శ్రీవారిని దర్శించుకున్న జాన్వీకపూర్‌ | Jhanvi Kapoor Visits Tirupati To Seek Blessings Of Lord Venkateshwara | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న జాన్వీకపూర్‌

Published Mon, Feb 10 2020 6:59 PM | Last Updated on Mon, Feb 10 2020 7:02 PM

Jhanvi Kapoor Visits Tirupati To Seek Blessings Of Lord Venkateshwara - Sakshi

సాక్షి, తిరుమల: శ్రీదేవి కుమార్తె, ప్రముఖ నటి జాన్వీ కపూర్‌ తన సోదరి ఖుషీ కపూర్‌తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో  శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరివురు తన స్నేహితురాలితో కలిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జాన్వీ 3500 మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు జాన్వీ కపూర్‌కి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రాలతో సత్కరించారు. అచ్చం తెలుగింటి అమ్మాయిలా చీరకట్టులో జాన్వీకపూర్‌ శ్రీవారి దర్శనం చేసుకోవడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement