CLI
-
క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ రూ. 3 వేల కోట్ల ఫండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రీమియం బిజినెస్ పార్క్‌లలో ఇన్వెస్ట్ చేసేందుకు 525 మిలియన్ సింగపూర్ డాలర్లతో (సుమారు రూ. 3,225 కోట్లు) ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ (సీఎల్ఐ) వెల్లడించింది. క్యాపిటలాండ్ ఇండియా గ్రోత్ ఫండ్ 2 (సీఐజీఎఫ్ 2)లో ఒక అంతర్జాతీయ సంస్థ రూ. 1,630 కోట్లతో 50 శాతం తీసుకున్నట్లు తెలిపింది. సీఎల్‌ఐకి చెందిన ’ఇంటర్నేషనల్ టెక్ పార్క్ చెన్నై’లో సీఐజీఎఫ్2 ఫండ్ 70 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 590 కోట్లు వెచ్చించింది. వాటాల విక్రయం తర్వాత కూడా సదరు అసెట్ నిర్వహణను సీఎల్ఐ కొనసాగించనుంది. సింగపూర్‌కి చెందిన సీఎల్ఐ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాల్లో ఒకటి. 2023 మార్చి ఆఖరు నాటికి సంస్థ నిర్వహణలో 133 బిలియన్ సింగపూర్ డాలర్ల (ఎస్జీడీ) అసెట్స్ ఉన్నాయి. వీటిలో 4 బిలియన్ ఎస్జీడీ విలువ చేసే అసెట్స్ భారత్‌లో ఉన్నాయి. -
స్థిర వృద్ధి బాటన భారత్: ఓఈసీడీ
లండన్: భారత్ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక విశ్లేషణా సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో పలు అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి ధోరణి మిశ్రమంగా కనిపిస్తోందని తెలిపింది. భారత్ వృద్ధి క్రియాశీలతకు సంబంధించి అక్టోబర్‌లో కాంపోసిట్ లీడింగ్ ఇండికేటర్స్(సీఎల్ఐ) 100.2 పాయింట్ల వద్ద ఉంది. అయితే నవంబర్‌లో ఈ పాయింట్లు 100.4 పాయింట్లకు పెరిగింది. చైనా, బ్రెజిల్‌కు సంబంధించి తాత్కాలిక వృద్ధి ధోరణి కనిపిస్తుండగా.. రష్యా మాత్రం మందగమనంలోకి జారుతోంది. యూరో ప్రాంతంలో స్థిర వృద్ధి ధోరణి కనబడుతున్నట్లు తెలిపింది. ప్రత్యేకించి జర్మనీ, ఇటలీ విషయంలో సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కెనడా, జపాన్, ఫ్రాన్స్‌ల విషయంలోనూ స్థిర వృద్ధి సానుకూలతలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్లు గరిష్ట స్థాయి సీఎల్ఐ నుంచి స్వల్పంగా జారాయి.