గత కొద్ది రోజుల క్రితం చైనా తీసుకున్న నిర్ణయం భారతదేశ వాణిజ్యం మీద భారీ ప్రభావం పడనుంది. ప్రపంచంలో అత్యంత రద్దీ గల పోర్టుల్లో చైనాలోని నింగ్‌బో పోర్టు అనేది మూడవది. అయితే, అక్కడ పనిచేసే ఒక కార్మికుడు రెండు వారాల క్రితం కరోనా వైరస్ బారిన పడడంతో ఎటువంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా ఆ పోర్టును మూసివేశారు. దీంతో ప్రపంచ వాణిజ్యంతో పాటు మన దేశం మీద కూడా ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా మన దేశంలోని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ మీద ఎక్కువ ప్రభావం పడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
"ఓడరేవు మూసివేత వల్ల చైనా నుంచి రావలసిన కొన్ని నౌకలు అక్కడే ఉండిపోవడం, కొన్ని ఖాళీ కంటైనర్ నౌకలు చిక్కుకు పోవడంతో ఎలక్ట్రానిక్ భారత దేశ వాణిజ్యం మీద ప్రభావం పడింది. ఇప్పుడు ఆ నింగ్‌బో పోర్టు తెరవడం వల్ల అక్కడ ఉన్న నౌకలు మన దేశానికి బయలుదేరాయి. ఈ మధ్య కాలంలో ఏర్పడిన వాణిజ్య కొరతలో కనీసం 10 శాతం కొరతను పరిష్కరించాలని మేము(పరిశ్రమ) ఆశిస్తున్నాము" అని ఈఈపీసీ ఇండియా వైస్ చైర్మన్ అరుణ్ గరోడియా పేర్కొన్నారు.(చదవండి: Force SUV : గూర్ఖా.. వచ్చేస్తోంది)
పండగ సీజన్‌పై భారీ దెబ్బ!
ప్రస్తుతం చిప్‌సెట్లు, ఏసీ, రిఫ్రిజిరేటర్లలో వాడే కంప్రెసర్లు, టీవీ ప్యానెళ్ల(ఎల్ఈడీ, ఎల్ సీడీ)లో వాడే వంటి కీలక భాగాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. కనీసం 70 శాతం పరికరాలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు చైనా నుంచి ఏ కంటైనర్లు రావడం లేదు, ఫలితంగా భారతదేశంలో వీటి తయారీ పరిశ్రమల మీద ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో అనేక ప్రముఖ బ్రాండ్లు దసరా పండుగ సీజన్ కాలంలో ఇచ్చే డిస్కౌంట్స్ లను పక్కన పెట్టె అవకాశం ఉంది.(చదవండి: పాన్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక!)
సాధారణంగా వారు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో ఉత్పత్తిని పెంచడం ద్వారా పండుగ సమయంలో వచ్చిన అధిక డిమాండ్ కి తగ్గట్టు వస్తువులను నిల్వ చేస్తారు. అయితే, ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడిన ఈ ఎలక్ట్రానిక్ పరికరాల కొరత వల్ల డిస్కౌంట్స్ తగ్గించడం లేదా పూర్తిగా పక్కన పెట్టె అవకాశం ఉండనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment