
ముంబై: స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్‌ఈ తాజాగా బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించనుంది. దీనికి సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు వచ్చినట్లు సంస్థ తెలిపింది. త్వరలోనే ఇందుకోసం ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ ఎక్సే్చంజీ ఈబిక్స్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
తద్వారా బీమా పథకాల విక్రయ వ్యాపారానికి ఉపయోగపడే ఎక్సే్చంజ్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. బీఎస్‌ఈ–ఈబిక్స్ పేరిట ప్రారంభించే ఈ కొత్త వెంచర్ .. దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ అవుట్‌లెట్స్, స్టాక్ బ్రోకర్లు, వెల్త్ మేనేజ్‌మెంట్ అడ్వైజర్లు, ఆర్థిక సంస్థలు.. జీవిత బీమా, సాధారణ బీమా పథకాలను విక్రయించేందుకు బీమా పంపిణీ ఎక్సే్చంజ్ ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడగలదని బీఎస్‌ఈ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment