ఫిట్‌గా ఉండటం కోసమే డైట్‌ | Sridevi Workout Routine & Diet Plan | Sakshi
Sakshi News home page

ఫిట్‌గా ఉండటం కోసమే డైట్‌

Published Tue, Feb 27 2018 1:46 AM | Last Updated on Tue, Feb 27 2018 1:46 AM

Sridevi Workout Routine & Diet Plan - Sakshi

శ్రీదేవి విపరీతంగా డైట్‌ చేయడంవల్ల ఆమె ఆరోగ్యం పాడైందన్నది ఇప్పుడు కొందరి అభిప్రాయం. నిజానికి తాను విపరీతంగా డైటింగ్‌ చేయడంతో పాటు సన్నగా ఉండాలని పిల్లలను కూడా సరిగ్గా తిననిచ్చేవారు కాదనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంది. ఇదే విషయం గురించి గతంలో ఓసారి అడిగినప్పుడు.. జగదేక సుందరి నవ్వేశారు. ‘‘పిల్లల కడుపు మాడ్చే తల్లిని కాదు. ఆ మాటకొస్తే నేను అన్‌హెల్దీ వేలో ఫుడ్‌ తీసుకోను.

ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాను. నేను హెల్త్‌ క్లబ్‌కి వెళ్లేదాన్ని. ఒకసారి నా పిల్లలు కూడా వస్తానంటే రమ్మన్నాను. అక్కడ నాతో పాటు జాన్వీ, ఖుషీ యోగా చేశారు. దాంతో పిల్లలను కూడా హెల్త్‌ సెంటర్స్‌కి తీసుకొచ్చి వాళ్లతో విపరీతంగా వర్కవుట్స్‌ చేయిస్తున్నానని, డైట్‌ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటానని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అది నిజం కాదు. నా కూతుళ్లకు కూడా ఫిట్‌నెస్‌ మీద మంచి అవగాహన ఉంది. వాళ్లు స్పోర్ట్స్‌ ఆడతారు.

ఫిట్‌గా ఉండాలనుకుంటారు. అందులో తప్పేముంది’’ అన్నారు శ్రీదేవి. భార్య కఠినమైన డైట్‌ పాటిస్తే భర్త బోనీ కపూర్‌ మాత్రం డైటింగ్‌కి దూరం. ఆయన భోజనప్రియుడు. ఆయనతో ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయించడానికి శ్రీదేవి చాలా ప్రయత్నాలు చేశారట. కానీ పొద్దున్నే నిద్ర లేవగానే ఏదో వంక చెప్పి బోనీ తప్పించుకునేవారట. ‘‘డైట్‌ విషయంలో శ్రీదేవి చాలా పర్టిక్యులర్‌గా ఉంటుంది. తను కంట్రోల్‌ చేసుకుంటూ నన్ను కంట్రోల్‌ చేస్తుంటుంది.

వాస్తవానికి నేను భోజనప్రియుణ్ణి. హైదరాబాద్, చెన్నై వంటకాలు అంటే చాలా ఇష్టం నాకు. వీలు దొరికినప్పుడు ఫుడ్‌ లాగించడానికి ట్రై చేస్తాను. అలా చేస్తానని తనకీ తెలుసు. చిన్నగా మందలిస్తుంది. నాకు రెండే రెండు బలహీనతలు. ఫస్ట్‌ నా కుటుంబం అయితే సెకండ్‌ నాకు ఇష్టమైన ఫుడ్‌’’ అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్‌ తెలిపారు. భర్త ఫుడ్‌ లవర్‌ కాబట్టి ఆయన ఎప్పుడంటే అప్పుడు తినడానికి వీలుగా ఫుడ్‌ రెడీ చేయించేవారట శ్రీదేవి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement