
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా 6రోజూ లాభాల్లో ముగిసింది. సెనెక్స్ 284 పాయింట్ల లాభంతో 34,109.54 వద్ద, నిప్టీ 82 పాయింట్లు పెరిగి 10,061 పాయింట్ల ముగిసింది. లాక్‌డౌన్ సడలింపుతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతుందనే ఆశావహన అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలో పెట్టుబడులు క్రమంగా పెరుగుతుండటం తదితర అంశాలు మార్కెట్లో కొనుగోళ్లకు పురిగొల్పాయి. మెటల్, ఫార్మా రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు జరిగాయి. మిగిలినఅన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2శాతం లాభంతో 20,940.70 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో మొత్తం 30 షేర్లలో 19 షేర్లు లాభాల్లో ముగిశాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం షేర్లు 2.50శాతం నుంచి 5.50శాతం లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్, విప్రో, ఇన్ర్పాటెల్, ఎన్‌టీపీసీ, జీ లిమిటెడ్ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం నష్టపోయాయి.