యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపులో జాప్యం దేశీయ స్టాక్ సూచీలకు కలిసి వచ్చింది. ఫలితంగా మంగళవారం ఉదయం స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమై.. మార్కెట్‌లు ముగిసే సమయానికి లాభాలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. చైనా, హాంకాంగ్ మినహా గ్లోబల్ మార్కెట్‌లు ఆశించిన స్థాయిలో రాణించ లేనప్పటికి భారత్ స్టాక్ మార్కెట్లు మరిన్ని లాభాల్ని పుంజుకున్నాయి.
ఇక మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 454.67 పాయింట్లు లాభంతో 72,186 వద్ద, నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 21,939.20 వద్ద ముగిశాయి.
బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, మారుతి సుజికి, విప్రో, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, లార్సెన్ షేర్లు లాభాలు గడించగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బ్రిటానియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, కొటక్ మహీంద్రా, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment