ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్‌ వారసురాలు! | daddy Bonny Kapoor confirms Jhanvi entry | Sakshi
Sakshi News home page

ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్‌ వారసురాలు!

Published Fri, Nov 18 2016 10:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్‌ వారసురాలు!

ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్‌ వారసురాలు!

స్టార్‌కిడ్‌ జాన్వీ కపూర్‌ తల్లి శ్రీదేవి బాటలోనే సినీ రంగంవైపు అడుగులు వేస్తున్నది. బాలీవుడ్‌ సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ బ్లాక్‌బస్టర్‌ సైరత్‌ హిందీ రీమేక్‌తో జాన్వీ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నదని కథనాలు వచ్చాయి. కాదుకాదు కరణ్‌ జోహార్‌ తెరకెక్కిస్తున్న ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2’ లో నటించే అవకాశముందని చెప్పుకున్నారు.
 
ఈ నేపథ్యంలో బోనీ కపూర్‌ ‘డీఎన్‌ఏ’  దినపత్రికతో మాట్లాడుతూ కూతురు జాన్వీ బాలీవుడ్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. కరణ్‌ జోహార్‌ తెరకెక్కించే ప్రాజెక్టుతో ఆమె బాలీవుడ్‌కు పరిచయం కానుందని వెల్లడించారు. అయితే.. ఈ ప్రాజెక్ట్‌ ఇంకా ఫైనలైజ్‌ కాలేదట. ‘ అవును, జాన్వీ ఎంట్రీ సినిమా గురించి కరణ్‌ మాతో మాట్లాడారు. మేం అనుమతి ఇచ్చాం. అయితే ఏ సినిమా అనేది ఇంకా కన్ఫర్మ్‌ కాలేదు. కరణ్‌ ఇటీవల ‘సైరత్‌’ రీమేక్‌ హక్కులు తీసుకున్నారు.

కాబట్టి ఈ సినిమాతోనే జాన్వీ లాంచ్‌ కావొచ్చునని భావిస్తున్నారు’ అని బోనీ చెప్పారు. జాన్వీ సినిమా ఎంట్రీ గురించి బోనీ అఫీషియల్‌గా చెప్పడం ఇదే తొలిసారి. చాలాకాలంగా ఝాన్వీ ఎంట్రీ గురించి రకరకాల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు-మురుగదాస్‌ సినిమా కోసం కూడా జాన్వీని అడిగినట్టు కథనాలు వచ్చాయి. కాగా, ‘సైరత్‌’ హిందీ రీమేక్‌తోనే జాన్వీ ఎంట్రీ ఇచ్చే అవకాశముందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement