Sridevi Death Anniversary: Kushi And Janhvi Kapoor Shares Emotional Post - Sakshi
Sakshi News home page

‘మిస్‌ యూ అమ్మ’ శ్రీదేవి కూతుళ్ల భావోద్వేగం

Published Wed, Feb 24 2021 9:45 PM | Last Updated on Thu, Feb 25 2021 9:26 AM

SriDevi Death Anniversary Jhanvi, Khushi Kapoor Remembers Her Mother - Sakshi

అందం, అభినయం ఆమె సొంతం. తన నటనతో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించి వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌గా నిలిచిన శ్రీదేవి వర్ధంతి నేడు. ఫిబ్రవరి 24వ తేదీన ఆమె దుబాయ్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆమె వర్ధంతి సందర్భంగా శ్రీదేవి కూతుళ్లు భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు వారి గుండెల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి ఆమె మరణించిదనే విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు.

తల్లి వర్ధంతి సందర్భంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ భావోద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా శ్రీదేవి తనను ఉద్దేశించి స్వయంగా రాసిన ఓ పేపర్‌ను జాన్వీ పంచుకుంది. ‘ఐ లవ్యూ మై లబ్బు.. యువర్‌ ద బెస్ట్‌ బేబీ ఇన్‌ ద వరల్డ్‌’ అని శ్రీదేవి రాసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇక చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ కూడా తన తల్లిని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా బోనీకపూర్‌, శ్రీదేవి కలిసి ఉన్న ఫొటోలను పంచుకుంది. మిస్‌ యూ అని జాన్వీ, ఐ లవ్యూ అమ్మ అని ఖుషీ కపూర్‌ అంటూ పోస్టులు చేశారు. శ్రీదేవీ వర్ధంతి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెను స్మరించుకున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement