British India
-
Noor Inayat Khan: స్పై ప్రిన్సెస్
కలం పట్టి కవితలు రాసిన అమ్మాయి రణక్షేత్రంలోకి అడుగుపెట్టింది. పియానోతో సుస్వరాలు వినిపించిన అమ్మాయి ఫిరంగి ధ్వనులు వినిపించే చోట పనిచేసింది. నూర్ ఇనాయత్‌ఖాన్ అనేది నామం కాదు నాజీలను వణికించిన శబ్దం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్–ఇండియా తొలి మహిళా గూఢచారి నూర్ గురించి... నూర్ ఇనాయత్ ఖాన్ అనే పేరు చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె గురించి ఈ తరానికి తెలియజేయడానికి నాటక రూపంలో ఒక ప్రయత్నం జరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ ఇండియా తరఫున నియామకం అయిన తొలి మహిళా గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్. ఆమె సాహసిక జీవితంపై రూపొందించిన ‘నూర్’ నాటకాన్ని ఈ నెలలో లండన్‌లోని సౌత్‌వార్క్ ప్లే హౌజ్‌లో ప్రదర్శించబోతున్నారు. ‘ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని మలుపులు ఉంటాయా అని ఆశ్చర్యపోయేంత జీవితం ఆమెది’ అంటారు ‘నూర్’ నాటక రచయిత్రి అజ్మా దార్. నూర్ వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే.... తండ్రి పేరు ఇనాయత్‌ఖాన్. బాంబే ప్రెసిడెన్సీలో జన్మించాడు. పూర్వీకులు టిప్పు సుల్తాన్ వంశస్థులు. ఇనాయత్‌ఖాన్ సూఫీ గురువు. సంగీతకారుడు. ‘ది సూఫీ ఆర్డర్ ఇన్ ది వెస్ట్’ అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా సూఫీ భావజాలాన్ని పాశ్చాత్య సమాజానికి పరిచయం చేశాడు. నూర్ తల్లి అమెరికన్. రే బేకర్ అనే ఆమె పేరు పెళ్లి తరువాత అమీనా బేగంగా మారింది. చిన్న వయసులోనే రచయిత్రిగా తన కెరీర్ మొదలుపెట్టింది నూర్. ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో కవిత్వంతోబాటు, పిల్లల కథల పుస్తకాలను ప్రచురించింది. బుద్దిస్ట్ జాతక కథల స్ఫూర్తితో ‘ట్వంటీ జాతక టేల్స్’ అనే పుస్తకాన్ని రాసింది. పిల్లల పత్రికలకు రెగ్యులర్‌గా రచనలు చేస్తుండేది. ఫ్రెంచ్ రేడియో కోసం రచనలు చేసేది. ‘చైల్డ్ సైకాలజీ’ చదువుకున్న నూర్ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. పియానో అద్భుతంగా వాయించేది. రెండో ప్రపంచ యుద్ధం నాటి కల్లోల కాలం అది. ఎటు చూసినా భయం రాజ్యమేలుతున్న ఆ కాలంలో కుటుంబాన్ని తీసుకొని ఇంగ్లాండ్‌కు వెళ్లాడు ఇనాయత్‌ఖాన్. మొదట పోర్ట్ సిటీ సౌత్ హాంప్టన్లో ఒక తత్వవేత్త దగ్గర ఆశ్రయం పొందారు. తండ్రి చనిపోయే నాటికి నూర్ వయసు పదమూడు సంవత్సరాలు. సున్నిత స్వభావి. కొత్త వాళ్ల దగ్గరికి వెళ్లేది కాదు. చాలా తక్కువగా మాట్లాడేది. అలాంటి నూర్లో అనూహ్యంగా మార్పు వచ్చింది. తల్లి తరువాత ఇంటికి తానే పెద్ద. ఒకవిధంగా చెప్పాలంటే చిన్న వయసులోనే తన కుటుంబానికి పెద్ద అండగా నిలబడింది. కుమార్తెలో వచ్చిన మార్పు చూసి తల్లి ఆశ్చర్యపోయేది! నవంబర్, 1940లో ఉమెన్స్ ఆగ్జిలరీ ఎయిర్ ఫోర్స్ (డబ్ల్యూ ఎఎఎఫ్)లో చేరి వైర్లెస్ ఆపరేటర్‌గా శిక్షణ పొందింది. ఆ తరువాత ‘బాంబర్ ట్రైనింగ్ స్కూల్’లో చేరింది. సీక్రెట్ బ్రిటిష్ వరల్డ్ వార్–2 ఆర్గనైజేషన్ స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్వోయి)లో నియామకం అయింది. ప్రత్యేక శిక్షణ తీసుకొని నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో అండర్ కవర్ వైర్లెస్ ఆపరేటర్‌గా పనిచేసింది. ఈ విధులు నిర్వహించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో వైర్లెస్ ఆపరేటర్‌గా పని చేయడం అంటే చావుకు చాలా సమీపానికి వెళ్లడం. ఒళ్లు జలదరించే ఎన్నో భయానక అనుభవాలు కళ్ల ముందున్నాయి. అయినా భయపడింది లేదు. దురదృష్టకరమైన పరిస్థితులలో నాజీలకు చిక్కి, కాన్సంట్రేషన్ క్యాంపుల్లో చిత్రహింసలకు గురై చనిపోయింది. ధైర్యసాహసాలకు ఇచ్చే జార్జ్ క్రాస్ పురస్కారాన్ని నూర్ మరణానంతరం బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. శాంతివచనాలు వినపడే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, రచయిత్రిగా గుర్తింపు పొందిన అమ్మాయి రణక్షేత్రంలో ఎందుకు పనిచేయాలనుకుంది? రెండో ప్రపంచయుద్ధకాలంలో గూఢచారిగా ఆమె పాత్ర, ప్రాధాన్యత ఏమిటి? ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంది? ఎన్ని కష్టాలు పడింది? ఏ పరిస్థితులలో నాజీలకు చిక్కింది? ఎంత దారుణమైన చిత్రహింసలకు గురైంది?... ఇలాంటి సందేహాలకు ‘స్పై ప్రిన్సెన్స్–ది లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్’లాంటి రచనలు సవివరంగా సమాధానాలు ఇచ్చాయి. ఈ క్రమంలో తాజా నాటకం ‘నూర్’ అనేది మరో ముందడుగుగా చెప్పుకోవచ్చు. శాంతివచనాలు వినపడే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, రచయిత్రిగా గుర్తింపు పొందిన అమ్మాయి రణక్షేత్రంలో ఎందుకు పనిచేయాలనుకుంది? రెండో ప్రపంచయుద్ధకాలంలో గూఢచారిగా ఆమె పాత్ర, ప్రాధాన్యత ఏమిటి? ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంది? ఎన్ని కష్టాలు పడింది? ఏ పరిస్థితులలో నాజీలకు చిక్కింది? ఎంత దారుణమైన చిత్రహింసలకు గురైంది? -
ఎత్తండ్రా తుపాకులు.. దించండ్రా తూటాలు
పాండే తిరగబడటానికి తక్షణ కారణం.. కొత్త ఎన్ఫీల్డ్ తుపాకులలో వాడేందుకు సిపాయిలకు బ్రిటిష్ ఆర్మీ పంపిణీ చేసిన తూటా గుళిక (క్యాట్రిడ్జ్) లేనని, సాఫీగా జారేందుకు వీలుగా ఆ గుళికలకు జంతువుల కొవ్వుతో తయారు చేసిన గ్రీజును అద్ది ఇవ్వడం వల్లనే పాండే మత మనోభావాలు తీవ్రంగా గాయపడి తన పైఅధికారులపై బహిరంగంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడని బ్రిటిష్ చరిత్రకారులు రాశారు. నిజమేనా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ ఘటన జరిగినప్పుడు పాండేతో పాటు అక్కడ అవథ్ బ్రాహ్మణ సిపాయిలు కూడా ఉన్నారు. బ్రిటిష్ వారి అప్రాచ్య విధానాల వల్ల తమ కులం, మతం మంట కలిసిపోతాయని వారంతా భయపడ్డారు. పాండే తుపాకీ ఒక్కటే నిర్భయంగా పైకి లేచింది. దానిని గాలిలో ఊపుతూ.. ‘‘అంతా బయటికి వచ్చేయండి. ఈ తూటాల క్యాట్రిడ్జ్‌లను నోటితో తెరిచామంటే మనం మత విశ్వాస ఘాతకులం అయినట్లే. ఇంకా ఆలోచిస్తారేమిటి? యూరోపియన్ల పని పడదాం రండి’’ అని అరిచాడు. అంతేకాదు, ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు బ్రిటిష్ అధికారులు.. సార్జెంట్ హ్యూసన్, లెఫ్ట్‌నెంట్ బాగ్‌లతో కూడా పాండే తలపడి తన కత్తితో, తుపాకీతో వారిని గాయపరిచాడు. ఆ గొడవకి ప్రెసిడెన్సీ విభాగం కమాండింగ్ ఆఫీసర్ జనరల్ హియర్సే అక్కడి రాగానే పాండే తనని తాను కాల్చుకున్నాడు. అయితే ఆ తూటా అతడిని చంపే విధంగా తగల్లేదు. ఈ ఘటనంతా కొన్ని చరిత్ర పుస్తకాలలో మరింత వివరంగా ఉంది. ఆవు కొవ్వు, పంది కొవ్వు ఉపయోగించి తయారు చేసిన క్యాట్రిడ్జ్‌లను కొరికి ప్రయోగించడానికి నిరాకరించిన మంగళ్ పాండే, ఆ కోపంలో తన పై అధికారిని హతమార్చాడు. షేక్ పల్టూ అనే సహ సిపాయి పాండేను వారించే ప్రయత్నం చేశాడు. ఈ కలకలం చెవిన పడి అక్కడికి చేరుకున్న జనరల్ హెర్పే.. పాండేను పట్టుకోమని జమాదార్ ఈశ్వరీ ప్రసాద్‌ను ఆదేశించారు. ప్రసాద్ కదల్లేదు. ఈలోపు పాండే తన తుపాకితో తనే కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించి విఫలమయ్యాడు. బ్రిటిష్ సైనికులు వెంటనే అతడిని నిర్బంధించి హత్యానేరం మోపారు. సైనిక న్యాయస్థానం పాండేను ఏప్రిల్ 18 న ఉరి తీయాలని తీర్పు చెప్పింది. అయితే 10 రోజుల ముందుగానే అతడిని ఉరి తీశారు. అతడిని పట్టుకునేందుకు చొరవ చూపని ఈశ్వరీ ప్రసాద్‌ను కూడా రెండు వారాల తర్వాత ఏప్రిల్ 22న ఉరి తీశారు. పాండే తిరుగుబాటు చేస్తున్నప్పుడు చూస్తూ నిలబడిపోయారన్న ఆరోపణలపై తక్కిన సిపాయిల దుస్తులు విప్పించి పరేడ్ చేయించారు. మంగల్ పాండేను అడ్డుకుని, బ్రిటిష్ అధికారులను రక్షించేందుకు ప్రయత్నించిన షేక్ పల్టూకి పదోన్నతి లభించింది. కాలక్రమంలో పాండే భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ప్రేరణ కలిగించిన తొలి తిరుగుబాటు సిపాయిగా చరిత్రలో నిలిచిపోయాడు. అతడు మరణించిన 148 ఏళ్ల తర్వాత 2005లో బరక్‌పూర్ (పశ్చిమ బెంగాల్) స్థానిక పాలన మండలి ఊరి నడిబొడ్డున పాండే విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆ ఊరిలోని ఆర్మీ బ్యారక్ల మధ్య ఏర్పాటు చేసిన ఆ విగ్రహం రూపంలో పాండే ఒంటరి యోధుడిలా కనిపిస్తాడు. ఛాతీ వరకు ఉన్న ఆ స్మారక విగ్రహం కింద ‘మంగళ్‌పాండే, సిపాయి నెం.1446, 34 వ రెజిమెంట్. 1858 మార్చి 29న పట్టపగలు బ్రిటిష్ అధికారులపై ఇతడు తుపాకీ పేల్చాడు’ అని రాసి ఉంటుంది. ‘‘ఈ విగ్రహాన్ని పెట్టేవరకు పాండే ఎలా ఉంటాడో మాకూ తెలీదు’’అని ఆ ప్రాంతాన్ని సందర్శించిన వారితో స్థానికులు చెబుతుంటారు. తిరుగుబాటు జరిగిన వారం లోపలే పాండేపై విచారణ జరిగింది. భంగు, నల్లమందు తీసుకోవడం వల్ల ఆ మత్తులో ఏం చేస్తున్నదీ తనకు తెలియలేదని పాండే చేత బలప్రయోగంతో చెప్పించి, అతడికి మరణశిక్ష విధించారు. ఏప్రిల్ 8న ఉరికొయ్యల దగ్గరికి వెళుతున్నప్పుడు కూడా అతడిలోని గాంభీర్యం సడల్లేదని కొందరు చరిత్రకారులు రాశారు. బరక్పూర్లోని ఒక మర్రిచెట్టుకి పాండేని ఉరి తీశారని చెబుతారు. ‘‘ఆ చెట్టు ఇప్పటికీ ఇక్కడి పోలీసు శిబిర ప్రాంగణంలో ఉంది. అయితే లోపలికి ఎవరినీ అనుమతించరు. దాని గురించి వినడం వరకే..’’ అంటారు బరక్‌పూర్ గ్రామస్థులు. కనిపించే విగ్రహం, కనిపించని ఉరికొయ్య.. ఈ రెండే అక్కడ మిగిలి ఉన్న మంగళ్ పాండే స్మృతి చిహ్నాలు. పదిహేడేళ్ల క్రితం 2005లో పాండే మాట మళ్లీ ఒకసారి దేశంలో ఉత్తేజాన్ని నింపింది. పాండేగా అమీర్‌ఖాన్ నటించిన ‘ది రైజింగ్ : బ్యాలెడ్ ఆఫ్ మంగళ్ పాండే’ చిత్రం ఆ ఏడాది విడుదలైంది. 1857 మే 10న జరిగిన సిపాయిల తిరుగుబాటుకు బీజాలు వేసింది మార్చి 29 నాటి పాండే ధైర్యసాహసాలేనా అనే విషయమై చరిత్రకారులు నేటికీ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ‘బ్రేవ్ మార్టిర్ ఆర్ యాక్సిడెంటల్ హీరో’ పుస్తక రచయిత రుద్రాంక్షు ముఖర్జీ.. పాండేను దేశభక్తుడిగా గుర్తించలేమని, భారత తొలి స్వాతంత్య్ర సమరారంభానికి, పాండే తిరుగుబాటుకు సంబంధమే లేదని రాశారు! ఎవరేం రాసినా, తిరుగుబాటు భావాలకు ప్రతీకశక్తి మాత్రం భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో పాండే ఒక్కడే. అయితే బయటి నుంచి చూసే వారి దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. దానినీ ఆహ్వానించాలి. చరిత్రలో ఏం జరిగిందన్న వాస్తవం యథాతథంగా ప్రజలకు కావాలి. అందుకోసం చిన్న చిన్న అంశాలను కూడా చరిత్ర పరిశోధకులు వెలుగులోకి తేవాలి. అప్పుడే సంపూర్ణ వాస్తవానికి మరింత సమీపంగా వెళ్లగలం. -
శతమానం భారతి : బ్రిటిష్ ఇండియాలో తొలి ఇంజనీరింగ్ కాలేజ్ ఐ.ఐ.టి. రూర్కీ
దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక పాత్ర పోషిస్తుంది. అయితే భారతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏటా పట్టభద్రులవుతున్న సుమారు 15 లక్షల మంది విద్యార్థులలో అత్యధికులకు ఉద్యోగార్హ ప్రమాణాలు కొరవడుతున్నాయన్న విమర్శ ఉంది. అంతర్జాతీయంగా వస్తున్న అధునాతన సాంకేతిక మార్పులు, ఉన్నత ప్రమాణాలను అందిపుచ్చుకోవడంలో దేశీయ ఇంజనీరింగ్ కళాశాలలు విఫలం అవుతున్నాయన్న మాటలో కొంతైనా వాస్తవం లేకపోలేదు. ప్రపంచంలో అమెరికా తరువాత ఎక్కువ మంది ఆంగ్లం మాట్లాడేది భారతదేశంలోనే. అయినా, ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో భారత్ తీసికట్టుగా ఉంది. స్వాతంత్య్రం అనంతరం మన ఉన్నత విద్య ప్రపంచ ప్రమాణాలకు దీటుగా ఎదగకపోవడమే దీనికి కారణం. పూర్వం భారత్‌లోని నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసానికి ఇతర దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. కానీ, నాటి ప్రమాణాలు నేడు లేవు. మన ఇంజినీరింగ్ విద్యాలయాలు కేవలం బోధనతోనే సరిపెట్టుకోకుండా జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలతో అనుసంధానం కావాలి. ప్రపంచంలో అమెరికా, చైనాల తరవాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఇండియా ధ్యేయంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని 2030–32 నాటికి అందుకోవాలని భావిస్తోంది. అప్పటికి భారత్ 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితేనే అనుకున్న లక్ష్యం సాధించగలుగుతుంది. బలమైన విద్యావ్యవస్థ పునాదిపై అధునాతన విజ్ఞానాధారిత సమాజాన్ని నిర్మించడం ద్వారానే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతుంది. (చదవండి: మహోజ్వల భారతి: ఆక్స్ఫర్డ్ నుంచి తొలి ముస్లిం) -
ఒక చట్టం... వేల వివాదాలు
124ఏ. బ్రిటిష్ వలస పాలకుల కాలం నాటి దేశద్రోహం చట్టం. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఇది దుర్వినియోగమవుతుండటం నిజమేనా...? సెక్షన్ 124 ఏలో ఏముంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు. ఎందుకు తెచ్చారు ? స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్ థామస్ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి. దిశ రవి నుంచి వరవరరావు వరకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కశ్మీర్‌పై వ్యాఖ్యలు చేసినందుకు అరుంధతి రాయ్, రైతు ఉద్యమానికి మద్దతుగా టూల్ కిట్ రూపొందించిన సామాజిక కార్యకర్త దిశ రవి, హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు సిద్దిఖి కపన్, పటీదార్ కోటా ఆందోళనలో పాల్గొన్న హార్దిక్ పటేల్, భీమా–కొరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, కరోనా సంక్షోభంపై వ్యాఖ్యలకు జర్నలిస్టు వినోద్ దువా తదితరులపై దేశద్రోహ ఆరోపణలు మోపారు. ► 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి ► ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది. ► 2010–20 మధ్య బిహార్‌లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్‌లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత గడ్డపై తొలి బడ్జెట్‌కు 162 ఏళ్లు..
న్యూఢిల్లీ: మొదట్లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న మన దేశాన్ని.. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ నేరుగా పాలించడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే మన దేశానికంటూ మొదటిసారిగా 1860 ఏప్రిల్ 7న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరఫున స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ ఆ బడ్జెట్ రూపొందించి, బ్రిటిష్ పార్లమెంట్‌కు సమర్పించారు. స్వాతంత్య్ర భారతంలో 1947 నవంబర్ 26న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రహస్యంగా..ప్రింటింగ్‌నే మార్చేసి కేంద్ర బడ్జెట్ రూపకల్పన, పత్రాల ముద్రణ అత్యంత రహస్యంగా సాగుతుంది. బడ్జెట్లోని అంశాలు ముందే తెలిస్తే.. ఎవరైనా వాటిని మార్చేలా ప్రభావితం చేయడానికి వీలు ఉంటుందన్నదే దీనికి కారణం. అందుకే బడ్జెట్ పత్రాలను ముద్రించినన్ని రోజులు సిబ్బంది ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. 1950 వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ పత్రాలు ముద్రించేవారు. ఆ ఏడాది బడ్జెట్ రహస్యాలు ముందే లీకవడంతో ముద్రణను ఢిల్లీలోని మింట్ రోడ్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌కు మార్చారు. 1980 నుంచి కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం ఉండే నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. చదవండి: (బడ్జెట్ ఇంగ్లిష్‌లోనే ఎందుకు?) -
ఆత్మహత్య చేసుకున్నప్పటికీ భౌతికకాయాన్నే ఉరి తీశారు...సేఫ్టీవాల్వ్ అందుకే...!
ఈస్టిండియా కంపెనీ అనుభవాలను గుణపాఠాలుగా మలచుకోక తప్పని ఒక క్లిష్ట వాతావరణం బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి ఎదురైంది. భారతీయులతో, స్థానిక పాలకులతో కంపెనీ వ్యవహరించిన విధానం స్థానికులను తిరుగుబాట్లకు ప్రేరేపించేదే! కంపెనీకి విదేశాలతో గొడవ పెట్టుకునే అవకాశం లేదు. కొన్ని పనులకు బ్రిటిష్ రాణి అనుమతి తీసుకోక తప్పేది కాదు. కానీ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ పరిధి పెద్దది. ఇరుగు పొరుగు దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకుంది. కంపెనీ నీచత్వం సరే, దానికేమీ తీసిపోని రాణి పాలన కారణంగాను 1857 తరువాత కూడా ప్రజానీకంలో చల్లారని ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. రాణి వాటిని చల్లార్చే ప్రయత్నమేమీ చేయలేదు. అన్ని వైపుల నుంచి ఆగ్రహ జ్వాలలు చుట్టుముట్టాయి. ఈ వేడిని తగ్గించే ఒక వ్యూహంలో భాగంగానే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు కోసం ఏ ఓ హ్యూమ్ అక్షరాలా కాలికి బలపం కట్టుకుని మద్రాస్, బొంబాయి, పూనా నగరాలు తిరిగాడు. ఒక సేఫ్టీవాల్వ్ ఏర్పాటు అవసరమని బ్రిటిష్ ఇండియా ఎందుకు అంతగా తహతహలాడిందో తెలియాలంటే జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు ముందు నాటి రగులుతున్న భారతదేశం ఎలా ఉన్నదో చూడాలి. 1885కు ముందు, అంటే కాంగ్రెస్ స్థాపనకు ముందు ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ ఇండియా హయాంలలో దేశం నలుమూలలా ఆగ్రహావేశాలు చెలరేగాయి. హిందీ ప్రాంతాలు సరే, అస్సాం, బెంగాల్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర, నిజాం ప్రాంతాలలో కూడా తిరుగుబాట్లు జరిగాయి. తిరగబడిన దాదాపు అందరినీ ఉరికంబాలు ఎక్కించారు. నెర్కట్టుంసేవల్ పాలెగార్ (పాలెగాడు) పులిదేవర్. ఇది తిరునేల్వేలి దగ్గర ఉంది.1757లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా ఇతడు పోరాడాడు. ఊండివరన్, వెన్నికలాది ఈయన సైన్యాధిపతులు. కంపెనీ మీద తిరగబడిన తొలి భారతీయునిగా ఇతడికి పేరుంది. అప్పుడే బెంగాల్లో సిరాజుద్దౌలాకీ కంపెనీకీ మధ్య ప్లాసీ యుద్ధం జరిగింది. మరుధు పాండియార్లు (పెరియ మరుధు, చిన్న మరుధు) వీరు 18వ శతాబ్దం చివరిలో శివగంగై పాలకులు. వీరు కంపెనీ ఆధిపత్యం మీద తిరుగుబాటు చేశారు. ఈ ఇద్దరినీ ఉరి తీశారు. 18వ శతాబ్దంలో దక్షిణాదిన కనిపించే మరొక వీరుడు వీరపాండ్య కట్టబొమ్మ కరుతయ్య నాయకర్. పాంచాలన్కురుచిని పాలించేవాడు. ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు 1799లోనే ఉరి తీశారు. 1808–09 నాటి వేలు తంపి తిరుగుబాటు కూడా చరిత్రలో ఎంతో కీలకమైనది. తిరువాన్కూర్ దివాన్ వేలు తంపిని పదవి నుంచి తొలగించాలని కంపెనీ కుట్ర పన్నింది. సైన్య సహకార పద్ధతితో సంస్థానాన్ని దోచేస్తున్న కంపెనీ ఆగడాలను అడ్డుకొనే ప్రయత్నం చేయడమే తంపి చేసిన పాపం. చివరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పటికీ భౌతికకాయాన్నే ఉరి తీశారు. మహారాష్ట్ర ప్రాంతం సతారాలో 1822–25 ప్రాంతాలలో జరిగిన రామోసీల తిరుగుబాటు కూడా కంపెనీని భయపెట్టింది. రామోసీలు అంటే పోలీసు, సైనిక వ్యవస్థలో ఉండే అత్యంత కింది స్థాయి ఉద్యోగులు. వీరే చిత్తూర్‌సింగ్ నాయకత్వంలో తిరగబడ్డారు. చిత్రంగా వీరు పెంచిన భూమిపన్నుకు వ్యతిరేకంగా ఆ తిరుగుబాటు చేశారు. ఆంధ్ర ప్రాంతాన్ని కబళించే ప్రయత్నం 1766 నుంచి కంపెనీ ఎలా చేసిందో ప్రొఫెసర్ కెఎస్ఎస్ శేషన్ ‘ఎర్లీ యాంటీ బ్రిటిష్ రివోల్ట్స్ ఇన్ ఆంధ్ర 1766–1857’ పుస్తకంలో వివరించారు. స్థానిక పాలకుల పట్ల ఈస్టిండియా కంపెనీ చూపిన అవమానకర వైఖరితోనే ఆ తిరుగుబాట్లు జరిగాయని శేషన్ అంటారు. సర్కార్ గడ్డ మీద మైదాన ప్రాంతంలో పెద్ద జమీందార్లు, మన్య ప్రాంతాలలో చిన్న జమీందార్లు కూడా తిరుగుబాట్లు చేశారు. తమను ఆర్కాట్ నవాబు అధికారం నుంచి తొలగించడం, నవాబుకు కంపెనీ అండ ఉండడం వంటి కారణాలతో ఈ తిరుగుబాట్లు సాగాయి. 1846 నాటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం, విశాఖపట్నం, మొమినాబాద్, బొల్లారం తిరుగుబాట్లు కూడా అలాంటివే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తండ్రి మల్లారెడ్డి పాలెగాడు. కర్నూలు జిల్లాలో కంపెనీ దమనకాండకు నిరసనగా పోరుబాట పట్టిన ఐదువేల మంది రైతులకు నరసింహారెడ్డి నాయకత్వం వహించాడు. ఈయన సేనాపతి వడ్డె ఓబన్న. రైత్వారీ విధానం, పన్ను పెంపు మీద రైతులు తిరగబడ్డారు. ఇతడి చేతిలో పెద్ద ఎత్తున కంపెనీలు సేనలు హతమయ్యాయి. 1847 ఫిబ్రవరి 22న నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరి తీయడంతో ఉద్యమం చల్లారిపోయింది. 19వ శతాబ్దంలో తూర్పు భారతంలో ముఖ్యంగా అస్సాంలో కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగాయి. యాండాబు ఒప్పందం (1826) మేరకు అస్సాం కంపెనీ అధీనంలోకి వచ్చింది. యథాప్రకారం కంపెనీ కిందకు అస్సాం రావడం, కల్లోలం ఆరంభం కావడం ఏకకాలంలో జరిగాయి. తిరుగుబాట్లలో అటు పై వర్గాల వారు, మధ్య, దిగువ తరగతుల వారు కూడా పాల్గొన్నారు. అలాంటి ప్రయత్నం చేసిన వారిలో మొదటివాడు గోంధార్ కున్వార్. కుందురా దీకా ఫుఖాన్, దామోదర్, హర్నాథ్ ఇతర స్థానిక పాలకులు కూడా అతడికి సహకరించారు. వీరంతా కలసి 1828లో సాడియా అనే చోట కంపెనీ ఆయుధాగారం మీద దాడి చేశారు. ఇది విఫలమైంది. మళ్లీ పియాలీ బర్ఫూఖన్ నాయకత్వంలో మరొక తిరుగుబాటు జరిగింది. ఈయనకు జీయురాం దూలియా బారువా, బేణుధర్ కున్వార్, రూప్‌చంద్ కున్వార్, దేయురాం దిహింగియా, బౌవ్‌ు చింగ్‌ఫూ, హర్నాథ్ తదితరులు సహకరించారు. రంగపూర్‌లో ఉన్న బ్రిటిష్ శిబిరాన్ని దగ్ధం చేయాలని పియాలీ బర్ఫూఖన్ నాయత్వంలో జరిగిన కొత్త ప్రయత్నం విజయవంతమైంది. కానీ పియాలీ, జియురాం బారువా, ఇంకొందరు ఆందోళనకారులను కంపెనీ అధికారులు పట్టుకున్నారు. పియాలీ, జియురాంలను ఉరి తీసి, మిగిలిన వారిని ద్వీపాంతరం పంపారు. ఇదే సమయంలో ఎగువ అస్సాంలో పనిచేసే కొందరు కంపెనీ బ్రిటిష్ జాతీయులను చంపాలని గదాధర్ గొహిన్ అనే మరొక వీరుడి నాయకత్వంలో ప్రయత్నించారు. కానీ ఇది విఫలయింది. గదాధర్‌ను జైలులో పెట్టారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆ జ్వాలను అస్సాంకు తీసుకుని వెళ్లినవాడు మణిరాం దివాన్. ఆ సమయంలో కలకత్తా వెళ్లి, మరొక ఉద్యమకారుడు మధు మల్లిక్ సాయంతో పథకం వేశాడు. 1857 ఘటన వార్తలను అస్సాం సంస్థానం ఆఖరి పాలకుడు కందర్పేశ్వర్ సింగ్, సలహాదారు పియాలీ బారువాకు మణిరాం అందించేవాడు. ఈ పథకంలో ఇంకా మాయారాం నజిర్, నీలకంఠ చోలాధర ఫుఖాన్, మారంగికోవె గొహిన్, ద్యుతిరాం బారువా, బహదూర్ గాన్బురా, ఫార్ముద్ అలీ, త్రినయ, కమల బారువా పనిచేశారు. సాహాబాద్ అనేచోట ఉన్న సిపాయీల మద్దతే వీరికి కీలకమైంది. ఈ పథకం ప్రకారం సిపాయీలంతా, అస్సాం పాలకుని నాయకత్వంలో కంపెనీ అధికారుల మీద తిరగబడాలి. ఇంతలో మణిరాం కలకత్తా నుంచి ఆయుధాలతో వచ్చి కలుస్తాడు. పథకం అమలులో కొద్దిపాటి ఆలస్యం కావడంతో కంపెనీ వెంటనే అప్రమత్తమై తిరుగుబాటులో ఉన్నవారందరినీ అదుపులోకి తీసుకుంది. కలకత్తా నుంచి పనిచేస్తున్న మణిరాంను కూడా అరెస్టు చేశారు. కందర్పేశ్వర్‌సింగ్‌ను కారాగారంలో పెట్టారు. చాలామందిని ద్వీపాంతరం పంపారు. మణిరాం, పియాలీ జోర్హాట్ కారాగారంలోనే చనిపోయారు. 1861, 1894లలో ఫులగారి, పత్థర్‌ఘాట్ అనేచోట రైతాంగ పోరాటాలు జరిగాయి. ఇలాంటివి ఇంకా ఎన్నో! - డా. గోపరాజు నారాయణరావు చదవండి: Needle Free Injection: సూదిలేని ఇంజెక్షన్ వచ్చేసింది.. నొప్పి లేకుండా... -
కాలంతో నడక
దాదాపుగా ముప్పయ్ సంవత్సరాల కిందటి నాటి ముచ్చట. ఇళ్లలోకి టెలివిజన్ సెట్లు నెమ్మదిగా చేరుకుం టున్న రోజులవి. దూరదర్శన్‌లో ‘మహాభారత్’ సీరియల్ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం పూట ప్రసారమయ్యేది. ఆ సమయంలో వీధుల్లో కర్ఫ్యూ వాతావ రణం కనిపించేది. జనం టీవీలకు అతుక్కుపోయేవారు. అది హిందీలో వచ్చినా, భారతం కథ కనుక తెలుగు వాళ్లకు కూడా బాగానే అర్థమయ్యేది. హిందీయేతర ప్రాంతాల ప్రజలకు నాలుగు హిందీ ముక్కల్ని ఈ సీరి యల్ నేర్పించింది. టీవీ భారతం ఒక కొత్త పాత్రను ప్రజలకు పరిచయం చేసింది. అదే ‘కాలం’ పాత్ర. కాలం ఈ సీరియల్‌కు యాంకర్. సీరియల్ ప్రారంభం కాగానే తెరపై కాలచక్రం తిరుగుతూ వుండేది. నేపథ్యంలో హరీశ్ భిమానీ గొంతులోంచి కాలం సంభాషణ గంభీరంగా వినిపించి ప్రజలకు బాగా చేరువయ్యింది. తొలి ఎపిసోడ్లో కాలం తనను తాను పరిచయం చేసుకు న్నది. ‘‘మై సమయ్ హు!... మేరే జన్మ్ సృష్టికే నిర్మాణ్ కే సాత్ హువా థా! మై పిచ్లే యుగోంమే థా, ఇస్ యుగోంమే హు, ఔర్ ఆనేవాలే సబీ యుగోంమే రహూంగా...’’. ఆ సంభాషణలోనే తన స్వభావాన్ని కూడా కాలం చాటుకుంది. ‘‘ఈ భూమ్మీద పుట్టిన సమస్త జీవరాశిని, వాటి ఉత్థాన పతనాలను నేను చూశాను. నాతో కలిసి నడవలేక బ్రహ్మాండమైన డైనోసార్లు నశించాయి. నాతోపాటు మారలేకపోవడం వలన రోమ్ వైభవం, గ్రీకు రణతేజం, మొఘల్ ప్రాభవం నశిం చాయి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పతనమైంది. నాతోపాటు నడుస్తూ, నేను చేసే మార్పులను అనుసరిస్తూ వచ్చేవాడే విజయ శిఖరం మీద నిలబ డగలుగుతాడు’’. ఇది టీవీ సీరియల్ సంభాషణే అయిన ప్పటికీ, నిజంగా కాలం లక్షణం అదే. కాలం మానవా తీతమైనది. అందువల్ల దానికి జాలి, దయ, క్రోధం, ప్రేమ వగైరా మానవ వికారాలేమీ వుండవు. కదిలిపోవ డమే దాని కర్తవ్యం. ఎవరికోసమూ ఆగదు. ‘కదిలే కాలమా... కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుకా... కళ్లార చూడవమ్మా’ అని కమ్మని కంఠంతో యేసుదాసు వేడు కున్నా అది ఆగదు. అనంత కాలగమనంలో డెబ్బయ్ ఒక్క సంవత్స రాల క్రితంనాటి ఒకానొక తారీఖు గురించీ, దాని చుట్టూ ముసురుకుంటున్న తత్వాల గురించే ఈ ఉపోద్ఘాతం. ఆ తారీఖు సెప్టెంబర్ 17. ఆ సంవత్సరం 1948. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటివరకూ బ్రిటిష్ ఇండియాలో భాగం కాకుండా విడిగా వున్న స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించారు. అన్ని సంస్థానాల్లోకీ పెద్దది హైదరాబాద్. ఇది నిజాం రాజ్యం. హైదరా బాద్‌తోపాటు కశ్మీర్, జునాగఢ్ రాజ్యాలు విలీనానికి కొద్దిరోజులు మొరాయించాయి. ఆ తర్వాత విలీనమ య్యాయి. సెప్టెంబర్ 17వ తేదీనాడు అధికారికంగా హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీన మైంది. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎయిర్ పోర్ట్‌లో సర్దార్ పటేల్‌కు ఎదురువెళ్లి స్వాగతం పలికారు. భారత ప్రభుత్వం కూడా నవాబును హైదరాబాద్ రాష్ట్రా నికి రాజ్ ప్రముఖ్‌గా ప్రకటించింది. ఏటా యాభై లక్షల రూపాయల రాజభరణం చెల్లించేందుకు అంగీకరిం చింది. ఆయన ఎక్కడికి వెళ్లినా గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకుంది. విలీన కార్యక్రమానికి ముందు మొరాయించిన మూడు సంస్థానాలను లొంగ దీసుకోవడానికి మూడు రకాల వ్యూహాలను భారత ప్రభుత్వం అమలుచేసింది. హైదరాబాద్‌కోసం ‘ఆపరేషన్ పోలో’ అనే యుద్ధవ్యూహాన్ని రచించారు. ఆంధ్ర సరి హద్దు ప్రాంతంలో ఒకటి, బొంబాయి సరిహద్దు ప్రాంతంలో ఒకటి చొప్పున జనసంచారం లేని గుట్టల్లో రెండు బాగా చప్పుడయ్యే బాంబుల్ని వదిలారు. యాభై వేల మందితో కూడిన యూనియన్ మిలిటరీ దిగింది. నిజాం ఆదేశాల మేరకు నిజాం సైన్యం వెంటనే లొంగి పోయింది. పారా మిలిటరీ దళంలాగ వ్యవహరిస్తూ ప్రజ లను పీడిస్తున్న రజాకార్లు గ్రామాల నుంచి నెమ్మదిగా పలాయనం చిత్తగించారు. అయితే విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా యూనియన్ సైన్యాలు మూడేళ్ల పాటు తెలంగాణలోనే తిష్టవేసి, చెమటోడ్చవలసి వచ్చింది. ఎందుకోసం? ఆరోజుల్లో హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్ర మహాసభలో భాగంగానూ, స్టేట్ కాంగ్రెస్ పేరుతోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ గానీ, తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరును నడిపిన కమ్యూనిస్టులు గానీ ఈ సెప్టెంబర్ 17 నాడు పెద్దగా హడావుడి చేయక పోవడానికి కార ణమేమిటి? ‘ఊరూరా పండుగ చేద్దాం, ఊరినిండా జాతీయ జెండాను ఎగురవేద్దాం’ అంటూ హడావుడి చేస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ, దానికి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ కానీ అప్పటికి పుట్టనే లేదు. మరి ఎందుకని ఇంత ఉత్సాహం చూపుతు న్నట్టు? ఈ డెబ్బయ్యేళ్ల కాలగతిలోనే ఈ ప్రశ్నలకు సమా ధానాలున్నాయి. ఆనాటి నిజాం రాజ్యమైన హైదరాబాద్ రాష్ట్రంలో పదహారు జిల్లాలున్నాయి. ఎనిమిది జిల్లాలు తెలుగు మాట్లాడే ప్రజలున్న తెలంగాణ ప్రాంతం. ఐదు జిల్లాల్లో మరాఠీ మాతృభాష, మూడు జిల్లాలు కన్నడ ప్రాంతాలు. మాతృభాషలో విద్యాబోధన వుండేది కాదు. ఉర్దూ మీడియం స్కూళ్లు కూడా స్వల్పంగానే వుండేవి. వ్యవసాయ భూమిలో 70 శాతానికి పైగా దొరలు, జాగిర్దార్లు, దేశ్‌ముఖ్‌ల చేతుల్లో వుండేది. రైతు లందరూ దాదాపుగా కౌలుదార్లే. ఏ కొద్దిమంది రైతులకో సొంత భూమి వుండేది. గ్రామాల్లో పరిపాలనంతా దొరలూ, దేశ్‌ముఖ్‌లదే. ఇష్టానుసారం రైతులను భూముల నుంచి బేదఖల్ (కౌలు తొలగింపు) చేసేవారు. కింది కులాల ప్రజలు దొరలకు, అధికారులకు వెట్టిచాకిరీ చేయాల్సి వచ్చేది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. మరాఠీ, కన్నడ ప్రాంతాల్లో కూడా ఇదేవిధమైన సంస్థలు ఏర్ప డ్డాయి. తొలిరోజుల్లో చిన్నచిన్న రాయితీలకోసం, కనీస మైన ప్రజాస్వామిక హక్కులకోసం (సభలు జరుపుకో వడం వంటివి) మహజర్లు సమర్పించుకోవడానికి ఆంధ్ర మహాసభ పరిమితమైంది. గ్రామ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకున్న ధనిక రైతు కుటుంబాల వారి సంఖ్య ఆంధ్ర మహాసభలో పెరగసాగింది. కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మాడ పాటి హనుమంతరావు, మందుముల నర్సింహారావు వగైరాలు జాతీయవాదాన్ని బలంగా వినిపించేవారు. అంటే భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి పూర్వరూపంలా వీరు వ్యవహరించారు. మహాసభలో చురుగ్గా వుంటున్న రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహా రెడ్డి మొదలైన వారిపై కమ్యూనిస్టు భావాల ప్రభావం పడింది. వారి నాయకత్వంలో ఆంధ్ర మహాసభ సమర శీల స్వభావాన్ని సంతరించుకోసాగింది. వెట్టిచాకిరీని, బలవంతపు లెవీ వసూళ్లను నిషేధిస్తూ నిజాం జారీచేసిన ఫర్మానాలను అమలు చేయించుకోవడం కోసం కూడా న్యాయపోరాటాలు చేయవలసి వచ్చేది. అప్పటి నల్ల గొండ జిల్లాలో సూర్యాపేట, జనగామ తాలూకాలు భౌగోళికంగా దగ్గరగా వుండేవి. ఈ ప్రాంత నాయకులైన దేవులపల్లి వేంకటేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, నల్లా నర్సింహులు తదితరులు మిలిటెంట్ పోరాటా లతో భూస్వాములను హడలెత్తించారు. సూర్యాపేట తాలూకాను ఆనుకుని వున్న మునగాల పరగణా అప్పుడు బ్రిటిష్ ఇండియాలో భాగం. పరగణాలో జమీందారీ వ్యతిరేక పోరాటాలను పర్యవేక్షించడానికి వచ్చే ఆంధ్ర ప్రాంత కమ్యూనిస్టు నాయకులైన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావుల ప్రభావం ఈ నాయకులపై పడింది. పాలకుర్తి, కడవెండి గ్రామాల్లో భూస్వాముల ప్రైవేట్ సైన్యాలకు వ్యతిరేకంగా వేలాదిమంది ప్రజలను సమీకరించి వడిసెల రాళ్లతో యుద్ధం చేసే వ్యూహాన్ని కమ్యూనిస్టులు అమలు చేసి విజయం సాధించారు. పాలకుర్తి పోరాటానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తి. కడవెండి పోరులో దొడ్డి కొమరయ్య తుపాకీ కాల్పులకు నేలకొరి గిన తొలి అమరుడిగా నిలిచిపోయాడు. ఆ వెంటనే బాలెంల, పాతసూర్యాపేట గ్రామాల్లో ఇదే తరహా ప్రజా యుద్ధం. ఈసారి నిజాం సేనలనూ ప్రజలు తరిమికొ ట్టారు. ఈ దశలోనే రైతాంగ సాయుధ పోరాటంలోని తొలి తుపాకీని భీమిరెడ్డి నర్సింహారెడ్డి చేతబూనాడు. సాయుధ దళాలు ఏర్పడి రైతులకు భూస్వాముల భూములను పంచడం ప్రారంభించాయి. దొరలు గడీ లను వదిలి పారిపోయారు. మూడువేల గ్రామాల్లో కమ్యూనిస్టులు గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఊరిలో సాయుధ రక్షణ దళాలను ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టు గెరిల్లా దళాలకు, నిజాం సేనలకు ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైంది. గ్రామాల మీద రజాకార్లు, నిజాం సేనలూ దాడిచేసి బీభత్సం సృíష్టించేవారు. ఒక్క భైరాన్‌పల్లి గ్రామంలోనే వందమందికి పైగా కమ్యూని స్టులను ఊచకోత కోశారు. ఎంత బీభత్సం జరిగినా రైతులు తమకు కమ్యూనిస్టులు పంచిన భూములను సాయుధులై రక్షించుకున్నారు. మూడువేల గ్రామాల్లో నిజాం పాలన దాదాపుగా అంతమైంది. ఈ దశలోనే నిజాంరాజుకు, ఢిల్లీ సర్కార్‌కు మధ్య ఉత్తర ప్రత్యుత్త రాలు జరిగాయి. విలీనఘట్టం పూర్తయింది. యూని యన్ మిలిటరీ కమ్యూనిస్టుల వేట మొదలుపెట్టింది. ‘విముక్త’ గ్రామాల నుంచి పారిపోయిన భూస్వాములు, షేర్వాణి, రూమీటోపీలను పడేసి, ఖద్దరు బట్టలు, గాంధీ టోపీలు ధరించి మళ్లీ గ్రామాల్లోకి ప్రవేశించారు. రావి నారాయణరెడ్డి తదితర కమ్యూనిస్టులు ఇక సాయుధ పోరాటం అనవసరమని వాదించారు. కొందరు కొన సాగించాలని పట్టుపట్టారు. విలీనం తర్వాత కూడా మూడేళ్ల పాటు యూనియన్ సైన్యాలతో పోరాటం సాగింది. నిజాంసేనలు – రజాకార్ల దాడుల్లో మరణిం చిన వారికంటే భారతసైన్యం దాడుల్లోనే ఎక్కువమంది కమ్యూనిస్టులు, వారి సానుభూతిపరులు చనిపోయారు. ఈ పోరాటాల్లో ఐదువేల మంది చనిపోయారు. 1951 చివర్లో సాయుధపోరును విరమిస్తున్నట్టు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. యాదృచ్ఛికమే అయినా, ఈ పోరా టంలో తొలి తుపాకీని అందుకున్న భీమిరెడ్డి నర్సింహా రెడ్డే విరమణ తర్వాత తుపాకీ దించిన ఆఖరివాడుగా మిగలడం విశేషం. పోరాట విరమణ జరిగిన కొద్ది రోజులకే దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ సీట్లున్నాయి. అందులో తెలంగాణ ప్రాంతం సీట్లు 95. అప్పటికింకా కమ్యూనిస్టు పార్టీపై నిషేధం కొనసాగుతున్నది. పీడీఎఫ్ పేరుమీద ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. మిలిటెంట్ నాయకత్వ మంతా అజ్ఞాతంలోనే ఉంది. ఎన్నికల సన్నద్ధత లేకుం డానే పోటీ చేసి తెలంగాణ ప్రాంతంలో 36 సీట్లలో గెలిచారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచింది 38 సీట్లు. పూర్తి సామర్థ్యంతో ఎన్నికల్లో పాల్గొని వున్నట్లయితే ఆ రోజున తెలంగాణలో నెంబర్ వన్ స్థాయిలో కమ్యూని స్టులే వుండేవారు. ఆ స్థాయి నుంచి జారుకుంటూ దాదాపు ఉనికిలేని స్థాయికి కామ్రేడ్స్ చేరుకున్నారు. ఈ పరిస్థితికి చీలికలు పేలికలు కావడం ఒక కారణమైతే, మారుతున్న దేశ కాల పరిస్థితులను అవగతం చేసుకోవ డంలో వైఫల్యం, మారుతున్న ప్రజల ఆకాంక్షలను, అవసరాలను చదవడంలో దారుణ వైఫల్యం ఇతర ప్రధాన కారణాలు. ప్రజలకోసం పోరాడినవాళ్లు, త్యాగాలు చేసినవాళ్లు కాబట్టి, నిజాయితీపరులూ, నిరాడంబరులు కాబట్టి చాలాకాలం పాటు కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించినప్పటికీ, ఆ పార్టీ నాయకుల ఉపన్యాసాల్లో వాడే యాంత్రిక భాషతో వారు కనెక్ట్ అయ్యేవారు కాదు. కాలం అనేక అవకాశాలను వారికి కల్పించింది. అందిపుచ్చుకోవడంలో వారి వైఫల్యం కారణంగా ప్రత్యా మ్నాయాలను కాలం సృష్టించుకున్నది. తెలంగాణ కాంగ్రెస్ దృష్టిలో సెప్టెంబర్ 17 అంటే తలమీద రూమీ టోపీకి బదులు గాంధీ టోపీ వచ్చిన రోజు. కమ్యూనిస్టుల దృష్టిలో మరింత కడగండ్లపాల్జేసిన రోజు. కనుక వారి దృష్టిలో ఈ తారీఖుకు ప్రాధాన్యత లేదు. మరి అప్పుడు ఉనికేలేని బీజేపీకి ఎందుకింత ఉబలాటం? తెలంగాణ భావోద్వేగ కెరటాల్లో తేలిపోయి అధికారాన్ని అందుకోగల ఒక అవకాశంగా సెప్టెంబర్ 17ను ఆ పార్టీ భావిస్తున్నది. బీజేపీతో పోల్చదగిన విజయగాధ ఈ దేశంలో మరో పార్టీకి లేదు. 1951లో జనసంఘ్ పేరుతో దాని పుట్టుక. తొలి ఎన్నికల్లో పార్లమెంట్లో వచ్చిన సీట్లు మూడు. 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనతా పార్టీగా విలీనమయ్యే వరకు జనసంఘ్ పేరుతో పార్ల మెంట్లో సాధించిన అత్యధిక సీట్ల సంఖ్య 35. జనతా పార్టీ నుంచి బయటికి వచ్చిన అనంతరం బీజేపీ ఏర్పడి తొలి ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత కాలానుగుణమైన వ్యూహాలతో ప్రజల భావోద్వే గాలను ఆసరా చేసుకొని అనూహ్యస్థాయి విజయశిఖరా లకు చేరుకున్నది. ఇప్పుడు తెలంగాణలో గద్దెనెక్కడానికి పనికొచ్చే అస్త్రాల్లో సెప్టెంబర్ 17 ఒక దివ్యాస్త్రంగా ఆ పార్టీకి కనిపిస్తున్నది. ఇప్పటికిప్పుడు ప్రజాభిప్రాయాలను గమనంలోకి తీసుకుంటే మరో రెండు మూడేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలోకి నెట్టి వేసి ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించవచ్చని అనిపిస్తు న్నది. బీజేపీ కలలు ఫలించి ఒక రోజున ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే తెలంగాణలో సెప్టెంబర్ 17 ప్రభుత్వ సెలవు దినంగా మారుతుంది. లేకుంటే మీడి యాలో ‘చరిత్రలో ఈ రోజు’ శీర్షిక కింద ఒక అంశంగా మిగులుతుంది. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
హైదరాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆరంభం
ఆ నేడు 1943 నవంబర్ 14: స్టాక్ ఎక్స్ఛేంజ్ అనగానే మనకు ముంబాయే గుర్తొస్తుంది కానీ, హైదరాబాద్‌లో 1942 న వంబర్లోనే స్టాక్ఎక్స్ఛేంజ్ని నెలకొల్పారని తెలుసా? నాటి బ్రిటిష్ ఇండియాలో ఆర్థికమంత్రి గులాబ్ మహమ్మద్ నేతృత్వంలో కమిటీ ఏర్పడి, స్టాక్ ఎక్స్ఛేంజ్ను స్థాపించవలసిన ఆవశ్యకతను చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వెంటనే స్టాక్ ఎక్స్ఛేంజ్ను నెలకొల్పారు. పురుషోత్తం దాస్ ఠాకూర్ దాస్ అధ్యక్షుడిగా ఏర్పడిన ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1943 నవంబర్ 14న ఆరంభం అయింది. అహ్మదాబాద్, బాంబే, కలకత్తా, మద్రాస్, బెంగళూరు స్టాక్ ఎక్స్ఛేంజ్ల తర్వాత ఇది ఆరవది. 1958లో జంటనగరాల నుంచి పని చేసేవిధంగా దీనికి తాత్కాలిక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలు పెరగడంతో 1983 నుంచి శాశ్వత ప్రాతిపదికన గుర్తింపు వచ్చింది. తొలుత కోఠీలోని ఓ అద్దెభవనంలో ఆరంభమైన హెచ్ఎస్ఈ ఆ తర్వాత అనేక స్థలాలు, భవనాలు మారి చివరికి సోమాజిగూడలోని ఓ సువిశాల ప్రాంగణంలోకి మారింది. అయితే సెబీతో సర్దుబాట్లు కుదరని కారణంగా 2007లో దీని గుర్తింపు రద్దయింది. -
మద్రాసు తీరాన్ని వీడని పీడకల
మొదటి ప్రపంచ యుద్ధం ఆగస్ట్ 4, 1914న ఆరంభమైంది. నెలా పదిహేను రోజుల తరువాత సరిగ్గా సెప్టెంబర్ 22 రాత్రి 8 గంటల వేళ ఎండెన్ మద్రాస్ నౌకాశ్రయంలో ప్రవేశించి ఎలాంటి హెచ్చరికలు లేకుండా బాంబుల వర్షం కురిపించి, కాల్పులు జరిపింది. చరిత్ర గతిని మార్చిన ఏ ఘటన అయినా మొత్తం భూగోళాన్ని కదలించక మానదు. మొదటి ప్రపంచ యుద్ధం (గ్రేట్‌వార్) అలాంటిదే. ఆ మహా మారణహోమం ప్రధానంగా యూరప్ ఖండంలోనే జరిగినా, భారతావనితో పాటు, దక్షిణ భారతదేశం మీద కూడా దాని నీడ కని పిస్తుంది. నాటి బ్రిటిష్ ఇండియా నుంచి పది లక్షల మంది సైనికులు ఆ యుద్ధంలో పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ యుద్ధం నూరేళ్ల సందర్భాన్ని నిర్వహించు కుంటోంది. కాబట్టి చెన్నై అని పిలుచుకుంటున్న మద్రాస్ నౌకాశ్రయంలో ఎస్ఎంఎస్ ఎండెన్ అనే జర్మనీ నౌక వీర విహారం చేసిన ఘటనను కూడా గుర్తు చేసుకుంటున్నారు. 1914 సంవత్సరం తొలి అర్ధభాగంలో ఎలాంటి గందర గోళం లేకుండా కార్యకలాపాలు నిర్వహించిన ఎండెన్ నౌక, సెప్టెంబర్ తరువాత జర్మనీ యుద్ధ కండూతిని ప్రతిబింబిం చేలా వ్యవహరించింది. ‘జూన్ సంక్షోభం’ తరువాత పూనకం వచ్చినట్టు వ్యవహరించింది. బ్రిటిష్ నౌకా దళాధిపతిగా విన్స్టన్ చర్చిల్ పని చేసిన కాలమది. బోస్నియా రాజధాని సరాయేవోలో జూన్ 28న ఆస్ట్రియా- హంగేరీ యువరాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీ చోటెక్ను సెర్బు జాతీయవాది గవ్రిలో ప్రిన్సిప్ హత్య చేయ డం, తరువాత జరిగిన పరిణామాలను జూన్ సంక్షోభంగా పేర్కొంటారు. ఇదే మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. నిజానికి ఫెర్డినాండ్ హైదరాబాద్ నగరానికి కూడా వచ్చాడు. నిజాం నవాబు మొదటి ప్రపంచ యుద్ధం కోసం హైదరాబాద్ సంస్థానం వంతు వాటా ఇచ్చాడు కూడా. మొదటి ప్రపంచ యుద్ధం ఆగస్ట్ 4, 1914న ఆరంభమైం ది. నెలా పదిహేను రోజుల తరువాత సరిగ్గా సెప్టెంబర్ 22 రాత్రి 8 గంటల వేళ ఎండెన్ మద్రాస్ నౌకాశ్రయంలో ప్రవేశించి ఎలాంటి హెచ్చరికలు లేకుండా బాంబుల వర్షం కురిపించింది. కాల్పులు జరిపింది. ఈ ప్రతిధ్వనినీ, ఆ బీభత్సాన్నీ నేటికీ మద్రాస్ మరచిపోలేదు. ఎండెన్ అనే పదం తమిళంతో పాటు, సింహళం, తెలుగు భాషలలో ఒకటైపోయింది. ఈ పదం 1930, 1940 దశకాలలో వచ్చిన తెలుగునాట సాహి త్యంలో విరివిగా కనిపిస్తుంది. తెగువ, మొండితనం, మూర్ఖ త్వం ఉన్న వారిని ఎండెన్ అని పిలవడం నేడు కూడా ఉంది. ఇప్పటికీ తమిళనాడులో అన్నం తినకుండా మారాం చేసే పిల్లలను భయపెట్టడానికి తల్లులు, ఎండెన్ మళ్లీ వస్తుందని భయపె డుతూ ఉంటారు. ‘అవాన్ థాన్ ఎండెన్’ (వాడు ఎండెన్) అని కూడా ప్రయోగిస్తూ ఉంటారు. సింగాటో కేంద్రంగా పనిచేసే జర్మన్ నౌకాదళంలో ఎండెన్ ఒక నౌక. చైనాలోని సింగాటో అప్పుడు జర్మనీ స్వాధీనంలో ఉండేది. ఇదే కేంద్రంగా ఆసియాలో- ముఖ్యంగా చైనా, జపాన్, మలేసియా పరిసరాలలో జర్మనీ వాణిజ్యం నిర్వహిం చేది. ఈ నౌక కెప్టెన్ కార్ల్ వాన్ ముల్లర్. నిజానికి గ్రేట్‌వార్ ఆరంభం కాగానే సింగాటో నౌకాదళాన్ని రావలసిందిగా జర్మనీ ఆదేశించింది. కానీ ఆసియా ప్రాంత సముద్ర జలాలలో ఉండి మిత్ర రాజ్యాల (బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జపాన్) నౌకల భర తం పట్టడానికి ముల్లర్ ప్రత్యేక అనుమతి పొందాడు. 1914 సెప్టెంబర్‌లో ఎండెన్ ఆరు బ్రిటిష్ నౌకలను ముంచింది. అవన్నీ సరుకు రవాణా నౌకలే. అందుకే ముల్లర్ మానవతా దృష్టిని ప్రశంసిస్తూ ప్రపంచ పత్రికలు వార్తలు రాశాయి. ఆ దాడులలో 16 మంది చనిపోగా, రవాణా అవుతున్న 70,825 టన్నుల సరుకు ధ్వంసమైంది. రెండు ఆంగ్లో-పర్షియన్ చమురు నౌకలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఎండెన్ మద్రాసు నౌకాశ్రయంలో ప్రవేశించింది. వాటిని ధ్వంసం చేయడంతో ఆకాశం మొత్తం పొగతో నిండిపోయి, నగరవాసులు భయ కంపితులయ్యారు. మద్రాస్ చేరగానే ఎండెన్ మొదట తీరానికి దగ్గరలోనే ఉన్న బర్మా ఆయిల్ కంపెనీకి చెందిన నౌకను పేల్చివేసింది. బ్రిటిష్ సామ్రాజ్యంలో భారత్ వెలకట్టలేని వలస అని, ఆ వలసలోనే బ్రిటిష్ (ఆ దేశం బలమంతా నౌకాదళమే) జాతి పరువు తీయాలన్నదే జర్మనీ ఉద్దేశం. తరువాత తూర్పు దిక్కుగా కదిలిన ఎండెన్ మలయా లోని పన్గాంగ్ దగ్గర ఉన్న రష్యా నౌక జమ్చుగ్ను కూడా అక్టోబర్ 8న ముంచింది. వాటితో పాటు మరో మూడు నౌకలను కూడా నాశనం చేసింది. మూడు మాసాల పాటు ఇదే రీతిలో పసిఫిక్, హిందూ మహాసముద్ర జలాలలో ఇది అల జడి సృష్టించింది. జావా, సుమత్ర, రంగూన్‌లలో ఎండెన్ బీభ త్సం సృష్టించింది. ఇలా ఇష్టారాజ్యంగా ధ్వంసం చేయగలగ డానికి కారణం- జర్మన్ సిబ్బంది ఎండెన్ను బ్రిటిష్ నౌక హెచ్ ఎంఎస్ యార్మౌత్ అని భ్రమింపచేసేవారు. ఆఖరికి ఆస్ట్రేలి యాకు సమీపంలోని కొకోస్ దీవుల దగ్గరకు వచ్చింది. అప్పుడే ఆస్ట్రేలియాకు చెందిన హెచ్ఎంఏఎస్ సిడ్నీనౌక ఎదురుదాడి చేయడంతో ఎండెన్ పతనమైంది. ఆ ద్వీపంలో 1950 వరకు దాని శిథిలాలు ఉన్నాయి. గోపరాజు నారాయణరావు