ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘బోట్’ కీలక నిర్ణయం తీసుకుంది. బోట్ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ ఐపీవోకు వెళ్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 2 వేల కోట్ల రూపాయల ఐపీవో ప్రాథమిక ప్రతిపాదనను క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ముందు ఉంచినట్లు సమాచారం.
డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్స్పెక్టస్ (DRHP) ప్రకారం.. ఈక్విటీ షేర్లు, అగ్రిగేటింగ్ అప్ రూ.900 కోట్ల మేర, సేల్ అగ్రిగేటింగ్ 1,100 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని రుణ చెల్లింపు కోసం ఉపయోగించనుంది. రుణ చెల్లింపు సంస్థకు ఈక్విటీ నిష్పత్తికి అనుకూలమైన రుణాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. అంతేకాదు వ్యాపార వృద్ధితో పాటు విస్తరణలో తదుపరి పెట్టుబడి కోసం దాని అంతర్గత సంచితాల(Internal cumulative)ను ఉపయోగించుకునేలా చేస్తుంది.
2013లో స్థాపించబడింది ఇమాజిన్ మార్కెటింగ్. 2014లో ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ BoAt నేతృత్వంలో హెడ్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లాంటి ఉత్పత్తులతో సెప్టెంబరు 30, 2021 నాటికి బహుళ, అధిక-వృద్ధి వినియోగదారుల వర్గాలలో వాల్యూమ్ మరియు విలువ పరంగా భారతదేశంలో ప్రముఖ మార్కెట్ స్థానాలను ఏర్పాటు చేసింది.
లాభదాయకతను కొనసాగిస్తూనే FY19 నుండి FY21 వరకు దాని నిర్వహణ ఆదాయాన్ని 141 శాతం CAGR వద్ద వృద్ధి చేయడం ద్వారా కంపెనీ వేగవంతమైన, స్థిరమైన వృద్ధి ట్రాక్ రికార్డ్‌ను ప్రదర్శించింది. యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్, క్రెడిట్ సుయిస్సె సెక్యూరిటీస్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ICICI సెక్యూరిటీలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి.
‘బోట్’ కంపెనీ కీలక ప్రకటన.. రూ. 2 వేల కోట్ల ఐపీవోతో సెబీకి ప్రతిపాదన
Published Thu, Jan 27 2022 6:08 PM | Last Updated on Thu, Jan 27 2022 6:43 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment