నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ప్లాట్‌ఫామ్‌పై నమోదైన మదుపర్ల సంఖ్య 9 కోట్లను అధిగమించిందని సంస్థ ప్రకటించింది. గత 5 నెలల్లోనే కోటి మంది కొత్త మదుపర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపింది.
గత అయిదేళ్లలో ఎక్స్ఛేంజీ మదుపర్ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది. డిజిటలీకరణ, మదుపర్లలో అవగాహన పెరగడం, స్టాక్‌మార్కెట్లు బలంగా రాణించడం వంటివి ఇందుకు కలిసొచ్చాయని తెలిసింది. ఎక్స్ఛేంజీలో నమోదైన ఖాతాదారు కోడ్‌ల సంఖ్య 16.9 కోట్లకు చేరింది.
2023 డిసెంబరు చివరికి ఫండ్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.50,77,900.36 కోట్లకు చేరింది. నవంబరులో ఈ విలువ రూ.49,04,992.39 కోట్లుగా ఉంది. ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఓరియెంటెడ్ పథకాల్లోని రిటైల్ పెట్టుబడుల విలువ రూ.28,87,504 కోట్లకు చేరింది.
ఇదీ చదవండి: యాప్‌లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా..
ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్ పథకాలు కలిసి రూ.9,872 కోట్లను సమీకరించాయని తెలిసింది. గతేడాది డిసెంబర్ నాటికి క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా ఫండ్లలోకి రూ.17,610.16 కోట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment