ఆ వదంతులు నమ్మొద్దు: నాగ్
హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ రెండో సినిమా ప్రాజెక్ట్ ఇటీవల మొదలైంది. తొలి సినిమా 'అఖిల్' నిరాశపరచడంతో రెండో మూవీ ప్రాజెక్టును నాగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నాగ్‌కు 'మనం' లాంటి విజయాన్ని అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ తన రెండో మూవీ చేస్తున్నాడు. అయితే ఈ మూవీకి టాలీవుడ్ హీరోయిన్లను సంప్రదించకుండా.. బాలీవుడ్ భామను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో అఖిల్‌కు జోడీగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తోందని వచ్చిన వదంతులను నాగ్ కొట్టిపారేశారు.
ఖుషీకి భారీ పారితోషికం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వచ్చిన ఓ కథనాన్ని నాగ్ రీట్వీట్ చేస్తూ.. ఇది నిజం కాదనిస్పష్టం చేశారు. మరోవైపు ఈ తన కొత్త ప్రాజెక్టు కోసం అఖిల్ కసరత్తులు చేస్తున్నాడు. విక్రమ్ సినిమా ఫిజికల్‌గా చాలా డిమాండ్ చేస్తోందని, కొత్త ట్రైనర్ వర్కవుట్ షెడ్యూల్ ఇచ్చారు. డైట్ కూడా ప్లాన్ చేశారని స్వయంగా అఖిల్ ఇటీవల ఓ అప్‌డేట్ ఇచ్చాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ ప్రాజెక్టుకు మనం మూవీకి పనిచేసిన టెక్నీషియన్లు ఈ భాగస్వామ్యం కానున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు మనం ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.