నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ని పట్టి కుదిపేస్తున్న కో లోకేషన్ కేసు, తదనంతర పరిణామాల నేపథ్యంలో సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌ఎస్‌ఈకి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఆనంద్ సుబ్రమణియన్ పని చేసిన కాలంలో పక్కదారి పట్టిన రూ.2.05 కోట్ల రూపాయలను 15 రోజుల్లోగా చెల్లించాలంటూ సెబీ నోటీసులు జారీ చేసింది. సకాలంలో ఈ డబ్బులు చెల్లించకపోతే ఆస్తుల జప్తు, బ్యాంకు ఖాతాల స్థంభన, అరెస్టు వంటివి ఎదుర్కొవాల్సి ఉంటుందంటూ ఘాటుగా హెచ్చరించింది.
సెబీ ఎండీగా చిత్ర రామకృష్ణ, ఆమెకు అడ్వైజర్‌గా ఆనంద్ సుబ్రమణియన్‌లు పని చేసిన కాలంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై సెబీ, సీబీఐలు విచారణ చేస్తున్నాయి. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అడ్వెజర్‌గా ఉన్న ఆనంద్ సుబ్రమణియన్‌ను ఆ తర్వాత కాలంలో గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవిని కూడా కట్టబెట్టారు. సెబీ విచారణలో అవినీతి విషయం వెలుగు చూడటంతో గత ఫిబ్రవరిలో రూ. 2 కోట్లు ఫైన్ విధించగా సకాలంలో చెల్లించలేదు. దీంతో జరిమానాతో పాటు అరెస్టు చేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది సెబీ.
చదవండి: Chitra Ramkrishna: కీలక ఆదేశాలు..చిత్రా అప్పీలుపై శాట్ విచారణ
Comments
Please login to add a commentAdd a comment