electronics company
-
వేగంగా వృద్ధి చెందుతున్న రంగం
ఉత్పత్తి ఆధారిత ప్రోత్రాహకాల(పీఎల్ఐ) వల్ల మొబైల్ తయారీ రంగం వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తెలిపారు. పీఎల్ఐ పథకం కింద ఈ రంగం ఇప్పటికే లక్ష్యాలను అధిగమించిందని చెప్పారు. 2014-15లో రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగం వాటా 17.4 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2024లో రూ.9.52 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఇందుకు ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ చూపినట్లు తెలిపారు.ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలు‘పీఎల్ఐ పథకం వల్ల దేశీయంగా మొబైల్ ఉత్పత్తి రంగంలో ప్రాథమికంగా రూ.9,100 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. వీటివల్ల రూ.6.61 లక్షల కోట్ల విలువైన మొబైళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 2014-15లో వీటి ఎగుమతులు కేవలం రూ.1,566 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం దాదాపు రూ.1.2 లక్షల కోట్లు విలువైన ఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ రంగం దాదాపు రూ.8.12 లక్షల కోట్లు ఉత్పత్తిని సాధిస్తుందని అంచనా. పీఎల్ఐ పథకం వల్ల మొబైల్ తయారీ రంగంలో దాదాపు లక్షకు పైగా యువతకు ఉపాధి లభించింది. ఈ వృద్ధికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎంతో తోడ్పడింది’ అని కృష్ణన్ తెలిపారు. -
తెలంగాణకు మరో అగ్రగామి సంస్థ.. రూ. 934 కోట్లతో భారీ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: మెటీరియల్ సైన్స్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. న్యూయార్క్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న కర్నింగ్ సంస్థ మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థగా నిలిచింది. 172 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని తన తయారీ కేంద్రంగా ఎంచుకున్నది. రాష్ట్రంలో 934 కోట్ల రూపాయలతో స్మార్ట్ఫోన్ల కోసం గొరిల్లా గ్లాస్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఈ తయారీ ప్లాంట్ ద్వారా సంస్థ మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అవసరమైన గొరిల్లా గ్లాస్ ను తయారు చేయనున్నది. భారతదేశంలో ఇలాంటి గొరిల్లా గ్లాస్ తయారీ ప్లాంట్ కి తెలంగాణ తొలి కేంద్రం కానున్నది. ఈ భారీ పెట్టుబడి ద్వారా వారు ఎనిమిది వందల మందికిపైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో సంస్థ సీనియర్ ఉపాధ్యక్షులు జాన్ బెయిని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. చదవండి: షర్మిల పార్టీపై రేపే నిర్ణయమా? ఈ సమావేశంలో మంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత రంగాలకు తెలంగాణ రాష్ట్రం తయారీ కేంద్రంగా మారుతున్న తీరును వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ ఈకో సిస్టం తెలంగాణలో బలోపేతమైన తీరును, అందుకోసం తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలకు పైగా కాలంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా అనేక ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, మరికొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను విస్తృతపరుస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. దీంతోపాటు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్ కాన్ కూడా భారీ ఎత్తున తమ తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని, ఫాక్స్ కాన్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వ పాలసీల పట్ల ఇచ్చిన ప్రశంసలను ప్రత్యేకంగా ఈ సమావేశంలో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లో తయారీ రంగ పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవను, ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తమకు తయారీ ప్లాంట్ కి కేంద్రంగా ఎంచుకున్నట్లు కార్నింగ్ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు. వివిధ అంతర్జాతీయ నగరాలను తమ పెట్టుబడి కోసం పరిశీలించి హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వారు మంత్రి కేటీఆర్‌కు తెలియజేశారు. Happy to share that Corning, one of the world’s leaders in material sciences has decided to invest in Telangana to setup a manufacturing plant to make Gorilla Glass for smartphones, for the first time in India 😊 Investment size of ₹934 Crore will employ 800 people but more… pic.twitter.com/baYUXByFTl — KTR (@KTRBRS) September 1, 2023 తమ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చే విషయంలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఐటీ మరియు పరిశ్రమల శాఖ నిరంతరం తమతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని, ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని వారు ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఐటి, ఐటి అనుబంధ రంగాల మాదిరిగానే ఎలక్ట్రానిక్స్ తయారీ విషయంలోనూ వేగంగా ముందుకు పోతున్న తీరు తమ దృష్టిలో ఉన్నదని, ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా ఈ పెట్టుబడి ద్వారా తమ తయారీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు సంస్థ తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి గత తొమ్మిది సంవత్సరాలకు అనేక అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయని, అయితే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఫాక్స్ కాన్ వంటి దిగ్గజ సంస్థలతోపాటు అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడుల ద్వారా భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని, తెలంగాణ రాష్ట్ర యువతకు ఈ రంగంలో లభించే ఉద్యోగ అవకాశాల అంశం తనకు అత్యంత సంతోషాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. హైదరాబాద్ కేంద్రంగా తన తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న కార్నింగ్ సంస్థకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సంస్థ కార్యకలాపాల ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కేటీఆర్ తెలిపారు. -
వచ్చే వారం 2 ఐపీవోలు
న్యూఢిల్లీ: వచ్చే వారం రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసుల ప్లాట్‌ఫామ్ కేఫిన్ టెక్నాలజీస్ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇందుకు షేరుకి రూ. 347–366 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇక ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీ ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో 20న మొదలై 22న ముగియనుంది. వివరాలు చూద్దాం.. రూ. 1,500 కోట్లకు రెడీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా కేఫిన్ ప్రమోటర్ సంస్థ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా సమీకరించే రూ. 1,500 కోట్లు ప్రమోటర్ సంస్థకు చేరనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ సంస్థకు 74.37 శాతం వాటా ఉంది. కాగా.. 2021లో కొటక్ మహీంద్రా బ్యాంకు కేఫిన్‌లో 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 16న షేర్లను కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా దేశీ మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్‌లు, వెల్త్ మేనేజర్స్ తదితరాలకు ఇన్వెస్టర్ సొల్యూషన్స్ అందిస్తోంది. రూ. 475 కోట్లకు పరిమితం ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో ద్వారా రూ. 475 కోట్లు మాత్రమే సమీకరించనుంది. మొదట్లో రూ. 760 కోట్లను సమకూర్చుకోవాలని భావించినప్పటికీ తదుపరి టార్గెట్‌లో కోత పెట్టుకుంది. ఇష్యూలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. తద్వారా ఘజియాబాద్(యూపీ), వెర్నా(గోవా)లోని ప్లాంట్ల విస్తరణను చేపట్టనుంది. లైటింగ్, ఫ్యాన్లు, చిన్నతరహా కిచెన్ అప్లయెన్సెస్ తదితర విభాగాలలో ప్రధాన బ్రాండ్లకు ఎండ్టు ఎండ్ ప్రొడక్ట్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
‘బోట్’ కంపెనీ కీలక నిర్ణయం
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘బోట్’ కీలక నిర్ణయం తీసుకుంది. బోట్ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ ఐపీవోకు వెళ్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 2 వేల కోట్ల రూపాయల ఐపీవో ప్రాథమిక ప్రతిపాదనను క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ముందు ఉంచినట్లు సమాచారం. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్స్పెక్టస్ (DRHP) ప్రకారం.. ఈక్విటీ షేర్లు, అగ్రిగేటింగ్ అప్ రూ.900 కోట్ల మేర, సేల్ అగ్రిగేటింగ్ 1,100 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని రుణ చెల్లింపు కోసం ఉపయోగించనుంది. రుణ చెల్లింపు సంస్థకు ఈక్విటీ నిష్పత్తికి అనుకూలమైన రుణాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. అంతేకాదు వ్యాపార వృద్ధితో పాటు విస్తరణలో తదుపరి పెట్టుబడి కోసం దాని అంతర్గత సంచితాల(Internal cumulative)ను ఉపయోగించుకునేలా చేస్తుంది. 2013లో స్థాపించబడింది ఇమాజిన్ మార్కెటింగ్. 2014లో ఫ్లాగ్షిప్ బ్రాండ్ BoAt నేతృత్వంలో హెడ్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లాంటి ఉత్పత్తులతో సెప్టెంబరు 30, 2021 నాటికి బహుళ, అధిక-వృద్ధి వినియోగదారుల వర్గాలలో వాల్యూమ్ మరియు విలువ పరంగా భారతదేశంలో ప్రముఖ మార్కెట్ స్థానాలను ఏర్పాటు చేసింది. లాభదాయకతను కొనసాగిస్తూనే FY19 నుండి FY21 వరకు దాని నిర్వహణ ఆదాయాన్ని 141 శాతం CAGR వద్ద వృద్ధి చేయడం ద్వారా కంపెనీ వేగవంతమైన, స్థిరమైన వృద్ధి ట్రాక్ రికార్డ్‌ను ప్రదర్శించింది. యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్, క్రెడిట్ సుయిస్సె సెక్యూరిటీస్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ICICI సెక్యూరిటీలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. -
చైనా దెబ్బకి పండగ సీజన్లో నో డిస్కౌంట్స్
గత కొద్ది రోజుల క్రితం చైనా తీసుకున్న నిర్ణయం భారతదేశ వాణిజ్యం మీద భారీ ప్రభావం పడనుంది. ప్రపంచంలో అత్యంత రద్దీ గల పోర్టుల్లో చైనాలోని నింగ్బో పోర్టు అనేది మూడవది. అయితే, అక్కడ పనిచేసే ఒక కార్మికుడు రెండు వారాల క్రితం కరోనా వైరస్ బారిన పడడంతో ఎటువంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా ఆ పోర్టును మూసివేశారు. దీంతో ప్రపంచ వాణిజ్యంతో పాటు మన దేశం మీద కూడా ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా మన దేశంలోని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ మీద ఎక్కువ ప్రభావం పడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. "ఓడరేవు మూసివేత వల్ల చైనా నుంచి రావలసిన కొన్ని నౌకలు అక్కడే ఉండిపోవడం, కొన్ని ఖాళీ కంటైనర్ నౌకలు చిక్కుకు పోవడంతో ఎలక్ట్రానిక్ భారత దేశ వాణిజ్యం మీద ప్రభావం పడింది. ఇప్పుడు ఆ నింగ్బో పోర్టు తెరవడం వల్ల అక్కడ ఉన్న నౌకలు మన దేశానికి బయలుదేరాయి. ఈ మధ్య కాలంలో ఏర్పడిన వాణిజ్య కొరతలో కనీసం 10 శాతం కొరతను పరిష్కరించాలని మేము(పరిశ్రమ) ఆశిస్తున్నాము" అని ఈఈపీసీ ఇండియా వైస్ చైర్మన్ అరుణ్ గరోడియా పేర్కొన్నారు.(చదవండి: Force SUV : గూర్ఖా.. వచ్చేస్తోంది) పండగ సీజన్‌పై భారీ దెబ్బ! ప్రస్తుతం చిప్సెట్లు, ఏసీ, రిఫ్రిజిరేటర్లలో వాడే కంప్రెసర్లు, టీవీ ప్యానెళ్ల(ఎల్ఈడీ, ఎల్ సీడీ)లో వాడే వంటి కీలక భాగాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. కనీసం 70 శాతం పరికరాలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు చైనా నుంచి ఏ కంటైనర్లు రావడం లేదు, ఫలితంగా భారతదేశంలో వీటి తయారీ పరిశ్రమల మీద ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో అనేక ప్రముఖ బ్రాండ్లు దసరా పండుగ సీజన్ కాలంలో ఇచ్చే డిస్కౌంట్స్ లను పక్కన పెట్టె అవకాశం ఉంది.(చదవండి: పాన్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక!) సాధారణంగా వారు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో ఉత్పత్తిని పెంచడం ద్వారా పండుగ సమయంలో వచ్చిన అధిక డిమాండ్ కి తగ్గట్టు వస్తువులను నిల్వ చేస్తారు. అయితే, ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడిన ఈ ఎలక్ట్రానిక్ పరికరాల కొరత వల్ల డిస్కౌంట్స్ తగ్గించడం లేదా పూర్తిగా పక్కన పెట్టె అవకాశం ఉండనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. -
ఆన్‌లైన్‌లోనూ అమ్ముతాం..
⇒ మారిన ఎలక్ట్రానిక్స్ కంపెనీల వైఖరి ⇒ ఎక్స్‌క్లూజివ్ మోడళ్లతో రంగంలోకి ⇒ మొదట్లో వద్దనుకున్నా మారిన వ్యూహం ⇒ ఈ-కామర్స్‌ను విస్మరించలేమన్నదే కారణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘మేం ఆన్‌లైన్‌కు వ్యతిరేకం. ఆన్లైన్లో మాకెవ్వరూ అధీకృత డీలర్లు లేరు. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో కొంటే వారంటీ వర్తించదు. సర్వీసింగ్ విషయంలోనూ కంపెనీ ఎలాంటి బాధ్యతా వహించదు’’... ఇదీ పలు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు గతంలో ఇచ్చిన ప్రకటన. మరిప్పుడో...! పరిస్థితులు మారాయి. ఆన్‌లైన్‌కు, ఆఫ్‌లైన్‌కు మధ్య ధరల్లో తేడా చాలా ఎక్కువగా ఉందని, ఇది స్నేహపూర్వక వ్యాపారం కాదని గతంలో ఊదరగొట్టిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇప్పుడు ఆన్లైన్ విక్రయాలకు సై అంటున్నాయి. వ్యూహాత్మకంగా ‘ఎక్స్‌క్లూజివ్’ పేరుతో రంగంలోకి దిగుతున్నాయి. ఆన్లైన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఎక్స్‌క్లూజివ్ మోడళ్లను వాటికి అప్పగిస్తున్నాయి. అంటే ఈ మోడళ్లు ఏదైనా ఒక ‘ఈ-కామర్స్’ కంపెనీ పోర్టల్‌లో మాత్రమే లభిస్తాయన్న మాట. వ్యూహం ఏదైనా... ఒక్కటి మాత్రం నిజం. అంతకంతకూ పెరుగుతున్న భారత ఈ-కామర్స్ మార్కెట్‌ను విస్మరించగలిగే పరిస్థితుల్లోనైతే ఎలక్ట్రానిక్స్ కంపెనీలు లేవు. ఒకవేళ విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని, అది తమ మనుగడనే దెబ్బతీసే ప్రమాదం ఉందని అవి భయపడుతున్నాయి. అందుకే ఆన్లైన్ బాట పడుతున్నాయి. ఇదీ... మన ఈ-కామర్స్ విశ్వరూపం భారత్‌లో ఇప్పుడిప్పుడే ఈ-కామర్స్ మార్కెట్ పుంజుకుంటోంది. మొత్తం రిటైల్ వ్యాపారం రూ.38 లక్షల కోట్లు కాగా, ఇందులో ఈ-కామర్స్ వాటా ఇంచుమించు లక్ష కోట్లు. దీన్లో ఆన్లైన్ రిటైల్ వ్యాపారం సుమారు రూ.24,000 కోట్లు కాగా మిగతాదంతా ఈ-టికెటింగ్ తదితరాలకు వెళుతోంది. ఆన్లైన్ రిటైల్ వ్యాపారం ప్రస్తుతం స్వల్పంగానే ఉన్నా 2018 నాటికి రూ.లక్ష కోట్లకు చేరుతుందని సీఐఐ-కేపీఎంజీ నివేదిక చెబుతోంది. వీటిలో ఎలక్ట్రానిక్స్ వాటా ఎక్కువగానే ఉండటంతో పలు కంపెనీలు ఈ-కామర్స్‌ను సైతం వ్యాపార వేదికగా చేసుకుంటున్నాయి. అయితే తక్కువ ధర ఉండటం, తిరిగి పంపించే వస్తువులు కూడా ఎక్కువగానే ఉండటం, పార్ట్లు మార్చిన వస్తువులు వస్తుండటంతో సర్వీస్ సెంటర్లు గగ్గోలు పెడుతుండటం వంటి కారణాల వల్ల పలు కంపెనీలు ఆన్లైన్లో అమ్మటానికి ఇప్పటిదాకా ముందుకు రాలేదు. కానీ పోటీ కంపెనీలు ఆన్లైన్ వ్యాపారంలో కూడా గణనీయమైన వ్యాపారం చేస్తుండటంతో మిగతా కంపెనీలూ ఆ దార్లోకి రాక తప్పటం లేదు. ఇందుకోసం కొత్త మార్గాన్ని ఎన్నుకుని... ఎక్స్‌క్లూజివ్ పేరిట తమ మోడళ్లను ప్రత్యేక ఒప్పందంతో విడుదల చేస్తున్నాయి. ఉదాహరణకు షియోమీ తన ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే విడుదల చేయగా బీభత్సమైన స్పందన వచ్చింది. చివరికి ఎప్పటికప్పుడు ఆ మోడళ్లు విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే అయిపోవటం, మళ్లీ కొన్నాళ్ల తరవాత పెట్టడం జరిగింది. లెనోవో ఎస్8 ట్యాబ్లెట్, ఏ6000 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తోంది. హెచ్‌టీసీ డిజైర్ 526జీ ప్లస్ 8జీబీ వేరియంట్, ఆర్ఈ కెమెరాను, ప్యానాసోనిక్ ఎలూగ ఎస్ మోడల్‌ను స్నాప్‌డీల్‌లో విక్రయించాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్5 మినీ మోడల్‌ను గతేడాదే ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్కెట్లోకి తెచ్చింది. ఇక సోనీ సంస్థ స్నాప్‌డీల్‌తో చేతులు కలిపింది. తన డీలర్లనే ఆన్లైన్ విక్రేతలుగా నియమించుకుంది. తద్వారా అసలైన ఉత్పత్తులు, వారంటీకి తోడు ఆఫ్‌లైన్‌కు సమానమైన ధర ఉంటుందని సోనీ ఇండియా సేల్స్ హెడ్ సునీల్ నయ్యర్ చెప్పారు. ప్యానాసోనిక్ సైతం రంగంలోకి దిగింది. జనరల్ ట్రేడ్ సేఫ్.. భారత్‌లో చిల్లర వర్తకంలో సంప్రదాయ దుకాణాల పాత్ర అత్యంత కీలకం. అందుకే కొత్త వ్యాపార వేదికైన ఆన్‌లైన్‌ను వినియోగించుకుంటూనే ఆఫ్‌లైన్‌ను కూడా విస్మరించకూడదని తయారీ కంపెనీలు నిర్ణయించాయి. అందుకోసమే పోర్టళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఎక్స్‌క్లూజివ్‌గా కొన్ని మోడళ్లను విక్రయిస్తున్నాయి. ఇవి దుకాణాల్లోగానీ, ఇతర పోర్టళ్ల వద్దగానీ లభించవు. వాస్తవానికి ఆన్లైన్ కంపెనీలు కొన్ని మోడళ్లను మార్కెట్ ధర కంటే తక్కువకే విక్రయిస్తున్నాయి. ధరలు తగ్గించి విక్రయించడంతో మార్కెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్స్‌క్లూజివ్‌గా కొన్ని మోడళ్లను ఇవ్వడం వల్ల ఇతర మోడళ్ల జోలికి ఆన్లైన్ కంపెనీలు పోవన్నది తయారీ సంస్థల భావన. ఏదైతేనేం జనరల్ ట్రేడ్‌లో తక్కువ మార్జిన్‌తో వ్యాపారం చేసేవాళ్లే ప్రస్తుత పరిస్థితుల్లో నిలదొక్కుకుంటారని టెక్నోవిజన్ ఎండీ సికందర్ వ్యాఖ్యానించారు. ఎక్స్‌క్లూజివ్ మోడళ్లతో సాధారణ ట్రేడర్ల వ్యాపారంపై ప్రభావం ఉండదని చెప్పారు. -
ఎలక్ట్రానిక్స్‌కు నిబంధనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు భారత్‌లో స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. అంతే గాక వివిధ దేశాల్లో ఆవిష్కరించిన ఉత్పత్తుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న భారతీయులు మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. దీనికి కారణం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) 2014 మార్చి 25న చేసిన సవరణ ఉత్తర్వులే. ఉత్పత్తితోపాటు ప్యాక్‌పైన బీఐఎస్ నాణ్యత ధ్రువీకరణ వివరాలను స్టిక్కర్లకు బదులు స్క్రీన్ ప్రింట్, అక్షరాలు తాకేలా(ఎంబోస్) లేదా చెక్కినట్టుగా ముద్రించడం తప్పనిసరి చేస్తూ రూపొందిన ఉత్తర్వులతో పరిశ్రమ ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. ఆచరణసాధ్యం కాని, ప్రపంచంలో ఎక్కడా లేని నిబంధనలు అంటూ కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. బీఐఎస్ నిబంధనలు ట్యాబ్లెట్ పీసీలు, ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్స్, 32 అంగుళాలు ఆపైన సైజున్న ప్లాస్మా, ఎల్సీడీ, ఎల్ఈడీ టెలివిజన్లతోపాటు సెట్‌టాప్ బాక్సులు, ప్రింటర్లు, స్కానర్ల వంటి ఉత్పత్తులకు వర్తిస్తుంది. ఆచరణ సాధ్యంకాదు.. కంపెనీలు తమ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు మారుస్తుంటాయి. అదనంగా ఫీచర్లను, సామర్థ్యాన్ని జోడించి మోడళ్లను తీసుకురావడం సహజం. ఉత్పత్తులు వివిధ ఫ్యాక్టరీల్లో తయారవుతుంటాయి. చెక్కినట్టు ముద్ర ఉండాలంటే అన్ని ప్లాంట్లలోనూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్‌ను సరఫరా చేసే యూనిట్లలో ప్రతిపాదిత లేబులింగ్ వ్యవస్థ లేదని మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎంఏఐటీ) ప్రెసిడెంట్, లెనోవో ఇండియా ఎండీ అమర్ బాబు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీలకు మరికొంత సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, బీఐఎస్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే తయారు చేశామనే ప్రకటనను ఉపకరణంపై ప్రముఖంగా ముద్రించాలని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. అక్షరాలా సైజు 12 లేదా బ్రాండ్ పేరులో 1/4వ వంతు ఉండాల్సిందే. కనీస సైజు 6కు తగ్గకూడదు. ట్యాంపర్ ప్రూఫ్ స్టిక్కర్లు లేదా ప్లాస్టిక్ లేబుల్స్ చక్కని పరిష్కారమని వీడియోకాన్ సూచిస్తోంది. కొత్తవి మరింత ఆలస్యం..: ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు దాదాపుగా విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. లేదా విడి భాగాలను కొనుగోలు చేసి ఇక్కడి కంపెనీలు అసెంబుల్ చేస్తున్నాయి. ఒక ఉత్పత్తి పనితీరును పరిశీలించి సమస్యలు లేవని భావిస్తేనే ఏ కంపెనీ అయినా వాటికి ఆర్డరు ఇస్తుంది. అయితే ఆర్డరు ఇచ్చే ముందే ఒక శాంపిల్‌ను సేకరించి బీఐఎస్‌కు పంపించాల్సిన పరిస్థితి ఇప్పుడు తలెత్తింది. ధ్రువీకరణ వచ్చేంత వరకు ఆర్డరు ఇవ్వలేని స్థితి అన్నమాట. ఈ లెక్కన నూతన ఆవిష్కరణలు సహజంగానే ఆలస్యం అవుతాయి. ఉపకరణాలకు కొరత వస్తుందని అమర్ బాబు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఆవిష్కరించినప్పటికీ, భారత్‌లో తేవడానికి సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం గనక నిబంధనలు సడలించకపోతే ధరలు పెరగడం ఖాయమని హెచ్చరించారు. అదనంగా అయ్యే వ్యయం కస్టమర్లపై మోపడం తప్ప మరో మార్గం లేదని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్పత్తులను పరీక్షించే లేబొరేటరీలు దేశవ్యాప్తంగా 11 మాత్రమే ఉన్నాయి. దీంతో వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 2 నెలలకుపైగా సమయం అయినా ఇంత వరకు తమ దరఖాస్తు ముందుకు కదల్లేదని ఒక కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. వాటికి బీఐఎస్ తప్పనిసరి.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గూడ్స్ (నిర్బంధ నమోదు ఆవశ్యకతలు) ఉత్తర్వు-2012 ప్రకారం 15 రకాల ఉత్పత్తులకు బీఐఎస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 2014 ఏప్రిల్ 4 నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. కంపెనీ ఏ దేశానికి చెందినదైనా భారత్‌లో ఉత్పత్తులను విక్రయించాలంటే బీఐఎస్ నాణ్యత ప్రమాణాలను పాటించాల్సిందే. ఇందుకోసం కంపెనీలు తమ ఉత్పత్తులను బీఐఎస్ ల్యాబొరేటరీల్లో పరీక్షించి ధ్రువీకరణ పొందాలి. ఉత్పత్తిపై ఇండియన్ స్టాండర్డ్ ప్రమాణాల ప్రకారం తయారైందని చెప్పే సెల్ఫ్ డిక్లరేషన్‌ను ముద్రించాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ లేని ఉత్పత్తులను తయారు చేయడం నిషేధం. నిల్వ, విక్రయం, దిగుమతి, పంపిణీ చేపట్టినా చట్ట పరంగా చర్యలు తీసుకుంటారు. మార్కెట్లో శాంపిళ్లను సేకరించి బీఐఎస్ అనుమతి ఉన్న టెస్టింగ్ ల్యాబ్‌లకు పంపిస్తారు. నాణ్యత లోపించినట్టు తేలితే ఉత్పత్తులను సీజ్ చేస్తారు. ఈ వివరాలను బీఐఎస్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. -
‘డిజిటల్’ మాస్టర్
అభిమానుల ఫొటోలతో సచిన్ ఛాయాచిత్రం ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు మరో గౌరవం దక్కింది. 17 వేల మందికిపైగా అభిమానుల ఛాయాచిత్రాలను ఉపయోగించి అతిపెద్ద డిజిటల్ సచిన్ ఫొటోను జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తొషిబా రూపొందించింది. ప్రపంచ క్రికెట్లో ఇప్పటిదాకా ఏ క్రికెటర్‌కి ఈ గౌరవం దక్కలేదు. ముంబైలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో మాస్టర్ తన డిజిటల్ ఫొటోను స్వయంగా ఆవిష్కరించాడు. గత జనవరి నుంచి తొషిబా సోషల్ మీడియాలో ‘వుయ్ ఆర్ సచిన్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. వారి ఫొటోలతోనే తొషిబా కంపెనీ సచిన్ ఛాయాచిత్రాన్ని రూపొందించింది. ‘సోషల్ మీడియాలో తొషిబా నిర్వహించిన ప్రచారానికి అద్భుతమైన స్పందన వచ్చింది. నా ముఖాన్ని రూపొందించేందుకు 17వేల మందికిపైగా అభిమానుల ఛాయాచిత్రాలను ఉపయోగించారు. ఈ ఛాయాచిత్రం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఫొటోలో వెనకాల మువ్వన్నెల జెండా రంగులు ఉన్నాయి. ఇంతకు మించింది మరొకటి ఉండదు’ అని సచిన్ అన్నాడు.