Business Park
-
Vizag: యెల్లో మీడియాకు ఇది కనపడదేమో!
సాక్షి, విశాఖపట్నం: ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం.. ఊరూ వాడల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం.. సగటు వ్యక్తి చెంతకు పరిపాలన వ్యవస్థను తీసుకురావడం.. ఆహ్లాదాన్ని పంచడం.. ఆనందాన్ని అందించడం.. ఉపాధి అవకాశాలు కలి్పంచడం.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం.. ప్రతి ఒక్కరూ సామాజికంగా.. ఆర్థికంగా ఎదగడం. ఇవన్నీ స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా నెరవేరలేదు. ఇకపై నెరవేరవని అనుకున్నారంతా! కానీ.. కాలం మారింది. పాలకులు మారారు. వ్యవస్థలో మార్పు వచ్చింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగింది. నాలుగున్నరేళ్లలో విశాఖపట్నంలో అద్భుతాలు జరిగాయి. పనికెళ్లిన పిల్లాడు.. బడికెళ్లాడు. చదువు ఆపేద్దామని అనుకున్న పేద విద్యార్థి.. కాలేజీల్లో ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్నాడు. వలస వెళ్లిన నిరుద్యోగి.. దర్జాగా సొంతూరికి సమీపంలోనే ఉపాధి పొందాడు. విత్తు, ఎరువు కోసం బరువైన హృదయంతో ఎదురు చూసే రైతు చెంతకే.. అన్నీ చేరాయి. వ్యవసాయం పండగలా మారింది. కునారిల్లిన ఐటీ పరిశ్రమ.. కొత్త పుంతలు తొక్కుతోంది. అభివృద్ధికి నోచుకోని రహదారులు.. అద్దంలా మెరుస్తున్నాయి. ప్రతి కోణంలోనూ సాగరాన్ని మించేలా విశాఖ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నిజంగా యెల్లో మీడియాకు ఇవేం కనపడవేమో! రాబోతున్న భారీ పరిశ్రమలివే.. ►అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం జగన్ స్వయంగా శంకుస్థాపన చేశారు. డేటా సెంటర్‌తో పాటు బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ రూ.21,844 కోట్లతో ఏర్పాటుకానుంది. తద్వారా 39,815 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ►గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎనీ్టపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్ మాల్, టర్బో ఏవియేషన్.. ఇలా.. విభిన్న రంగాల్లో బహుళ ప్రాజెక్టులను విశాఖ జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు మొగ్గు చూపారు. గాజువాకకుపట్టాభిషేకం కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న గాజువాక హౌసింగ్ సొసైటీ భూములకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాశ్వత పరిష్కారం చూపించారు. గాజువాకలో ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమ ఇంటిపై వారికి ఎలాంటి శాశ్వత హక్కులు లేవు. గత టీడీపీ దీన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవడమే తప్ప పరిష్కరించలేదు. కానీ.. సీఎం వైఎస్ జగన్ జీవో నంబర్ 301 , 388 పట్టాదారులకు టైటిల్ డీడ్స్ అందజేశారు. సుమారు రూ.1,500 కోట్ల విలువైన భూమిని ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన అందజేశారు. గాజువాక హౌసింగ్ సొసైటీ ద్వారా ప్రభుత్వ ఆక్రమిత భూములలో నివాసం ఉంటున్న 7,026 మందికి కన్వేయన్స్ డీడ్స్ అందించారు. అదేవిధంగా 39 మంది ఉక్కు కర్మాగార నిర్వాసితులకు కన్వేయన్స్ పట్టాలు, 40 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలందించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రగతి పథంలో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఈ నాలుగేళ్లలో 18కి పైగా ప్రాజెక్టులను ఏయూలో పూర్తయ్యాయి. రూ.11 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, రూ.40 కోట్లతో ఫార్మా టెస్టింగ్, ఇంక్యుబేషన్ సెంటర్, రూ.1.30 కోట్లతో స్టీల్‌ప్లాంట్‌తో సంయుక్తంగా హ్యూమన్ జెనిటిక్స్ విభాగంలో మెడికల్ జెనిటిక్స్ రీసెర్చ్ ల్యాబ్, ఏయూ–నాస్కామ్తో సంయుక్తంగా దాదాపు రూ 27 కోట్ల బడ్జెట్‌తో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, జియో ఇంజనీరింగ్ విభాగం సింగపూర్‌కు చెందిన సంస్థతో కలసి రూ.2 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.67.5 కోట్లతో ఎస్టీపీఐ ఆధ్వర్యంలో ఇంక్యుబేషన్, స్టార్టప్ ఎకో సిస్టం, ఆర్ట్స్ కళాశాల పరిధిలో ప్రత్యేకంగా రూ.5 కోట్ల వ్యయంతో డాల్బీ అటా్మస్ రికార్డింగ్ స్టూడియో, ఆ–హబ్ ఏర్పాటు చేశారు. 140కి పైగా సంస్థలు తమ సేవలు ప్రారంభించాయి. ► ఈబీసీ నేస్తం పథకం కింద.. ఏటా 6,650 మందికి రూ.9.98 కోట్లు చొప్పున రూ.39.9 కోట్లు, కాపునేస్తం ద్వారా ఏటా 6,150 మందికి రూ.9.23 కోట్లు చొప్పున మొత్తం రూ.36.9 కోట్లు, జగనన్న చేదోడులో భాగంగా నాలుగేళ్లలో 57,776 మందికి రూ.57.78 కోట్లు పంపిణీ చేసింది. ►వాహన మిత్ర పథకం ద్వారా ఏటా 19,440 మంది ఆటోడ్రైవర్లకు నాలుగేళ్లలో రూ.77.76 కోట్లు, మత్స్యకార భరోసాలో భాగంగా ఏటా 10,026 మంది మత్స్యకారులకు నాలుగేళ్లలో రూ.40.1 కోట్లు జమ చేసింది. ►జగనన్న విద్యా దీవెనలో భాగంగా ఏటా 38,141 మంది విద్యార్థులకు నాలుగేళ్లలో రూ.169.52 కోట్లు, జగనన్న వసతి దీవెనలో భాగంగా ఏటా 45,236 మందికి నాలుగేళ్లలో రూ.16 కోట్లు జమ చేసింది. ►జగనన్న విద్యా కానుక కింద ఏటా 1.01 లక్షల మంది విద్యార్థులకు రూ.19.91 కోట్లతో కిట్లను అందజేసింది. నాడు–నేడు ద్వారా ఫేజ్–1లో 1131 పాఠశాలలను అభివృద్ధి చేసింది. ఫేజ్–2లో రూ.114.82 కోట్లతో 309 పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. ►రూ.34.80 కోట్లతో 102 శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తోంది. ►రూ.40.76 కోట్లతో 191 సామాజిక భవనాల నిర్మాణ పనులు ప్రారంభించగా.. ఇప్పటికే 83 భవనాలు పూర్తయ్యాయి. రూ.231.44 కోట్లతో 1387 డ్రైన్ల నిర్మాణ పనులు ప్రారంభించగా.. 858 ఇప్పటికే పూర్తి చేశారు. రెండింతల అభివృద్ధి జీవీఎంసీ పరిధిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని ఐదేళ్ల కాలంలో అంటే 2014 నుంచి 2019 వరకు మొత్తం 4,450 పనులకుగానూ రూ.1,450 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పటివరకు నాలుగున్నరేళ్ల కాలంలో 9,920 పనులను చేపట్టింది. ఇందుకోసం రూ. 2,490 కోట్ల మేర వ్యయం చేసింది. వీటితో పాటు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకుగానూ మరో రూ. 66 కోట్ల మేర వ్యయం చేసింది. ఈ నిధుల కింద 708 పనులను చేపడుతోంది. అంటే నాలుగున్నరేళ్ల కాలంలో జీవీఎంసీ పరిధిలో ఏకంగా రూ.2,556 కోట్ల మేర నిధులను వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నమాట. ఫలితంగా నగర రూపురేఖలు మారిపోయాయి. పార్కుల్లో కొత్తందాలు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన పార్కుల తర్వాత వాటి రూపురేఖలను మార్చివేసింది. నగరవాసులు వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ విధంగా మొత్తం 103 పనులను చేపట్టి... ఇందుకోసం రూ. 50 కోట్ల మేర వెచ్చింది. గతంలో కనీసం కన్నెత్తి చూసేందుకు వీలు లేకుండా ఉన్న శివాజీ పార్కు రూ.1.53 కోట్లతో కొత్తందాలను సంతరించుకుంది. సిరిపురం జంక్షన్లో ఏర్పాటు చేసిన వైజాగ్ స్క్వేర్ నగరానికి స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. నగరంలోని ప్రతి పార్కు ఒక బ్రాండ్ ఇమేజ్‌కు డెస్టినీగా మారింది. మరో రూ.16 కోట్లతో 8 పార్కుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అభివృద్ధి పరవళ్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ సంయుక్తంగా కార్యచరణ రూపొందించారు. బెస్త గ్రామంగా ఉన్న ఊరు.. మహానగరంగా మారగా.. ఇప్పుడు దాని ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లింది మాత్రం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే. నగర అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో.. నాలుగేళ్లలో రూ.వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. పశ్చిమ, ఉత్తర, తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలున్నప్పటికీ.. రాజకీయాలకు తావులేకుండా.. ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ప్రభుత్వం సమానంగానే అభివృద్ధి చేసింది. సొంతింటి కల నెరవేర్చారు ►టిడ్కో ఇళ్లను టీడీపీ హయాంలో పునాదులకే పరిమితం చేయగా.. వాటిని నిర్మించే బాధ్యత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుంది. విశాఖ పార్లమెంట్ పరిధిలో 20 వేల ఇళ్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే 50 శాతం ఇళ్లల్లో పేద ప్రజలు గృహ ప్రవేశం చేశారు. ►కోర్టు కేసుల కారణంగా.. విశాఖ పరిధిలో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం రాష్ట్రంతో పోలిస్తే ఆలస్యంగా మొదలైనా.. చురుగ్గా నిర్మాణ పనులు సాగాయి. మొత్తం 1.92 లక్షల మంది సొంతింటి కల నెరవేర్చేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను నిర్మిస్తోంది. ఇప్పటికే 50 వేలకు పైగా కుటుంబాలు తమ సొంత ఇంటిలో ఆనందంగా జీవనం సాగిస్తుండటం విశేషం. కొత్త కొత్తగా పర్యాటకం ► సువిశాల సాగరతీరం మణిహారంగా ఉన్న విశాఖలో.. పర్యాటకులను మరింత ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 11 కొత్త బీచ్‌లను అభివృద్ధి చేసింది. ► ఈ 11 బీచ్‌లను అనుసంధానిస్తూ.. కోస్టల్ బీచ్ మాస్టర్ ప్లాన్‌లో జిల్లాలో 25 బీచ్‌లు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధమైంది. విజయవాడలోని ఫిషరీస్ యూనివర్సిటీ నేతృత్వంలో దీనికి సంబంధించిన సర్వే కూడా పూర్తయింది. ► నిత్యం వేలాది మందితో కిటకిటలాడే బీచ్‌లను పరిశుభ్రంగా ఉంచేందుకు రూ.12.55 కోట్లతో మొత్తం ఆరు బీచ్ క్లీనింగ్ యంత్రాలను సిద్ధం చేసింది. ఎప్పటికప్పుడు బీచ్‌ల్లో పేరుకుపోయిన చెత్తను ఏరివేస్తున్నారు. తళుక్కుమనేలా రహదారులు.. జంక్షన్లు ► 2019 నుంచి ఇప్పటి వరకు రూ.547.45 కోట్లతో 2,089 రహదారి పనులు మంజూరు కాగా.. ఇప్పటికే రూ.202.59 కోట్లతో 1,216 పనులు పూర్తయ్యాయి. మరో రూ.344.86 కోట్లతో 873 పనులు జరుగుతున్నాయి. ► 15 ఏళ్లుగా రహదారి సౌకర్యానికి నోచుకోని ప్రాంతాలకు సైతం రోడ్లు వేశారు. ► వివిధ ఫండ్స్ కింద వచ్చిన నిధులతో రూ.104 కోట్లతో 27 కి.మీ మేర రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. ►అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రయాణికులు సేదతీరేందుకు అధునాతన బస్ బేలు ఏర్పాటు చేశారు. మొత్తం రూ.462.70 లక్షలతో 20 బస్‌బేలు నిర్మించారు. కూడళ్లను అభివృద్ధి చేశారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో విభిన్నమైన ఐటీ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఒరవడి సృష్టించింది. ఇందుకు ఆకర్షితులై ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమెజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేశాయి. వైఎస్సార్ హయాంలో పురుడుపోసుకున్న విప్రో సంస్థ.. ఎట్టకేలకు కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. విశాఖలో స్టార్టప్‌ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సరీ్వసెస్ కంపెనీస్(నాస్కామ్) సీఈవో సంజీవ్ మల్హోత్రా ప్రకటించారు. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకో సిస్టమ్‌ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ చెగ్.. విశాఖలో కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది. భారత్‌లో ఢిల్లీ తర్వాత వైజాగ్‌లోనే చెగ్ సంస్థ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం విశేషం. మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీలు కూడా విశాఖలో ఏర్పాటయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. -
క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ రూ. 3 వేల కోట్ల ఫండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రీమియం బిజినెస్ పార్క్‌లలో ఇన్వెస్ట్ చేసేందుకు 525 మిలియన్ సింగపూర్ డాలర్లతో (సుమారు రూ. 3,225 కోట్లు) ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ (సీఎల్ఐ) వెల్లడించింది. క్యాపిటలాండ్ ఇండియా గ్రోత్ ఫండ్ 2 (సీఐజీఎఫ్ 2)లో ఒక అంతర్జాతీయ సంస్థ రూ. 1,630 కోట్లతో 50 శాతం తీసుకున్నట్లు తెలిపింది. సీఎల్‌ఐకి చెందిన ’ఇంటర్నేషనల్ టెక్ పార్క్ చెన్నై’లో సీఐజీఎఫ్2 ఫండ్ 70 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 590 కోట్లు వెచ్చించింది. వాటాల విక్రయం తర్వాత కూడా సదరు అసెట్ నిర్వహణను సీఎల్ఐ కొనసాగించనుంది. సింగపూర్‌కి చెందిన సీఎల్ఐ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాల్లో ఒకటి. 2023 మార్చి ఆఖరు నాటికి సంస్థ నిర్వహణలో 133 బిలియన్ సింగపూర్ డాలర్ల (ఎస్జీడీ) అసెట్స్ ఉన్నాయి. వీటిలో 4 బిలియన్ ఎస్జీడీ విలువ చేసే అసెట్స్ భారత్‌లో ఉన్నాయి. -
విశాఖ సిగలో మరో మణిహారం.. 19 ఎకరాల్లో ఐస్పేస్ బిజినెస్ పార్క్
సాక్షి, అమరావతి: మహానగరంగా వేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం సిగలో మరో మణిహారం వచ్చి చేరుతోంది. ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అదానీ డేటా సెంటర్, ఐటీ బిజినెస్ పార్క్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలతో అభివృద్ధి చెందుతున్న విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో భారీ బిజినెస్ పార్క్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అంతర్జాతీయ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా మధురవాడ హిల్ నంబర్–3లో 18.93 ఎకరాల్లో ఐస్పేస్ బిజినెస్ పార్క్‌ను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సుమారు రూ.300 కోట్ల వ్యయం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసే కంపెనీ (ఎస్పీవీ)లో ఏపీఐఐసీ 26 శాతం వాటాను కలిగి ఉంటుంది. మిగిలిన 74 శాతం వాటాను భాగస్వామ్య కంపెనీ కలిగి ఉంటుంది. భూమికి అత్యధిక ధరను కోట్ చేసిన సంస్థను ఎంపిక చేస్తారు. ఎంపికైన సంస్థ ఏపీఐఐసీకి 26 శాతం వాటా కింద రూ.78 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని భాగస్వామ్య కంపెనీ ఈక్విటీగా పరిగణిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బహుళజాతి సంస్థలను ఆకర్షించే విధంగా ఈ బిజినెస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఏపీఐఐసీ వీసీ, ఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరడానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఆసక్తి గల సంస్థలు జూన్ 20లోగా బిడ్లు దాఖలు చేయాలని కోరారు. చదవండి: Fact Check: దగా చేసింది ఎవరో తెలియదా రామోజీ ? మధురవాడ, రుషికొండ ప్రాంతాల్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను ఆకర్షించేలా ఈ బిజినెస్ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గత కొంతకాలంగా దిగ్గజ కంపెనీలు విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తు్తండటంతో దానికి అనుగుణంగా ఏపీఐఐసీ బిజినెస్ పార్కులను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. డిజైన్ దగ్గర నుంచి నిర్వహణ వరకు నూతన సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో బిజినెస్ పార్కును నిర్మించేలా డిజైన్ దగ్గర నుంచి నిధుల సమీకరణ వరకు భాగస్వామ్య కంపెనీనే చూసుకోవాల్సి ఉంటుందని ఏపీఐఐసీ స్పష్టం చేసింది. అలాగే ఐటీ, ఐటీ ఆధారిత, ఆర్థిక కంపెనీల అవసరాలకు అనుగుణంగా కమర్షియల్ ఆఫీస్ స్పేస్, బిజినెస్ సెంటర్‌తోపాటు సమావేశ మందిరాలు, బిజినెస్ హోటల్స్, సర్విస్ అపార్ట్మెంట్స్, ఎయిర్ థియేటర్, ఫుడ్ బేవరేజ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇతర మౌలిక వసతులతోపాటు పార్కింగ్ సౌకర్యాలు కూడా భాగస్వామ్య కంపెనీనే కల్పించాల్సి ఉంటుంది. -
హైదరాబాద్‌లో జీఎంఆర్ బిజినెస్ పార్క్
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న మిగులు స్థలాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే క్రమంలో ఏరోడ్రోమ్‌లో ’బిజినెస్ పార్క్’ ఏర్పాటు చేయడంపై జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) కసరత్తు చేస్తోంది. దీనిపై సుమారు రూ. 350 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు జీఎంఆర్ స్థల అభివృద్ధి విభాగం సీఈవో అమన్ కపూర్ తెలిపారు. ఇందులో దాదాపు పది లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్‌తో ఆరు భవంతులు నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ఒక టవర్ పూర్తయ్యిందని, అందులో కొంత భాగంలో జీఎంఆర్ గ్రూప్ సంస్థ ఒకటి కార్యకలాపాలు సాగిస్తోందని అమన్ చెప్పారు. మొత్తం ప్రాజెక్టు పూర్తయి, అందుబాటులోకి రావడానికి మరో రెండు, రెండున్నరేళ్ల సమయం పట్టవచ్చన్నారు. పెట్టుబడిలో కొంతభాగం నిధులను అంతర్గత వనరుల ద్వారా, మిగతాది రుణ మార్గంలోనూ సమీకరిస్తున్నట్లు చెప్పారురు. సిద్ధమవుతున్న రెండో టవర్‌లో ఆఫీస్ స్పేస్‌ను లీజుకిచ్చేందుకు పలు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని జీఎంఆర్ వర్గాలు తెలిపాయి. -
బ్రూక్‌ఫీల్డ్ చేతికి ఎస్సార్ ఈక్వినాక్స్ బిజినెస్ పార్క్!
న్యూఢిల్లీ: ఎస్సార్ గ్రూప్ ముంబైలోని ఈక్వినాక్స్ బిజినెస్ పార్క్‌ను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లోని 1.25 మిలియన్ చదరపుటడుగుల ఈక్వినాక్స్ బిజినెస్ పార్క్‌ను అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌కు రూ.2,400 కోట్లకు ఎస్సార్ గ్రూప్ విక్రయించనున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. నాలుగు భవంతులున్న ఈ ప్రోపర్టీ విక్రయ లావాదేవీ చర్చలు తుది దశకు చేరాయని, ఈ నెలలోనే డీల్ పూర్తయ్యే అవకాశాలున్నాయని ఆయా వర్గాలు వివరించాయి. ఈ ప్రాపర్టీని రియల్టీ సంస్థ ఆర్ఎమ్జడ్ గ్రూప్‌కు విక్రయించనున్నామని 2016లోనే ఎస్సార్ వెల్లడించింది. కానీ ఆ డీల్ సాకారం కాలేదు. దీని విక్రయం ద్వారా లభించే నిధులను రుణాల చెల్లింపుకు వినియోగించాలని ఎస్సార్ గ్రూప్ యోచిస్తోంది. కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా ఎస్సార్ గ్రూప్ తన రుణ భారాన్ని తగ్గించుకుంటోంది. దీంట్లో భాగంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సార్ ఆయిల్ విక్రయం ద్వారా రూ.72,600 కోట్ల రుణ భారం తగ్గించుకుంది. -
ఎస్సార్ బిజినెస్ పార్క్ విక్రయం
రూ.2,400 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్ఎంజీ కార్ప్ న్యూఢిల్లీ: ఎస్సార్ కంపెనీ ముంబైలోని బిజినెస్ పార్క్‌ను విక్రయించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో 1.25 మిలియన్ల చదరపుటడుగుల విస్తీర్ణమున్న ఈక్వినాక్స్ బిజి నెస్ పార్క్‌ను బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ ఆర్ఎంజీ కార్ప్‌కు విక్రయించామని ఎస్సార్ కంపెనీ తెలిపింది. ఈ డీల్ విలువ రూ.2,400 కోట్లని ఎస్సార్ గ్రూప్‌కు చెందిన అన్షుమన్ రుయా పేర్కొన్నారు. కీలకం కాని ఆస్తుల విక్రయ వ్యూహంలో భాగంగా ఈ బిజినెస్ పార్క్‌ను విక్రయించామని వివరించారు. ఈ బిజినెస్ పార్క్ విక్రయం ద్వారా వచ్చిన నిధులను తమ రూ.80,000 కోట్ల రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని తెలిపారు. భారత్‌లో ఇటీవల కాలంలో జరిగిన రెండో అతి పెద్ద ఆఫీస్ మార్కెట్ డీల్ ఇది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే బీకేసీలో 4.35 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణమున్న కమర్షియల్ స్పేస్‌ను గోద్రేజ్ ప్రోపర్టీస్ రూ.1,480 కోట్లకు విక్రయించింది. -
బిజినెస్ పార్క్ భవనంలో ఘోర అగ్నిప్రమాదం
సాక్షి, ముంబై: ముంబైలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక అగ్నిమాపక జవాన్ మరణించగా మరో 20 మంది అగ్నిమాపక సిబ్బంది, అధికారులు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అంధేరి లింక్ రోడ్డులోని 22 అంతస్తుల లోటస్ బిజినెస్ పార్క్ భవనంలో శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ అంధేరిలోని లింక్రోడుపై లోటస్ బిజినెస్ పార్క్ ఉంది. ఈ కార్పొరేట్ భవనంలో అనేక ప్రముఖ కంపెనీలతోపాటు సినీపరిశ్రమకు చెందిన కార్యాలయాలున్నాయి. ఎప్పటిలానే అప్పుడప్పుడే కార్యాలయాల్లోకి వస్తున్న ప్రజలకు 21 వ అంతస్తులో సుమారు 10 గంటల ప్రాంతంలో పొగలు కన్పించాయి. ఇది గమనించేలోపే మంటలు అంతస్తు మొత్తం వ్యాపించాయి. కొన్ని క్షణాల్లోనే 20వ అంతస్తుతోపాటు పైఅంతస్తుకు కూడా ఎగబాకాయి. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు తీవ్ర కృషిచేశారు. ముందు భవనంలోని వారందరిని ఖాళీచేయించారు. అయితే మంటల తీవ్రత అధికంగా ఉండడంతో బ్రిగేడ్ కాల్‌ను జారీ చేశారు. అనంతరం ఎవరైనా భవనంలో చిక్కుకుని ఉంటారని భావించి, సుమారు 32 మంది సిబ్బంది మంటలు అర్పడంతోపాటు చిక్కుకున్నవారిని రక్షించేందుకు భవనంలోని చొరబడ్డారు. మంటల తీవ్రత మరింత అధికమవడంతో ఊహించని విధంగా అనేక మంది అగ్నిమాపక సిబ్బంది మంటల మధ్య చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన నేవీ... మంటలను ఆర్పేందుకు వెళ్లి భవనంలో ఇరుక్కుపోయిన అగ్నిమాపక సిబ్బందిని రక్షించేందుకు వెంటనే నేవీని రంగంలోకి దింపాల్సివచ్చింది. 22 అంతస్తుల భవనంపై కొందరు, లోపల కొందరు చిక్కుకుపోవడంతో బయట ఉన్న ప్రజలతోపాటు అధికారుల్లో తీవ్ర భయాందోళనలు కన్పించాయి. అయితే నేవీ సిబ్బంది హెలికాప్టర్‌ను తీసుకువచ్చారు. అనంతరం ఒకరితర్వాత మరోకరిని ెహ లికాప్టర్ సహాయంతో పైకి (ఎయిర్‌లిఫ్ట్) తెచ్చారు. మరికొందరిని భవనంలోని వెళ్లి రక్షించారు. ఇలా మంటల్లో చిక్కుకున్న అగ్నిమాపక సిబ్బందిని నేవీ అధికారులు బయటికి తీసుకరాగలిగారు. అయితే దురదదృష్టవశాత్తు బోరివలి అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అగ్నిమాపక జవాను నితిన్ యేవలేకర్ మరణించారు. మరోవైపు 20 మందికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే సమీపంలోని కూపర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ రెస్క్యూ ఆపరేషన్ సమయంలోనే కొంతసేపు వర్షం పడటం కూడా కలిసొచ్చింది. దాంతోసాయంత్రం 6.30 గంటల వరకు భవనం టెరెస్‌పై మంటలు అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. కాగా, ఈ ఘటన వల్ల అంధేరీ లింక్ రోడ్డు ప్రాంతంలో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్‌ను వేరే రూట్లలో మళ్లించారు. ఆందోళన చెందిన హృతిక్..! ఈ భవనంలో మూడంతస్తులు బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్‌కు సంబంధించినవి. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఆయనకు చెందిన మూడు అంతస్తులు ఏవేవి అనేది మాత్రం తెలియరాలేదు. మరోవైపు ఇదే భవనంలో ప్రముఖ‘ చెఫ్’ సంజీవ్ కపూర్‌కు చెందిన రెస్టారెంట్‌తోపాటు కార్యాలయం కూడా ఉందని తెలుస్తోంది. -
ఐదేళ్లలో 2 కోట్ల మందికి ఉపాధి
హైదరాబాద్,న్యూస్‌లైన్: ప్రభుత్వ రంగ సంస్థలు తాము వినియోగించే విడిభాగాలు, పరికరాల్లో 20 శాతాన్ని తప్పనిసరిగా సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నుంచే కొనుగోలు చేయాలన్న నిబంధన వల్ల మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం కలిగిందని భారీ పరిశ్రమలశాఖ మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఎంఎస్ఎంఈ రంగం 11శాతం వృద్ధి రేటు సాధిస్తుందని, 33వేలకోట్ల టర్నోవర్‌తో మరో 2కోట్ల మందికి ఉపాధి కల్పించే స్థాయికి విస్తరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కుషాయిగూడలోని ఎన్ఎస్ఐసీ బిజినెస్పార్క్లో ఏర్పాటు చేసిన ‘నేషనల్ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్/ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్’ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. కొనుగోలుదారులు, తయారీదారులను ఒకే వేదికపైకి తెచ్చే ఈ ప్రదర్శన నిర్వాహకులను ఆమె అభినందించారు. జాతీయ ఆదాయంలో 45 శాతం వాటా కలిగి, దాదాపు 7.30 కోట్ల మందికి ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తంచేశారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ ఉత్పాదక మండలి ప్రారంభమైతే అది తెలంగాణకు వరమవుతుందన్నారు. పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానంటూ... పరిశ్రమలశాఖకు తొలి మహిళా మంత్రిగా తాను సాధించిన విజ యాలను ఆమె వివరించారు. ఈ సందర్భంగా ‘ఎంఎస్ఎంఈ ఎక్స్పో-2013’ సావనీర్‌ను విడుదల చేశారు. అనంతరంప్రదర్శనను ప్రారంభించి స్టాళ్లను తిలకించారు.