మేం అనుమతి ఇచ్చాం. అయితే ఏ సినిమా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కరణ్ ఇటీవల ‘సైరత్’ రీమేక్ హక్కులు తీసుకున్నారు. కాబట్టి ఈ సినిమాతోనే జాన్వీ లాంచ్ కావొచ్చునని భావిస్తున్నారు’ అని బోనీ చెప్పారు. జాన్వీ సినిమా ఎంట్రీ గురించి బోనీ అఫీషియల్‌గా చెప్పడం ఇదే తొలిసారి. చాలాకాలంగా ఝాన్వీ ఎంట్రీ గురించి రకరకాల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు-మురుగదాస్ సినిమా కోసం కూడా జాన్వీని అడిగినట్టు కథనాలు వచ్చాయి. కాగా, ‘సైరత్’ హిందీ రీమేక్‌తోనే జాన్వీ ఎంట్రీ ఇచ్చే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. -
శ్రీదేవి బర్త్‌డే పార్టీ
అతిలోక సుందరి శ్రీదేవి ఇటీవలి తన 50 వ జన్మదినాన్ని ఘనంగా చేసుకుంది. ఈ పుట్టిన రోజుని పురస్కరించుకుని భర్త బోని కపూర్ ఇచ్చిన విందులో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు, తారలు తరలివచ్చారు.