ఆ నేడు 1943 నవంబర్ 14:
స్టాక్ ఎక్స్‌ఛేంజ్ అనగానే మనకు ముంబాయే గుర్తొస్తుంది కానీ, హైదరాబాద్‌లో 1942 న వంబర్‌లోనే స్టాక్‌ఎక్స్‌ఛేంజ్‌ని నెలకొల్పారని తెలుసా? నాటి బ్రిటిష్ ఇండియాలో ఆర్థికమంత్రి గులాబ్ మహమ్మద్ నేతృత్వంలో కమిటీ ఏర్పడి, స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ను స్థాపించవలసిన ఆవశ్యకతను చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వెంటనే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ను నెలకొల్పారు. పురుషోత్తం దాస్ ఠాకూర్ దాస్ అధ్యక్షుడిగా ఏర్పడిన ఈ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ 1943 నవంబర్ 14న ఆరంభం అయింది. అహ్మదాబాద్, బాంబే, కలకత్తా, మద్రాస్, బెంగళూరు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ల తర్వాత ఇది ఆరవది. 1958లో జంటనగరాల నుంచి పని చేసేవిధంగా దీనికి తాత్కాలిక గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలు పెరగడంతో
1983 నుంచి శాశ్వత ప్రాతిపదికన గుర్తింపు వచ్చింది. తొలుత కోఠీలోని ఓ అద్దెభవనంలో ఆరంభమైన హెచ్‌ఎస్‌ఈ ఆ తర్వాత అనేక స్థలాలు, భవనాలు మారి చివరికి సోమాజిగూడలోని ఓ సువిశాల ప్రాంగణంలోకి మారింది. అయితే సెబీతో సర్దుబాట్లు కుదరని కారణంగా 2007లో దీని గుర్తింపు రద్దయింది.
హైదరాబాద్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆరంభం
Published Fri, Nov 13 2015 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM
Advertisement
Advertisement