ఒడిదుడుకుల మధ్య సూచీలు జనవరి 9న వరుసగా రెండో సెషన్‌లో లాభాలతో ముగిశాయి. మంగళవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 30.99 పాయింట్ల లాభంతో 71,386 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు లాభంతో 21,544.80 వద్ద మార్కెట్లు ముగిశాయి.
నిఫ్టీలో హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్స్ మరియు అదానీ ఎంటర్‌ప్రైజెస్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
బ్యాంక్ ,ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాలలో ఆటో, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్ రియల్టీ ఒక్కొక్కటి 0.5-2.5 శాతం వృద్ధిని సాధించాయి. లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment