
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల పెట్టుబడులు విదేశీ మార్కెట్లకు తరలిపోకుండా... ఇకపై అంతర్జాతీయ స్టాక్ ఎక్స్చేంజిల్లో తమ సూచీల ట్రేడింగ్‌ను నిలిపివేయాలని మూడు ప్రధాన స్టాక్ ఎక్స్చేంజిలు నిర్ణయించుకున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజిఆఫ్ ఇండియా (ఎంఎస్‌ఈఐ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజి (ఎస్‌జీఎక్స్) తాజాగా నిఫ్టీ 50లో భాగమైన కంపెనీల స్టాక్స్ ఫ్యూచర్స్‌లో కూడా ట్రేడింగ్ ప్రారంభించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎస్‌జీఎక్స్ తదితర ఎక్స్చేంజిల ధోరణులతో... దేశ మార్కెట్ల నుంచి లిక్విడిటీ విదేశీ మార్కెట్లకు తరలిపోయే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. విదేశీ ఎక్సే్చంజీలు, ట్రేడింగ్ ప్లాట్‌ఫాంల డెరివేటివ్స్ ట్రేడింగ్‌కి సంబంధించి సూచీలు, స్టాక్స్ ధరల వివరాలను అందించేందుకు కుదుర్చుకున్న లైసెన్సింగ్ ఒప్పందాలను తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు మూడు ఎక్సే్చంజీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment