క్యాపిటలాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రూ. 3 వేల కోట్ల ఫండ్‌ | CapitaLand launches SGD 525 million fund to invest in business parks | Sakshi
Sakshi News home page

క్యాపిటలాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రూ. 3 వేల కోట్ల ఫండ్‌

Published Sat, Aug 12 2023 4:41 AM | Last Updated on Sat, Aug 12 2023 4:41 AM

CapitaLand launches SGD 525 million fund to invest in business parks - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రీమియం బిజినెస్‌ పార్క్‌లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు 525 మిలియన్‌ సింగపూర్‌ డాలర్లతో (సుమారు రూ. 3,225 కోట్లు) ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు క్యాపిటలాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (సీఎల్‌ఐ) వెల్లడించింది. క్యాపిటలాండ్‌ ఇండియా గ్రోత్‌ ఫండ్‌ 2 (సీఐజీఎఫ్‌ 2)లో ఒక అంతర్జాతీయ సంస్థ రూ. 1,630 కోట్లతో 50 శాతం తీసుకున్నట్లు తెలిపింది. సీఎల్‌ఐకి చెందిన ’ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్క్‌ చెన్నై’లో సీఐజీఎఫ్‌2 ఫండ్‌ 70 శాతం వాటా కొనుగోలు చేసింది.

ఇందుకోసం రూ. 590 కోట్లు వెచ్చించింది. వాటాల విక్రయం తర్వాత కూడా సదరు అసెట్‌ నిర్వహణను సీఎల్‌ఐ కొనసాగించనుంది. సింగపూర్‌కి చెందిన సీఎల్‌ఐ అంతర్జాతీయ రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజాల్లో ఒకటి. 2023 మార్చి ఆఖరు నాటికి సంస్థ నిర్వహణలో 133 బిలియన్‌ సింగపూర్‌ డాలర్ల (ఎస్‌జీడీ) అసెట్స్‌ ఉన్నాయి. వీటిలో 4 బిలియన్‌ ఎస్‌జీడీ విలువ చేసే అసెట్స్‌ భారత్‌లో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement