
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ గతంలో ఓ వ్యక్తిని ప్రేమించింది కానీ వీరి బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. అతడితో బ్రేకప్ అయింది. విచిత్రంగా బ్రేకప్ అయిన కొన్నాళ్లకే ఆమె మరో వ్యక్తితో ప్రేమలో పడింది, అదీ డేటింగ్ యాప్‌లో! అయితే మొదట అతడిని వదిలించుకోవాలని చూసిన ఆలియా తన స్నేహితులు ఖుషీ కపూర్, ముస్కాన్‌ల సూచనతో మనసు మార్చుకుందట!
Aaliyah Kashyap: తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆలియా మాట్లాడుతూ.. 'చాలాకాలం దాకా ఎలాంటి రిలేషన్‌షిప్ పెట్టుకోవద్దని అనుకున్నా. కానీ నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిన నెల రోజులకు జస్ట్ ఫన్ కోసం ఓ డేటింగ్ యాప్‌లో జాయిన్ అయ్యాను. ఇతర అబ్బాయిలతో మాట్లాడితే బాధను మర్చిపోవచ్చన్నది నా ఉద్దేశం. అయితే ఎవరికీ ఫోన్ నంబర్ మాత్రం ఇవ్వలేదు. ఆ సమయంలో షేన్ గ్రెగొయిర్ ప్రొఫైల్ మ్యాచ్ అయింది. అతడు నాతో వీడియో కాల్ మాట్లాడదాం అంటే సరేలే, చూద్దాం అన్నాను. అదే రోజు రాత్రి నా ఫ్రెండ్స్ ఖుషీ కపూర్, ముస్కాన్‌లకు మెసేజ్ చేశాను.
షేన్‌ను ఇప్పుడే వదిలించుకుందాం అనుకుంటున్నా. నేను కేవలం అబ్బాయిలతో సంభాషించాలనుకున్నానే తప్ప ఇలా వీడియో కాల్స్ మాట్లాడటంలాంటి వ్యవహారాలు నాకు అక్కర్లేదని నా స్నేహితులకు చెప్పాను. అయితే వాళ్లు నా మాటలను వ్యతిరేకించారు. ఒకసారి అతడు అడిగినట్లు వీడియో కాల్ మాట్లాడి చూడమని సూచించారు. విచిత్రంగా తొలిసారే మేమిద్దం నాలుగు గంటలదాకా మాట్లాడుకున్నాం. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు రాత్రి సుమారు నాలుగు గంటలపాటు మాట్లాడుకుంటూనే ఉన్నాం' అంటూ షేన్‌తో ప్రేమ ఎలా మొదలైందో చెప్పుకొచ్చింది ఆలియా. ఈ ప్రేమజంట గత నెలలో లవ్ యానివర్సరీ కూడా జరుపుకుంది.
Comments
Please login to add a commentAdd a comment