ప్రైవేట్ రంగ ధనలక్ష్మి బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ శ్రీధర్ కళ్యాణసుందరం బోర్డుతో విభేదాల కారణంగా రాజీనామా చేశారు. ఆయన వైదొలిగిన గంటల వ్యవధిలోనే బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి.
ధనలక్ష్మి బ్యాంక్ షేర్లు పాక్షికంగా కోలుకోవడానికి ముందు సోమవారం (సెప్టెంబర్ 18) 9 శాతం వరకూ పడిపోయాయి. ఉదయం 10:20 గంటల సమయానికి బ్యాంక్ షేర్లు 3.25 శాతం క్షీణించి 28.20 రూపాయల వద్ద ఉన్నాయి. కేరళలోని త్రిసూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ధనలక్ష్మి బ్యాంక్‌కి కళ్యాణసుందరం 2022 డిసెంబరులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
(ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం)
ధనలక్ష్మి బ్యాంక్ ప్రస్తుతం బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివన్ నేతృత్వంలో ఉంది. అపరిష్కృతంగా ఉన్న బ్యాంకు ప్రణాళికాబద్ధమైన హక్కుల సమస్యపై తాను ప్రశ్నలు లేవనెత్తానని, దీంతో తనను బ్యాంకు నుంచి తొలగిస్తామని బెదిరించారని సెప్టెంబరు 16న ఎక్స్ఛేంజీలకు పంపిన లేఖలో కళ్యాణసుందరం ఆరోపించారు.
ధనలక్ష్మి బ్యాంక్ 2023 మార్చి నాటికి కేవలం రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉంది. బ్యాంక్ నాయకత్వానికి సంబంధించి చాలా కాలంగా గందరగోళం నెలకొంది. దీంతో ఈ బ్యాంక్‌పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచిన ఆర్బీఐ బోర్డులో ఇద్దరు డైరెక్టర్లను ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment