
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ శుక్రవారం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 1000 పాయింట్ల నష్టంతో 32538 వద్ద, నిఫ్టీ 300 పాయింట్లను కోల్పోయి 960 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 995 పాయింట్లను కోల్పోయి 19,840 వద్ద ట్రేడింగ్ ట్రేడ్ అవుతోంది.
అగ్రరాజ్యమైన అమెరికా ఫెడ్ ఛైర్మన్ ఆర్థిక వృద్ధి, రికవరీపై ఆందోళన వ్యక్తం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు నెలకొన్నాయి. ఫలితంగా నిన్నటి రోజున యూరప్ మార్కెట్లు 4 శాతం నష్టపోయాయి. రాత్రి అమెరికా ప్రధాన సూచీలైన డోజోన్స్ 7శాతం, ఎస్‌అండ్‌పీ 6శాతం, నాస్‌డాక్ 5శాతం కుప్పకూలాయి. నేడు ఆసియాలోనూ మార్కెట్లన్ని నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఇక దేశీయ అంశాలను పరిశీలిస్తే... ఏప్రిల్ నెల పారిశ్రామికోత్పత్తి, మే నెల ద్రవ్యోల్బణ గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ అధ్యక్షతన జీఎస్‌టీ కౌన్సిల్ 40 సమావేశం జరగనుంది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటర్స్‌తో పాటు 30 కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల కానున్నాయి. ఈ పరిణామాల నేపధ్యంలో నేడు ఇన్వెస్టర్ల అప్రమత్తత వహించే అవకాశం ఉంది.
నిఫ్టీ-50 ఇండెక్స్‌లో ఒక్క సన్‌ఫార్మా మాత్రమే అరశాతం లాభంతో ట్రేడ్ అవుతోంది. కోటక్ బ్యాంక్, జీ లిమిటెడ్, ఓఎన్‌జీసీ, టాటామోటర్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 4శాతం నుంచి 6శాతం నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment