
మూడురోజులుగా దూకుడు మీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు నష్టపోయి 49,411 పాయింట్ల వద్ద ట్రేడ్ అవ్వగా నిఫ్టీ 82 పాయింట్ల దిగజారి 14,785 పాయింట్లతో కొనసాగుతుంది.
కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ దెబ్బకు హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ,హెయూఎల్, ఐసీసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల బాట పట్టాయి. అదే సమయంలో దేశంలో రోజురోజుకీ ఆక్సిజన్ సిలిండర్ల వినియోగం పెరిగిపోతుండడంతో గ్యాస్ కంపెనీల షేర్లు లాభాల్ని గడిస్తున్నాయి. వాటిలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు దూకుడును కొనసాగిస్తున్నాయి.
అయితే స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి లాభాల్ని గడించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. మనదేశంలో రోజుకు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న వేళ.. అత్యవసర సాయం కింద అమెరికా సూపర్ గెలాక్సీ మిలిటరీ ట్రాన్స్ పోర్టర్స్ విమానం ద్వారా ఇండియాకు 400 ఆక్సిజన్ సిలిండర్లు, 10 లక్షల ర్యాపిడ్ కరోనా వైరస్ టెస్ట్ కిట్లు, ఇతర వైద్య పరికరాలను పంపించింది. ఇప్పుడు ఇదే అంశం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపనుందని ముదుపర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment