న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్ 30న వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) నిర్వహించిన ఓటింగ్ ఫలితాలను తక్షణమే స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేయాలంటూ డిష్ టీవీ ఇండియాను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. వివిధ ప్రతిపాదనలపై జరిపిన ఓటింగ్ ఫలితాలను వెల్లడించకుండా డిష్ టీవీ తొక్కిపెట్టి ఉంచుతోందంటూ యస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇతర షేర్‌హోల్డర్లు ఫిర్యాదు చేయడంతో సెబీ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో డైరెక్టర్లపై చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
డిష్ టీవీ మాతృ సంస్థ అయిన ఎస్సెల్ గ్రూప్‌లో కొన్ని కంపెనీలు.. షేర్లను తనఖా పెట్టి యస్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నాయి. అవి డిఫాల్ట్ కావడంతో వాటి షేర్లను యస్ బ్యాంకు జప్తు చేసుకుంది. తనఖా పెట్టిన షేర్ల యాజమాన్య హక్కులపై ప్రమోటరు గ్రూప్ కంపెనీ డబ్ల్యూసీఏ, యస్ బ్యాంక్‌ల మధ్య వివాదం నెలకొంది. కంపెనీ ఏజీఎంలో వోటింగ్ హక్కులను నిరాకరించడంతో యస్ బ్యాంక్ .. సుప్రీం కోర్టును ఆశ్రయించగా, దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అయి తే, ఓటింగ్ ఫలితాలు మాత్రం డిష్ టీవీ వెల్లడించకపోవడం మరో వివాదానికి దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment