రిలయన్స్ ఇండస్ట్రీస్ 4శాతం ర్యాలీ అండతో నిఫ్టీ ఇండెక్స్ శుక్రవారం ఇంట్రాడే నష్టాల నుంచి కోలుకుని 21 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,194 వద్ద స్థిరపడింది. అయితే సాంకేతికంగా కీలకమైన 11200 స్థాయిని నిలుపుకోలేకపోయింది. నిఫ్టీ వీక్లీ, డైలీ ఛార్ట్‌లో బుల్లిష్ క్యాండిల్ ఏర్పాటైనప్పటికీ.., ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించాలని వహించాలని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీకి కొనుగోళ్ల మద్దతు లభించి మరింత ర్యాలీ చేస్తే 11,300-350 పరిధిలో అమ్మకాల ఒత్తిడికి ఏర్పడుతుందని వారంటున్నారు. ఇక డౌన్‌ట్రెండ్ 11,100 వద్ద కీలకమైన మద్దతు స్థాయిని కలిగి ఉందని వారు అంచనావేస్తున్నారు. వచ్చే వారం లాభాల బుకింగ్‌కు అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నాగరాజ్ శెట్టి అభిప్రాయపడ్డారు.
కీలక నిరోధానికి దగ్గరలో ఉప్పటికి నిఫ్టీ ఇండెక్స్ అధిక స్థాయిలో ట్రేడ్ అవుతుందని ట్రేడ్‌బుల్స్ సెక్యూరిటీస్ అధిపతి సచ్చిదానంద థక్కర్ తెలిపారు. నిఫ్టీకి కీలకమైన నిరోధస్థాయి అప్పర్‌ఎండ్ 11,300-11,377 శ్రేణిలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో షార్ట్‌టర్మ్ ట్రేడింగ్ పట్ల అప్రమత్తత అవసరం. డౌన్‌సైడ్‌లో నిఫ్టీ 10880 స్థాయిని కోల్పోతే 10,770-10,500 శ్రేణి వరకు పెద్ద ఎత్తున కరెక‌్షన్‌కు దారి తీసే అవకాశం ఉందని థక్కర్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment