న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్‌లో మరింత విస్తరించే దిశగా ఎన్‌ఎస్‌ఈ కొత్త కాంట్రాక్టులను జోడిస్తోంది. సోమవారం ఒకేసారి 13 నూతన కాంట్రాక్టులను ప్రారంభించినట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. కమోడిటీ డెరివేటివ్స్‌లో ఎన్‌ఎస్‌ఈ ఆఫర్ చేస్తున్న ఉత్పత్తుల సంఖ్య 28కి చేరింది.
గోల్డ్ 1కేజీ ఫ్యూచర్స్, గోల్డ్ మినీ ఫ్యూచర్స్, సిల్వర్ మినీ ఫ్యూచర్స్, కాపర్ ఫ్యూచర్స్, జింక్ ఫ్యూచర్స్, గోల్డ్ గినియా (8గ్రాములు) ఫ్యూచర్స్, అల్యూమినియం ఫ్యూచర్స్, అల్యూమినియం మినీ ఫ్యూచర్స్, లెడ్ ఫ్యచర్స్, లెడ్ మినీ ఫ్యూచర్స్, నికెల్ ఫ్యూచర్స్, జింక్ ఫ్యూచర్స్, జింక్ మినీ ఫ్యూచర్స్‌లో ‘ఆప్షన్ ఆన్ ఫ్యూచర్స్’ను ఎన్‌ఎస్‌ఈ తాజాగా ప్రారంభించింది. ఇంధనం, బులియన్, బేస్ మెటల్స్‌లో అన్ని ఉత్పత్తులకు సంబంధించి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అందిస్తున్నట్టు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది.
దీంతో ఇన్వెస్టర్లు కమోడిటీ మార్కెట్లో రిస్క్‌ను సమర్థవంతంగా హెడ్జ్ చేసుకోవచ్చని ఎన్‌ఎస్‌ఈ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. గత కొన్ని రోజుల్లో ఎన్‌ఎన్‌ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, సిల్వర్‌కు సంబంధించి ఆరు నూతన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించడం గమనార్హం. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణతో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment