
16 శాతం కుప్పకూలిన గ్రీస్ స్టాక్ మార్కెట్
గ్రీస్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది...
ఏథెన్స్: గ్రీస్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. దాదాపు ఐదు వారాల తర్వాత ఆరంభమైన ఏధెన్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ప్రధాన సూచీ ఒక దశలో 22 శాతం వరకూ క్షీణించింది. చివరకు 16 శాతం నష్టంతో ముగిసింది. 1985 తర్వాత ఇదే అత్యంత అధ్వానమైన ఒక రోజు నష్టం. బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థల షేర్లు బాగా క్షీణించాయి. ఈ షేర్లు దాదాపు 30 శాతం వరకూ నష్టపోయాయి. గ్రీస్ దేశపు ఒక ట్రేడింగ్ సెషన్‌లో షేర్ల హెచ్చుతగ్గుల పరిమితి 30 శాతంగా ఉంటుంది. గ్రీస్ దేశపు తాజా ఆర్థిక సంక్షోభానికి ఇన్వెస్టర్ల తొలి ప్రతిస్పందన ఇది. కాగా ఇతర యూరోప్ మార్కెట్లపై గ్రీస్ దేశపు స్టాక్ మార్కెట్ పతన ప్రభావం కనిపించలేదు.