Sridevi BKapoor
-
ఇండస్ట్రీని ఏలిన అందాల దేవత శ్రీదేవి (ఫొటోలు)
-
శ్రీవారిని దర్శించుకున్న జాన్వీకపూర్
సాక్షి, తిరుమల: శ్రీదేవి కుమార్తె, ప్రముఖ నటి జాన్వీ కపూర్ తన సోదరి ఖుషీ కపూర్‌తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరివురు తన స్నేహితురాలితో కలిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాన్వీ 3500 మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు జాన్వీ కపూర్‌కి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రాలతో సత్కరించారు. అచ్చం తెలుగింటి అమ్మాయిలా చీరకట్టులో జాన్వీకపూర్ శ్రీవారి దర్శనం చేసుకోవడం విశేషం. #JhanviKapoor visits Tirupati to seek blessings of Lord Venkateshwara. She climbed 3,500 steps barefoot and offered prayers to the presiding deity. pic.twitter.com/2hdRtJNHAB — Bollywood Knocks (@BollywoodKnocks) February 10, 2020 -
‘ప్రభాస్ కంటే ఆమెకు ఎక్కువ పేరు వచ్చేది’
హైదరాబాద్: హీరోయిన్ శ్రీదేవి ‘బాహుబలి 2’ అవకాశం వదులుకోవడం పట్ల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో నటించివుంటే ప్రభాస్ కంటే ఆమెకు ఎక్కువ పేరు వచ్చేదని అభిప్రాయపడ్డాడు. ‘బాహుబలి 2లో శ్రీదేవి నటించకపోడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ఆమె కెరీర్లో అత్యద్భుతమైన ఈ చిత్రం కూడా చేరివుంటే బాగుండేది. బాహుబలి 2 సినిమాలో శ్రీదేవి బోనికపూర్ నటించివుంటే ప్రభాస్ కంటే ఎక్కువ క్రెడిట్ ఆమెకు దక్కేది. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా తర్వాత ఆమె నటించిన చిత్రం ఇదే అయ్యేద’ని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. బాహుబలి సినిమాలో నటించే అవకాశాన్ని శ్రీదేవి వదులుకున్నట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవి సంప్రదించారని, రెమ్యునరేషన్ ఎక్కువ అడగడంతో నిర్మాతలు వెనక్కు తగ్గినట్టు గుసగుసలు వినిపించాయి. బాహుబలి సిరీస్ రికార్డు విజయంతో దీనికి సంబంధించిన ప్రతి విషయం ప్రేక్షకులకు ఆసక్తి గొల్పుతోంది. ఇప్పటికే రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించిన ‘బాహుబలి 2’ రూ.1500 కోట్ల మైలురాయిని అందుకునే దిశగా దూసుకెళ్తోంది.