సాక్షి, విశాఖపట్నం: ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం.. ఊరూ వాడల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం.. సగటు వ్యక్తి చెంతకు పరిపాలన వ్యవస్థను తీసుకురావడం.. ఆహ్లాదాన్ని పంచడం.. ఆనందాన్ని అందించడం.. ఉపాధి అవకాశాలు కలి్పంచడం.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం.. ప్రతి ఒక్కరూ సామాజికంగా.. ఆర్థికంగా ఎదగడం. ఇవన్నీ స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా నెరవేరలేదు. ఇకపై నెరవేరవని అనుకున్నారంతా! కానీ.. కాలం మారింది. పాలకులు మారారు.
వ్యవస్థలో మార్పు వచ్చింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగింది. నాలుగున్నరేళ్లలో విశాఖపట్నంలో అద్భుతాలు జరిగాయి. పనికెళ్లిన పిల్లాడు.. బడికెళ్లాడు. చదువు ఆపేద్దామని అనుకున్న పేద విద్యార్థి.. కాలేజీల్లో ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్నాడు. వలస వెళ్లిన నిరుద్యోగి.. దర్జాగా సొంతూరికి సమీపంలోనే ఉపాధి పొందాడు. విత్తు, ఎరువు కోసం బరువైన హృదయంతో ఎదురు చూసే రైతు చెంతకే.. అన్నీ చేరాయి. వ్యవసాయం పండగలా మారింది. కునారిల్లిన ఐటీ పరిశ్రమ.. కొత్త పుంతలు తొక్కుతోంది. అభివృద్ధికి నోచుకోని రహదారులు.. అద్దంలా మెరుస్తున్నాయి. ప్రతి కోణంలోనూ సాగరాన్ని మించేలా విశాఖ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నిజంగా యెల్లో మీడియాకు ఇవేం కనపడవేమో!
రాబోతున్న భారీ పరిశ్రమలివే..
►అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం జగన్ స్వయంగా శంకుస్థాపన చేశారు. డేటా సెంటర్‌తో పాటు బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ రూ.21,844 కోట్లతో ఏర్పాటుకానుంది. తద్వారా 39,815 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
►గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎనీ్టపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్ మాల్, టర్బో ఏవియేషన్.. ఇలా.. విభిన్న రంగాల్లో బహుళ ప్రాజెక్టులను విశాఖ జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు మొగ్గు చూపారు.
గాజువాకకుపట్టాభిషేకం
కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న గాజువాక హౌసింగ్ సొసైటీ భూములకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాశ్వత పరిష్కారం చూపించారు. గాజువాకలో ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమ ఇంటిపై వారికి ఎలాంటి శాశ్వత హక్కులు లేవు. గత టీడీపీ దీన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవడమే తప్ప పరిష్కరించలేదు. కానీ.. సీఎం వైఎస్ జగన్ జీవో నంబర్ 301 , 388 పట్టాదారులకు టైటిల్ డీడ్స్ అందజేశారు. సుమారు రూ.1,500 కోట్ల విలువైన భూమిని ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన అందజేశారు. గాజువాక హౌసింగ్ సొసైటీ ద్వారా ప్రభుత్వ ఆక్రమిత భూములలో నివాసం ఉంటున్న 7,026 మందికి కన్వేయన్స్ డీడ్స్ అందించారు. అదేవిధంగా 39 మంది ఉక్కు కర్మాగార నిర్వాసితులకు కన్వేయన్స్ పట్టాలు, 40 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలందించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
ప్రగతి పథంలో ఆంధ్రవిశ్వవిద్యాలయం
ఈ నాలుగేళ్లలో 18కి పైగా ప్రాజెక్టులను ఏయూలో పూర్తయ్యాయి. రూ.11 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, రూ.40 కోట్లతో ఫార్మా టెస్టింగ్, ఇంక్యుబేషన్ సెంటర్, రూ.1.30 కోట్లతో స్టీల్‌ప్లాంట్‌తో సంయుక్తంగా హ్యూమన్ జెనిటిక్స్ విభాగంలో మెడికల్ జెనిటిక్స్ రీసెర్చ్ ల్యాబ్, ఏయూ–నాస్‌కామ్‌తో సంయుక్తంగా దాదాపు రూ 27 కోట్ల బడ్జెట్‌తో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, జియో ఇంజనీరింగ్ విభాగం సింగపూర్‌కు చెందిన సంస్థతో కలసి రూ.2 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.67.5 కోట్లతో ఎస్‌టీపీఐ ఆధ్వర్యంలో ఇంక్యుబేషన్, స్టార్టప్ ఎకో సిస్టం, ఆర్ట్స్ కళాశాల పరిధిలో ప్రత్యేకంగా రూ.5 కోట్ల వ్యయంతో డాల్బీ అటా్మస్ రికార్డింగ్ స్టూడియో, ఆ–హబ్ ఏర్పాటు చేశారు. 140కి పైగా సంస్థలు తమ సేవలు ప్రారంభించాయి.
► ఈబీసీ నేస్తం పథకం కింద.. ఏటా 6,650 మందికి రూ.9.98 కోట్లు చొప్పున రూ.39.9 కోట్లు, కాపునేస్తం ద్వారా ఏటా 6,150 మందికి రూ.9.23 కోట్లు చొప్పున మొత్తం రూ.36.9 కోట్లు, జగనన్న చేదోడులో భాగంగా నాలుగేళ్లలో 57,776 మందికి రూ.57.78 కోట్లు పంపిణీ చేసింది.
►వాహన మిత్ర పథకం ద్వారా ఏటా 19,440 మంది ఆటోడ్రైవర్లకు నాలుగేళ్లలో రూ.77.76 కోట్లు, మత్స్యకార భరోసాలో భాగంగా ఏటా 10,026 మంది మత్స్యకారులకు నాలుగేళ్లలో రూ.40.1 కోట్లు జమ చేసింది.
►జగనన్న విద్యా దీవెనలో భాగంగా ఏటా 38,141 మంది విద్యార్థులకు నాలుగేళ్లలో రూ.169.52 కోట్లు, జగనన్న వసతి దీవెనలో భాగంగా ఏటా 45,236 మందికి నాలుగేళ్లలో రూ.16 కోట్లు జమ చేసింది.
►జగనన్న విద్యా కానుక కింద ఏటా 1.01 లక్షల మంది విద్యార్థులకు రూ.19.91 కోట్లతో కిట్లను అందజేసింది. నాడు–నేడు ద్వారా ఫేజ్–1లో 1131 పాఠశాలలను అభివృద్ధి చేసింది. ఫేజ్–2లో రూ.114.82 కోట్లతో 309 పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది.
►రూ.34.80 కోట్లతో 102 శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తోంది.
►రూ.40.76 కోట్లతో 191 సామాజిక భవనాల నిర్మాణ పనులు ప్రారంభించగా.. ఇప్పటికే 83 భవనాలు పూర్తయ్యాయి. రూ.231.44 కోట్లతో 1387 డ్రైన్ల నిర్మాణ పనులు ప్రారంభించగా.. 858 ఇప్పటికే పూర్తి చేశారు.
రెండింతల అభివృద్ధి
జీవీఎంసీ పరిధిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని ఐదేళ్ల కాలంలో అంటే 2014 నుంచి 2019 వరకు మొత్తం 4,450 పనులకుగానూ రూ.1,450 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పటివరకు నాలుగున్నరేళ్ల కాలంలో 9,920 పనులను చేపట్టింది. ఇందుకోసం రూ. 2,490 కోట్ల మేర వ్యయం చేసింది. వీటితో పాటు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకుగానూ మరో రూ. 66 కోట్ల మేర వ్యయం చేసింది. ఈ నిధుల కింద 708 పనులను చేపడుతోంది. అంటే నాలుగున్నరేళ్ల కాలంలో జీవీఎంసీ పరిధిలో ఏకంగా రూ.2,556 కోట్ల మేర నిధులను వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నమాట. ఫలితంగా నగర రూపురేఖలు మారిపోయాయి.
పార్కుల్లో కొత్తందాలు
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన పార్కుల తర్వాత వాటి రూపురేఖలను మార్చివేసింది. నగరవాసులు వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ విధంగా మొత్తం 103 పనులను చేపట్టి... ఇందుకోసం రూ. 50 కోట్ల మేర వెచ్చింది. గతంలో కనీసం కన్నెత్తి చూసేందుకు వీలు లేకుండా ఉన్న శివాజీ పార్కు రూ.1.53 కోట్లతో కొత్తందాలను సంతరించుకుంది. సిరిపురం జంక్షన్‌లో ఏర్పాటు చేసిన వైజాగ్ స్క్వేర్ నగరానికి స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. నగరంలోని ప్రతి పార్కు ఒక బ్రాండ్ ఇమేజ్‌కు డెస్టినీగా మారింది. మరో రూ.16 కోట్లతో 8 పార్కుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
అభివృద్ధి పరవళ్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ సంయుక్తంగా కార్యచరణ రూపొందించారు. బెస్త గ్రామంగా ఉన్న ఊరు.. మహానగరంగా మారగా.. ఇప్పుడు దాని ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లింది మాత్రం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే. నగర అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో.. నాలుగేళ్లలో రూ.వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. పశ్చిమ, ఉత్తర, తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలున్నప్పటికీ.. రాజకీయాలకు తావులేకుండా.. ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ప్రభుత్వం సమానంగానే అభివృద్ధి చేసింది.
సొంతింటి కల నెరవేర్చారు
►టిడ్కో ఇళ్లను టీడీపీ హయాంలో పునాదులకే పరిమితం చేయగా.. వాటిని నిర్మించే బాధ్యత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకుంది. విశాఖ పార్లమెంట్ పరిధిలో 20 వేల ఇళ్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే 50 శాతం ఇళ్లల్లో పేద ప్రజలు గృహ ప్రవేశం చేశారు.
►కోర్టు కేసుల కారణంగా.. విశాఖ పరిధిలో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం రాష్ట్రంతో పోలిస్తే ఆలస్యంగా మొదలైనా.. చురుగ్గా నిర్మాణ పనులు సాగాయి. మొత్తం 1.92 లక్షల మంది సొంతింటి కల నెరవేర్చేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలనీలను నిర్మిస్తోంది. ఇప్పటికే 50 వేలకు పైగా కుటుంబాలు తమ సొంత ఇంటిలో ఆనందంగా జీవనం సాగిస్తుండటం విశేషం.
కొత్త కొత్తగా పర్యాటకం
► సువిశాల సాగరతీరం మణిహారంగా ఉన్న విశాఖలో.. పర్యాటకులను మరింత ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 11 కొత్త బీచ్‌లను అభివృద్ధి చేసింది.
► ఈ 11 బీచ్‌లను అనుసంధానిస్తూ.. కోస్టల్ బీచ్ మాస్టర్ ప్లాన్‌లో జిల్లాలో 25 బీచ్‌లు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధమైంది. విజయవాడలోని ఫిషరీస్ యూనివర్సిటీ నేతృత్వంలో దీనికి సంబంధించిన సర్వే కూడా పూర్తయింది.
► నిత్యం వేలాది మందితో కిటకిటలాడే బీచ్‌లను పరిశుభ్రంగా ఉంచేందుకు రూ.12.55 కోట్లతో మొత్తం ఆరు బీచ్ క్లీనింగ్ యంత్రాలను సిద్ధం చేసింది. ఎప్పటికప్పుడు బీచ్‌ల్లో పేరుకుపోయిన చెత్తను ఏరివేస్తున్నారు.
తళుక్కుమనేలా రహదారులు.. జంక్షన్లు
► 2019 నుంచి ఇప్పటి వరకు రూ.547.45 కోట్లతో 2,089 రహదారి పనులు మంజూరు కాగా.. ఇప్పటికే రూ.202.59 కోట్లతో 1,216 పనులు పూర్తయ్యాయి. మరో రూ.344.86 కోట్లతో 873 పనులు జరుగుతున్నాయి.
► 15 ఏళ్లుగా రహదారి సౌకర్యానికి నోచుకోని ప్రాంతాలకు సైతం రోడ్లు వేశారు.
► వివిధ ఫండ్స్ కింద వచ్చిన నిధులతో రూ.104 కోట్లతో 27 కి.మీ మేర రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి.
►అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రయాణికులు సేదతీరేందుకు అధునాతన బస్ బేలు ఏర్పాటు చేశారు. మొత్తం రూ.462.70 లక్షలతో 20 బస్‌బేలు నిర్మించారు. కూడళ్లను అభివృద్ధి చేశారు.
బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో
విభిన్నమైన ఐటీ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఒరవడి సృష్టించింది. ఇందుకు ఆకర్షితులై ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్‌ఎస్, అమెజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేశాయి. వైఎస్సార్ హయాంలో పురుడుపోసుకున్న విప్రో సంస్థ.. ఎట్టకేలకు కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. విశాఖలో స్టార్టప్‌ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సరీ్వసెస్ కంపెనీస్(నాస్కామ్) సీఈవో సంజీవ్ మల్హోత్రా ప్రకటించారు. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకో సిస్టమ్‌ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ చెగ్.. విశాఖలో కొత్త బ్రాంచ్‌ని ప్రారంభించింది. భారత్‌లో ఢిల్లీ తర్వాత వైజాగ్‌లోనే చెగ్ సంస్థ బ్రాంచ్‌ని ఏర్పాటు చేయడం విశేషం. మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీలు కూడా విశాఖలో ఏర్పాటయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment