న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్చేంజ్‌లో కొత్తగా లిస్టైన ఆర్‌బీఎల్ బ్యాంక్ షేరు బుధవారం ర్యాలీ జరిగింది. బీఎస్‌ఈలో 33 శాతంమేర ఎగసి రూ.299.3 వద్ద ముగిసింది. ఇది ఇ ష్యూ ధర (రూ.225)తో పోలిస్తే 33 శాతం అధికం. ఆర్‌బీఎల్ షేరు లిస్టింగ్ రూ.274 వద్ద ప్రారంభమయ్యింది. ఇది ఇష్యూ ధరతో పోలిస్తే 22 శాతం ఎక్కువ. ఇంట్రాడేలో షేరు ధర 35.55 శాతం పెరిగి రూ.305 గరిష్ట స్థాయికి చేరింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో ఆర్‌బీఎల్ షేరు ధర 33 శాతం వృద్ధితో రూ.299.4 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 2 కోట్లకుపైగా, ఎన్‌ఎస్‌ఈలో 7 కోట్లకుపైగా షేర్లు ట్రేడయ్యాయి. బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.11,068 కోట్లుగా ఉంది. ఈ బ్యాంకు గతవారంలో ఐపీవోకు వచ్చిన విషయం తెలిసిందే.