సుబ్రమణియన్‌ పని అయ్యింది.. ఇక చిత్రనే మిగిలింది! | CBI court dismisses Chitra Ramakrishna anticipatory bail in NSE Co location Scam case | Sakshi
Sakshi News home page

చిత్రా రామకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధం !

Published Sat, Mar 5 2022 1:40 PM | Last Updated on Sat, Mar 5 2022 1:49 PM

CBI court dismisses Chitra Ramakrishna anticipatory bail in NSE Co location Scam case - Sakshi

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీలో సంచలనం రేపిన కో లొకేషన్‌ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి చిత్ర రామకృష్ణన్‌ అరెస్టుకు రంగం సిద్ధమయ్యింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆమె దరఖాస్తు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ఏ క్షణమైనా చిత్ర రామకృష్ణ అరెస్టు కావచ్చనే ప్రచారం ఊపందుకుంది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీకి చిత్ర రామకృష్ణన్‌ గతంలో ఎండీగా పని చేశారు. ఈ సమయంలో ఓ అదృశ్య యోగి ఆజ్ఞల మేరకు ఆమె రహస్య సమాచారం లీక్‌ చేశారు. అంతేకాకుండా అదృశ్య యోగి ఆదేశాలంటూ అనర్హులను అందలం ఎక్కించారు. మొత్తంగా ఆమె పదవీ కాలంలో ఎన్‌ఎస్‌ఈలో ఎన్నో అవకతవకలు జరిగాయి. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది.

కో లొకేషన్‌ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారి, అదృశ్య యోగి అనే అనుమానాలు ఉన్న సుబ్రమణియన్‌ను ఇప్పటికే చెన్నైలో సీబీఐ అరెస్ట్‌ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు 2022 మార్చి 6 వరకు అతన్ని విచారించనుంది. అతని విచారణ ముగిసిన వెంటనే చిత్రా రామకృష్ణన్‌ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. 

చదవండి: ఎన్​ఎస్​ఈ కేసులో చిత్రా రామకృష్ణకు లుక్​ఔట్​ నోటీసులు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement