న్యూఢిల్లీ: ఎస్సార్ గ్రూప్ ముంబైలోని ఈక్వినాక్స్ బిజినెస్ పార్క్‌ను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లోని 1.25 మిలియన్ చదరపుటడుగుల ఈక్వినాక్స్ బిజినెస్ పార్క్‌ను అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌కు రూ.2,400 కోట్లకు ఎస్సార్ గ్రూప్ విక్రయించనున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నాలుగు భవంతులున్న ఈ ప్రోపర్టీ విక్రయ లావాదేవీ చర్చలు తుది దశకు చేరాయని, ఈ నెలలోనే డీల్ పూర్తయ్యే అవకాశాలున్నాయని ఆయా వర్గాలు వివరించాయి. ఈ ప్రాపర్టీని రియల్టీ సంస్థ ఆర్‌ఎమ్‌జడ్ గ్రూప్‌కు విక్రయించనున్నామని 2016లోనే ఎస్సార్ వెల్లడించింది. కానీ ఆ డీల్ సాకారం కాలేదు.
దీని విక్రయం ద్వారా లభించే నిధులను రుణాల చెల్లింపుకు వినియోగించాలని ఎస్సార్ గ్రూప్ యోచిస్తోంది. కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా ఎస్సార్ గ్రూప్ తన రుణ భారాన్ని తగ్గించుకుంటోంది. దీంట్లో భాగంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సార్ ఆయిల్ విక్రయం ద్వారా రూ.72,600 కోట్ల రుణ భారం తగ్గించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment